| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామ రారా సీతారామ రారా రా.. |
| ఆనందభైరవి - ఆది |
| పల్లవి: |
| రామ రారా సీతారామ రారా రా.. |
| చరణము(లు): |
| రామ రారా నినుచాల రాజులందరు పిలువ వచ్చిరి క్షేమమొసగ భద్రశైలధాముడవై వెలసిన తండ్రి రా.. |
| మౌని యాగము గాచి శిలను మగువ చేసి జనకునింట శివుని విల్లు విరచి మించి సీతను చేకొన్న స్వామి రా.. |
| తపసి వేషమలవరించి తండ్రికొరకు వనమునకేగి తపనసుతుని గాచి యుదధిదాటి రావణుని ద్రుంచిన రా.. |
| లంక విభీషణుని కొసగి లలనగూడి అయోధ్యను శంకలేక ఏలుచున్న శ్రీపతి భద్రాచల నివాసా రా.. |