| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామజోగి మందు కొనరే ఓ జనులార రా.. |
| ఖమాఛ్ - ఆది |
| పల్లవి: |
| రామజోగి మందు కొనరే ఓ జనులార రా.. |
| అను పల్లవి: |
| రామజోగి మందుకొని ప్రేమతో భుజియించుడన్న కామక్రోధ లోభమోహ ఘనమైన రోగాలకు మందు రా.. |
| చరణము(లు): |
| కాటుక కొండలవంటి కర్మములెడబాపే మందు సాటిలేని జగమునందు స్వామి రామజోగిమందు రా.. |
| వాదుకు చెప్పినగాని వారి పాపములు గొట్టి ముదముతోనే మోక్షమిచ్చే ముద్దు రామజోగిమందు రా.. |
| ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు ముదముతో సేవించే మందు రా.. |