కీర్తనలు భద్రాచల రామదాసు రామపరాకు రఘురామ పరాకు
నాదనామక్రియ- తిశ్ర ఏక
పల్లవి:
రామపరాకు రఘురామ పరాకు
స్వామి భద్రశైలధామ పరాకు రా..
చరణము(లు):
శ్రీవత్స కౌస్తుభసింహ పరాకు
శ్రీవల్లభ కారుణ్య పరాకు రా..
అక్షయ పాండవపక్ష పరాకు
పక్షివాహన భక్తరక్ష పరాకు రా..
భద్రేభవరద దాసభద్ర పరాకు
చిద్రూప కరుణాసముద్ర పరాకు రా..
హీరమాణిక్య కేయూర పరాకు
తారహార యశపూర్ణ పరాకు రా..
కుంభనికుంభ నిర్దంభ పరాకు
గంభీరసమర విజృంభ పరాకు రా..
ఖండాఖండ ఉద్దండ పరాకు
చండప్రచండకోదండ పరాకు రా..
ప్రేమతో భద్రాద్రిధామ పరాకు
రామదాస పోష రామ పరాకు రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raamaparaaku raghuraama paraaku ( telugu andhra )