కీర్తనలు భద్రాచల రామదాసు రామహో రఘురామహో హే సీతా
సౌరాష్ట్ర - త్రిపుట
పల్లవి:
రామహో రఘురామహో హే సీతా
రామ హో రఘురామ హో రా..
చరణము(లు):
రామహో భద్రశైలధామ హో భక్తపాల
నేమహో సీతాలోలస్వామి హో సత్యశీల హో రా..
అగణితగుణధామ అజభవనుత నామ
నగధర మేఘశ్యామ నత జనాశ్రితకామ రా..
శరధిబంధన శౌర్య శతృసంహారధైర్య
గురుజనకార్యధుర్య కోమలాంగ సౌందర్య రా..
శరదిందునిభానన శతమన్మథసమాన
నిరుపమానంద ఘననిజదాసావన రామ రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raamahoo raghuraamahoo hee siitaa ( telugu andhra )