| కీర్తనలు | భద్రాచల రామదాసు | రావయ్య అభయము లియ్యవయ్య స్వామి ప |
| నీలాంబరి - త్రిపుట |
| చరణము(లు): |
| రావయ్య అభయము లియ్యవయ్య స్వామి ప రాకేలనయ్య నీకు శ్రీరామయ్య భావజ జనక నాబాధలన్నియు మాన్పి ఏ విధముననైనను యేలెడి దొర నీవే రా.. |
| కావుకావుమని కాకాసురుడు రాగ కాచి రక్షించిన ఘనుడవు నీవు కావే దేవదేవోత్తమ దీనదయాపర కావవే యీవేళ కరుణాసాగర రా.. |
| అన్న నాపై నీవలుగుటేమి రామన్న రా వన్న నా మనవిని వినుమన్న ఓయన్న అన్నన్న నా నేరమెన్నుటేమన్నా నీ కన్నను మన్నింపనెవరున్నారన్నా రా.. |
| పతితులలో పరమపతితుడనంటిని పతితపావన బిరుదే మదిలో నమ్మియుంటి సరగున భద్రాచలస్వామి బ్రోవుమంటి ని తరుల వేడ నా గతి నీవే యనుకొంటిని రా.. |