| కీర్తనలు | భద్రాచల రామదాసు | రాముల దివ్యనామస్మరణ జేయుచున్న జాలు |
| సావేరి - ఆది |
| పల్లవి: |
| రాముల దివ్యనామస్మరణ జేయుచున్న జాలు ఘోరమైన తపములను కోరనేటికే మనసా తారక శ్రీరామనామ ధ్యానము గానముజేసి వేరుదైవములను వెదుకనేటికే మనసా రా.. |
| చరణము(లు): |
| భాగవతుల పాదజలము పయిన జల్లుకొన్న జాలు బాగుమీరినట్టి యమృతపానమేటికే మనసా రా.. |
| పరుల హింసచేయకున్న పరమధర్మ మంతేచాలు పరులను రక్షింతునని పల్కనేటికే మనసా రా.. |
| దొరకని పరుల ధనము దోచకయుండిన చాలు గురుతుగాను గోపురము గట్టనేటికే మనసా రా.. |
| పరగ దీనజనులందు పక్షముంచినను చాలు పరమాత్మునియందు ప్రీతిపెట్టనేటికే మనసా రా.. |
| హరిదాసులపూజ లాచరించిన జాలు హరినిపూజ చేయుటనెడి యహమదేటికే మనసా రా.. |
| జపతపానుష్ఠానములు చేసి మూఢులకైవడి బంధులు జగదీశుని దివ్యనామ చింతకోసమైన మనసా రా.. |
| చలములేక ఏవేళ చింతించె మహాత్ములకు జపతపానుష్ఠానములు చేయనేటికే మనసా రా.. |
| అతిథివచ్చి యాకలన్న నన్నమిడినదే చాలు క్రతువు చేయవలయుననెడి కాంక్షలేటికే మనసా రా.. |
| సతతము మన భద్రగిరిస్వామిని నమ్మినచాలు ఇతర మతములనియెడి వెతలదేటికే మనసా రా.. |