| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామా నీచేతేమి కాదుగా సీతాభామకైన చెప్పరాదుగా శ్రీ రా.. |
| ఆనందభైరవి - రూపక (ముఖారి - ఆది) |
| పల్లవి: |
| రామా నీచేతేమి కాదుగా సీతాభామకైన చెప్పరాదుగా శ్రీ రా.. |
| అను పల్లవి: |
| సామాన్యులు నన్ను సకలబాధలుపెట్ట నామొరాలకించి మోమైన జూపవేమిరా రా.. |
| చరణము(లు): |
| శరచాపముల శక్తిదప్పెనా నీశౌర్యము జలధిలో జొచ్చెనా కరుణమాలి పైకముతెమ్మనుచు భక్తవరుల బాధింప నీ ధైర్యమెక్కడ బోయె రా.. |
| శంఖచక్రములు బట్టినందుకు దాసజనుల రక్షింపవదెందుకు పంకజాక్ష భక్త పరిపాలనలేద బింకములేని ఈపొంకము లేలయ్య రా.. |
| తల్లితండ్రి నీవనుకొంటిని నాయుల్లములో నెరనమ్మియుంటిని కల్లరి జనులు కారుబారుచేయ చల్లనికృప యిపుడు నాపై జల్లవైతివయ్యయ్యో రా.. |
| యింటివేల్పు వనుకొంటిని నీవంటి దైవము లేదనుకొంటిని నొంటిగ పైకము ఒప్పించుమని యంటె వెంటనంటి నాజంటగ రావైతివి రా.. |
| అద్రిజవినుతనామ శ్రీరామ ఆశ్రితులనేమరచితివా భద్రశైలమందు వెలసి భక్తుడైన రామదాసు భక్తితెలిసి బ్రోవకున్న భావజజనక దిక్కెవరు రా.. |