| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామునివారము మాకేమి విచారము |
| ఆనందభైరవి - ఆది |
| పల్లవి: |
| రామునివారము మాకేమి విచారము స్వామి నీదేభారము దాశరథి నీవాధారము రా.. |
| చరణము(లు): |
| తెలిసి తెలియనేరము మా దేవునిదే యుపకారము తలచిన శరీరము మది పులకాంకురపూరము రా.. |
| ఘోరాంధకారము సంసారము నిస్సారము శ్రీరాముల యవతారము మదిచింతించుట వ్యాపారము రా.. |
| ఎంతెంతో విస్తారము అవతల యొయ్యారము ఎంతో శృంగారము మా సీతేశుని యవతారము రా.. |
| ఇతరుల సేవ కోరము రఘుపతినే నమ్మినారము అతిరాజసుల జేరము మా రాముని దాసులైనాము రా.. |