| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ |
| మంగళహారతి (నవరోజు - తిశ్ర ఏక) |
| పల్లవి: |
| రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం రా.. |
| చరణము(లు): |
| కోసలేశాయ మందహాస దాసపోషణాయ వాసవాదివినుత సద్వరాయ మంగళం రా.. |
| చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ హారకటకశోభితాయ భూరిమంగళం రా.. |
| లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ జలదసదృశ దేహాయ చారు మంగళం రా.. |
| దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజ గురువరాయ భవ్యమంగళం రా.. |
| పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజవాహనాయ అతులమంగళం రా.. |
| విమలరూపాయ వివిధవేదాంత వేద్యాయ సుముఖచిత్త కామితాయ శుభదమంగళం రా.. |
| రామదాసాయ మృదుల హృదయ కమలనివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రా.. |