| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామకృష్ణ గోవింద నారాయణ శ్రీ |
| యమునాకల్యాణి - ఆది |
| పల్లవి: |
| రామకృష్ణ గోవింద నారాయణ శ్రీ రామకృష్ణ గోవింద నారాయణా రా.. |
| చరణము(లు): |
| రామకృష్ణ యనిప్రేమతో పిలిచిన మోము జూపవేమి నారాయణా రా.. |
| అండజవాహన పుండరీకాక్ష నీ దండ జేరినామయ్య నారాయణా రా.. |
| మాధవవిష్ణు మధుసూదన శేషశయన శ్రీధర శ్రీమన్నారాయణా రా.. |
| వాసుదేవా ముకుంద వనమాలి చక్రధర నారసింహాచ్యుతన్నారాయణా రా.. |
| పతితుడని నిన్ను బ్రతిమాలుకొన్న సీతా పతి నను గావవేమి నారాయణా రా.. |
| రామదాసుని బ్రోవ ప్రేమతో భద్రాచల ధాముడవైన శ్రీమన్నారాయణా రా.. |