| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామనామనవి చేకొనుమా దైవరాయ పరాకు చేయకుమా |
| అసావేరి - రూపక |
| పల్లవి: |
| రామనామనవి చేకొనుమా దైవరాయ పరాకు చేయకుమా స్వామి భద్రాచలధామ పావనదివ్యనామ గిరిజనుత భీమపరాక్రమ రా.. |
| చరణము(లు): |
| దరిలేని జనులనుగాచె బిరుదుబూని విఖ్యాతిగను గురుతరశ్రమ యింత బాధలను నీ మరుగుజేరితి నన్నరమర చేయక రా.. |
| కపట మానసుడని మదిని యెన్నకిపుడు రక్షింపు సమ్మతిని అపరాధములకునే నాలయమైతిని కృపజూడుము నాదు నెపములెన్నక స్వామీ రా.. |
| పతిత పావనమూర్తి నీవేగతియని యుండితి మదిలోన సతతము రామదాసపతివై భద్రాద్రిని అతులిత వైభవ తతులచే నెలకొన్న రా.. |