| కీర్తనలు | భద్రాచల రామదాసు | రాముడే గలడు నాపాలి శ్రీరాముడే గలడు |
| నాదనామక్రియ - ఏక |
| పల్లవి: |
| రాముడే గలడు నాపాలి శ్రీరాముడే గలడు రాముడార్తి విరాముడాభావ భీముడానంద ధాముడైన శ్రీ రా.. |
| చరణము(లు): |
| నల్లని రూపు దాసులనేలు చల్లని చూపు నుల్లమున రంజిల్ల కృప వెదజల్లుచు విలసిల్లు సీతా రా.. |
| తమ్ముడును తాను విల్లునమ్ములు దాల్చిదయతో రమ్మి ఇరుపార్శ్వముల జేరి లెమ్మి నీకు భయమ్ములేదన రా.. |
| మీరు చిరునవ్వు జిగి ముడివీడు జారుసిగపువ్వు పౌరులకు బంగారు తమ్ములు చేరు పదముల దారి ననుజేర్చి రా.. |
| కంటుజేయకను రామదాసుని జంటబాయకను వెంటనంటి ఏవేళ కృపతో కంటిని రెప్పగాచు గతి బ్రోచు రా.. |