కీర్తనలు భద్రాచల రామదాసు రామచంద్రులునాపై చలముచేసినారు
అసావేరి - చాపు ( - త్రిపుట)
పల్లవి:
రామచంద్రులునాపై చలముచేసినారు
సీతమ్మ చెప్పవమ్మ నీవైన సీతమ్మ చెప్పవమ్మ రా..
అను పల్లవి:
కటకట వినడేమిచేయుదు కఠినచిత్తుని మనసు కరుగదు
కర్మము లెటులుండునో గద ధర్మమే నీకుండునమ్మా రా..
చరణము(లు):
దినదినము మీ చుట్టు దీనతతో తిరుగ దిక్కెవ్వరో యమ్మ
దీనపోషకుడనుచు వేడితి దిక్కులన్నియు ప్రకటమాయెను
ఒక్కమాటైనను వినడు ఎక్కువేమని తలతునమ్మా రా..
కౌసల్యతనయుడు కపటము చేసినాడు కారణమేముండెనో
కన్నడ చేసెదవా నీ కన్నుల వైభవముతోడ
విన్నవింపగదవమ్మ నీకన్న దిక్కెవ్వరో యమ్మ రా..
దశరథాత్మజుడెంతో దయశాలి యనుకొంటి ధర్మహీనుడోయమ్మ
దాసజనులకు దాతయతడట వాసిగ భద్రగిరీశుడు
రామదాసుని నేలరాడట రవికులాంబుధి సోముడట రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raamachaMdrulunaapai chalamucheesinaaru ( telugu andhra )