| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామా దయజూడవే భద్రాచల |
| కల్యాణి - ఆట (ధన్యాసి - ఆది) |
| పల్లవి: |
| రామా దయజూడవే భద్రాచల రామా నను బ్రోవవే సీతా రా.. |
| రామా దయజూచి రక్షించి మమ్మేలు రామా రణరంగ భీమా జగదభి రా.. |
| చరణము(లు): |
| రాజీవదళలోచన భక్తప రాధీనా భవమోచనా రాజరాజకుల రాజరాజార్చిత రాజిత వైభవ రాజలలామ రా.. |
| తాటక సంహరణా మేటి కోటి రాక్షసకోటి హరణా నీటుగా శ్రీరామకోటి వ్రాసితి నీకు సాటిలేరని సారెసారెకు వేడితి రా.. |
| దిక్కు నీవని నమ్మితి నీ పాదములు మక్కువగని మ్రొక్కితి చిక్కులుపెట్టకు శ్రీ రామదాసుని చక్కగ బ్రోవవె చక్కని జానకి రా.. |