కీర్తనలు భద్రాచల రామదాసు రామా నీ ముద్దుమోము జూపు సుందరరామా
అసావేరి - ఏక
పల్లవి:
రామా నీ ముద్దుమోము జూపు సుందరరామా
నీ ముద్దుమోము జూపరరామా భద్రాచలధామా తారకనామా రా..
చరణము(లు):
నీ ముద్దుమోము నేగంటిగా నిన్ను చాల నే నమ్మి యున్నానుగా
నేనితరదైవముల వేడబోనుగా విడువనని బిరుదు గట్టుకొన్న
నిన్నేగాని యొట్టుబెట్టుకొంటిర గొప్పుల కుప్పవంటి రా..
మురిపెంపు కొప్పు బిగివీడగా ఆణిముత్యాల సరులాడగా
లేమి కిరవయినడు మసియాడగ అట్టు బిరబిర వచ్చి
మీ పినతల్లి సుమిత్ర స్థిరముగ కస్తూరి తిలకము దిద్దినట్టి రా..
డాలైన వల్లెవాటు చెలగంగా యింద్రనీలాల గుంపు సొంపుగుల్కగా
నట్లు హేమాద్రి బ్రహ్మమని పల్కగా
చిన్నబాలుండవైనట్టి జాబిల్లి కూనవింటి రా..
ముక్కున ముత్య మింపుమీరగా చెక్కుటద్దము ముద్దుగుల్కగా
చనుముక్కున పాలధారలొల్కగా ప్రేమ మిక్కుటమునవచ్చి
మీతల్లి కౌసల్య యక్కునజేర్చి నెలబాలు జూపినయట్టి రా..
ముద్దుగదుర యింపొందగా మోదమందించుచు లాలింపగా
ముద్దులన్నా రమ్మని దీవింపగా సురలు వెన్నుడే రాముడని
వినుతింప భద్రాద్రి వెన్నుడయినట్టి చిన్నారి బాలుడ రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raamaa nii muddumoomu juupu suMdararaamaa ( telugu andhra )