| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామ రామయని నోట రవ్వంతసేపైన |
| కల్యాణి - ఆది |
| పల్లవి: |
| రామ రామయని నోట రవ్వంతసేపైన నీమము తప్పక మంచి నీతితో బల్కనివాడు మత్తుడు యంధచిత్తుడు రా.. |
| చరణము(లు): |
| దేహమశాశ్వతమని తెలియని దుర్బుద్ధిచేత సాహసమున సాధుజనుల సంకట పెట్టెడివాడు పాతకి బ్రహ్మఘాతకి రా.. |
| దుర్బుద్ధిచేత సాహసమున నేను దండివాడననుచు చాల చండితనము కలిగిన పరుల దండను గోరెడువాడు నిక్కునా భువిలో దక్కునా రా.. |
| మన్ననతో పిన్న పెద్దల కన్నులు కానకను భాగ్యమున్నదని గర్వమున అన్నము బెట్టనివాడు హీనుడును స్సంధానుడు రా.. |
| ఎంతో కలిగియున్న దానధర్మము లేనివాడు హీనుడయ్యు భూమిలో నెన్నాళ్ళు బ్రతికిన నేటికి ముమ్మాటికి రా.. |
| పనిపాట తెలియకను పరుల ద్రవ్యమపహరించి కరుణలేకయే పేదసాదల కష్టపెట్టెడివాడు తట్టునా రా.. |
| దూరభారము తెలియక దుర్బుద్ధి తలపోసి మేరతప్పి పరసతుల మెల్లమెల్లగపొందెడువానికి మోసము చాలదోషము రా.. |
| స్నేహము చేసినవారికి ద్రోహము చేసినవాని కూహాకమున యముని దూతలు కుత్తుకలను మండు కత్తుల గోతురు గోతవేతురు రా.. |
| రామదాసునేలినట్టిప్రేమతో శ్రీభద్రశైల రామచంద్రుల కామించి కొలువకున్న గొబ్బునా మోక్షమబ్బునా రా.. |