కీర్తనలు భద్రాచల రామదాసు వందే రఘురామా శుభనామ శుభనామ
మోహన - చాపు (- త్రిపుట)
పల్లవి:
వందే రఘురామా శుభనామ శుభనామ
తులసీదళ దామాభిరామా శ్రీరామ వం..
చరణము(లు):
కనకమణిమయహార సుకుమార సుకుమార
పంక్తిరథ మహితకుమారా సువిహార
అరిసూర భూధరధీర కల్మషదూర
పాలితవానర దారుణ కారణ మురహరణ రఘు
వీర నీరదాభ విమల శరీర నిర్వికార వం..
వందితానిమేషా సత్యభావ సీతానన
భక్తపోష బుధతోష దళితదోష సజ్జనపోష
మానుషవేష సంగరభీషణ దాససుపోషణ నిజతోష
రత్నభూష రమ్యవేష సురాంభోజపుంజ ప్రత్యూ
ష సుమానస భృంగ మునిరాజవేష శ్రీరామ వం..
కుంతల జితనీల భక్తపాల భక్తపాల
అసురద్వేష పటలపాల వరశీల కనకచేల
కాంతిజాల మానుషశరీర దానవ బాలక
తావక సేవక సురసాల భూపాల పాలక
కౌస్తుభ వనమాల విశాలఫాల సుకపోల వం..
ధరణిజ సత్కళత్ర సుచరిత్ర సుచరిత్ర
మునిస్తోత్ర హృదయాబ్జమిత్ర సత్పవిత్ర
త్రిశరజైత్ర నీరజనేత్ర వారిజగాత్ర
విపులశాత్రవ భైరవ కైరవ పద్మమిత్ర
అజపవిత్ర అతురమిత్ర విభీషణ పరస్తోత్ర పాత్ర వం..
భూసుర కల్పవృక్ష సత్కటాక్ష సత్కటాక్ష వి
రాభ మదేభ హర్యక్ష మృదుపక్ష పంకేరుహాక్ష
నిజరూపాక్ష శత్రువిపక్ష వసురేషణ
వీక్షణ శిక్షణ దాక్షణ రామదాస
భద్రాద్రీశ దుష్టశిక్షక శిష్టరక్షక అహో రామ వం..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - vaMdee raghuraamaa shubhanaama shubhanaama ( telugu andhra )