| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 20. చందమామ | |
| ఎక్కడికి పొయ్యేవు? చందమామా! ను వ్వెందాక పయనాలు? చందమామా!... | |
| మబ్బంచుల గుర్రమెక్కి మహపసందు రాజఠీవి మంచుతెరల వల్లెవాటు మాటికి సవరించుకొంట, | |
| ఎక్కడికి... | |
| నీలిమబ్బు కొండలపై నిక్కి నిక్కి చూచేవు! అలిగిన నారాజు ౙాడ లంతుదొరుకునేమో కను | |
| ఎక్కడికి... | |
| చిగిరించిన తోటంతా చిన్నబోయెనని చెప్పు! వెచ్చని వెన్నెల కాలము వొచ్చిందనరా చెవిలో- | |
| ఎక్కడికి... | |
| ఏటిగట్టు ఇసకలలో ఎన్నెలదుప్పటి పరిచీ రమ్మనిపిలు నారాజును రావీ ఘడియలు రేపని | |
| ఎక్కడికి... | |
| ఎండో ఎన్నెలొ నీమన సేదో రుజు వీరాతిరి; చల్లనిదొరవయితే మము జంటకలిపిపో చూతము | |
| ఎక్కడికి... | |
| నీ తెచ్చిన పూలవాన నీలిమలోడే నావల; కమ్మని మా కవుగిటనే కడిగిన ముత్యాలరాశి | |
| ఎక్కడికి... | |