కీర్తనలు భద్రాచల రామదాసు సెలవా మాకు సెలవా యీ చెఱకేగ సె..
సౌరాష్ట్ర - ఆది
పల్లవి:
సెలవా మాకు సెలవా యీ చెఱకేగ సె..
చరణము(లు):
సెలవా మాకిక జలజసంభవనుత
జలజపత్రనేత్ర సజ్జనమిత్ర శ్రీరామ సె..
నీవా నన్నేలుకోవా యిటు వేగ
రావా సమయముకావ రావయ్యా సె..
వాసిగ భద్రాద్రివాస వరరామ
దాసహృదయ నివాసా రామయ్య సె..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - selavaa maaku selavaa yii cheRakeega se.. ( telugu andhra )