| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామప్రభో నీదయ నామీదను రాదేమయా శ్రీరామ |
| పునాగవరాళి - ఆది |
| పల్లవి: |
| రామప్రభో నీదయ నామీదను రాదేమయా శ్రీరామ |
| చరణము(లు): |
| పామరుడను జడుడను తామసుడను నేను వర్జితంబగు నరపశువను నీ మహత్వమెన్న నెంతటివాడను రా.. |
| రామరామయని దలంతు నిరంజన రామ పరుల వేడనంటి నీ పదయుగములే నమ్మియుంటిని నన్నరమర చేయవద్దంటిని రా.. |
| శ్రీహరి యని వేడుకొంటి మొరలిడి నంతానే కరివరునేలిన దొరవని నమ్మితి నిరసించతగదు మందరగిరిధర త్రిభువన సుందర రా.. |
| ఇందిరా సుందరీ మనోహర ఏల నాపై కోపము మున్నేమిచేసితినో పాపము నీలవర్ణ నీ రూపము రా.. |
| నిరతము కన్నుల జూపుము మేలొనరించెడి శ్రీలోలుడవని చాలనమ్మియుంటి అఘములను బాపర నేను జేసెదను నీ సేవను రా.. |
| ఆశించిన శ్రీరామదాసుని నిటు మోసము చేసిన దోషం బెవరిదో వాసవార్చితాంఘ్రిజలజయుగళ కైలాస వాసనుత భద్రగిరి హరి రా.. |