కీర్తనలు భద్రాచల రామదాసు రామనామ మందుకొనరే పామరులారా
నదనామక్రియ - ఆది
పల్లవి:
రామనామ మందుకొనరే పామరులారా
రామజోగి మందుకొనరే రా..
చరణము(లు):
రామజోగి మందుమీరు ప్రేమతో భుజింపరయ్య
కామక్రోధములనెల్ల గడకుపారద్రోలె మందు రా..
మదమాత్సర్య లోభములను మాటలో నిలిపెడిమందు
గుదికొన్న కర్మములను గూడక యెడద్రోలెమందు రా..
కాటుక కొండలవంటి కర్మము లెడబాపుమందు
సారెకు నీమంబు సాటిలేని భాగవతులు స్మరణచేసి తలచేమందు రా..
ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించేమందు
సదయుడైన రామదాసు సద్భక్తితో గొలిచేమందు రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raamanaama maMdukonaree paamarulaaraa ( telugu andhra )