| కీర్తనలు | భద్రాచల రామదాసు | వేరేయోచన లేటికే ముమ్మాటికి వేరేయోచనలేటికే వే.. |
| ఆహిరి - చాపు |
| పల్లవి: |
| వేరేయోచన లేటికే ముమ్మాటికి వేరేయోచనలేటికే వే.. |
| చరణము(లు): |
| ఆపదోద్ధారకుండను మాట నిజమైతే నీ ప్రొద్దునీతని బ్రోచుటే సాక్షి వే.. |
| ధ్రువప్రహ్లాదుల ధృడముగ నేలినది ధృఢమైన నితనిదిక్కుజూచుటే సాక్షి వే.. |
| దీనజనపాలకుడను మాటస్థిరమైన మానక యీతని మన్నించుటే సాక్షి వే.. |
| శరణన్న జనుల నాక్షణమున బ్రోచెడి బిరుదులున్నవతని గాచుటే సాక్షి వే.. |
| ఘనమైన భద్రనగమందు గలవేని దనరంగ రామదాసుని నేలుటయే సాక్షి వే.. |