| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామునివారమైనారము ఇతరాదుల గణనసేయము మేము రా.. |
| నాదనామక్రియ - చాపు (యదుకులకాంభోజి - ఆది) |
| పల్లవి: |
| రామునివారమైనారము ఇతరాదుల గణనసేయము మేము రా.. |
| అను పల్లవి: |
| ఆ మహామహుడు సహాయుడై విభవముగా మమ్ము చేపట్ట రా.. |
| చరణము(లు): |
| యమకింకరుల జంకించెదము పూని యమునినైన ధిక్కరించెదము అమరేంద్రవిభవము అది యెంతమాత్రము కమలజునైన లక్ష్యము చేయకున్నాము రా.. |
| గ్రహగతులకు వెరువబోము మాకు గలదు దైవానుగ్రహబలము ఇహపరములకు మాకిక నెవ్వరడ్డము మహి రామబ్రహ్మమంత్రము పూనియున్నాము రా.. |
| రాముడు త్రిభువన దేవదేవుడు రామతీర్థాల దైవలరాయడు రామదాసుల నెల్ల శుభదాయియై చాల బ్రోచి ప్రభుడై విభవముగా రక్షించును రా.. |