| కీర్తనలు | భద్రాచల రామదాసు | శ్రీరామనామం మరువాం మరువాం |
| నాదనామక్రియ - చాపు |
| పల్లవి: |
| శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం శ్రీ.. |
| చరణము(లు): |
| గోవిందునేవేళ గొలుతాం గొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీ.. |
| విష్ణుకథలు చెవుల విందాం విందాం వేరేకథలు చెవుల మందాం మందాం శ్రీ.. |
| రామదాసులు మాకు సారాం సారాం కామదాసులు మాకు దూరాం దూరాం శ్రీ.. |
| నారాయణుని మేము నమ్మేం నమ్మేం నరులన్నింక మేము నమ్మాం నమ్మాం శ్రీ.. |
| మాధవనామము మరువాం మరువాం మరి యమబాధకు వెరువాం వెరువాం శ్రీ.. |
| అవనిజపతిసేవ మానాం మానాం మరియొక జోలంటే మౌనాం మౌనాం శ్రీ.. |
| భద్రగిరీశుని కందాం కందాం భద్రముతో మనముందాం ముందాం శ్రీ.. |