కవితలు ఆంధ్రావళి - ప్రబోధము - రాయప్రోలు మాతృ గీతా
1. మాతృ గీతా
నమో మంగళశ్రీ మహామాతృభూమే!
నమో భారతాఖ్యా సవిత్రీ లలామే!
నమో గర్భసంపన్న నిక్షేప సకలే!
నమో బ్రహ్మవిద్యా సహస్రార ముకుళే!
నమస్తే హిమాహార్య ధమ్మిల్లతారా!
నమస్తే త్రివేణీభర క్షీరధారా!
అలం దీప్యతే తావకీనా పతాకా
త్రివర్ణాయితాకూత చక్ర ప్రతీకా.
జ్వలంతీ తవక్షాత్ర శస్త్రాస్త్రమాలా
వృణీతే స్వయం శాంతి మక్రూరశీలా.
ధ్రువంతే ప్రజా రామరాజ్యం స్వతంత్రమ్‌
పరంతే అహింసాముఖ స్వీయమంత్రమ్‌.
ప్రశామ్యంతు అన్నాంబర క్షామఖేదాః
వినశ్యంతు రాష్ట్రప్రజామిత్రభేదాః.
అశోకం భవే దార్తిజుష్టం ప్రపంచమ్‌
చిరం వర్ధతాం భారతీయం చరిత్రమ్‌॥
గురువులు, శబ్ద బ్రహ్మ
స్వరూప లలితాశ్రయులు, రసవదిష్టార్థ
స్ఫుర దమృత కంఠులు, కవీ
శ్వరులు, తదుద్బుద్ధ చరణ చరితము నెంతున్‌.
తాతల్‌ తండ్రులు ధర్మకర్మ పరతంత్ర స్వప్రవృత్తిన్‌ నిజ
ఖ్యాతిన్‌ గాంచిరి; కాని మామక తపః కల్యాణి ఈ యాంధ్ర
భాషాతోద్య శ్రుతిలో లయించినది, అస్మన్నవ్య వాచా సరః
ప్రాతః పద్మ మరంద భాండ మిదె అంబా! స్వీకరింపంగదే!
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhrAvaLi prabOdhamu - mAtR^i gItA ( telugu andhra )