| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామా రారా భద్రాచల రామా రార రామ రామ రా.. |
| నీలాంబరి - ఆది |
| పల్లవి: |
| రామా రారా భద్రాచల రామా రార రామ రామ రా.. |
| చరణము(లు): |
| రామా రారా నీమోమిపుడే ప్రేమతీర చూతుగాని తామసము వలదు రామ స్వామి తాళజాలనికను రా.. |
| ఎన్నడు నే నిన్ను నమ్మి యున్నవాడనని యెంచి కన్నులెత్తి చూచి నన్ను మన్ననతో బ్రోవ రాదా రా.. |
| మాటిమాటికి నీతోటి సాటి వేల్పులు లేరని చాటుచున్న నన్ను నీవె పాట్లు పెట్ట నీటగునటరా రా.. |
| భద్రగిరి రామదాసపాలకుడవై నీవేల ఛిద్రములెల్ల తొలగించి భద్రముగ నన్నేలవేల రా.. |