| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 22. ఆనాటిమాట | |
| ఆనాటి మనమాట లంతలో మరుపటర ఆరనీ చిచ్చు వెలిగిస్తావటోయి? అరిపేదగుండె రగిలిస్తావటోయి? | |
| పుచ్చపూవెన్నెట్లొ పూతమామిళ్ళలో కలిసి మసిలిన రేల మనసు కలిసిన వేళ | |
| ఆనాటి... | |
| కోనేటి గట్టంట కూనిరాగము తియవు నీలాటి రేవులో నీరౌను నాగుండె | |
| ఆనాటి... | |
| చీడీలపయినేటొ సిగపూవు రాలింది, నిన్న మొన్నటి బ్రమత నేలపాలయ్యేన? | |
| ఆనాటి... | |
| కడవనీళ్ళు బుజాన కరుడు గట్టేనోయి; దారి నొకమారైన తారసిల్లవు నేడు | |
| ఆనాటి... | |