| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 21. ముసురేసిందంటే | |
| ముసురేసిందంటే పైన అసలే మతిపోతది మామా! ససిచెడినట్లుంటది లోలోన ఓ ముద్దులమామా! | |
| మబ్బు తెరల మసకలలోన మంచుపొగల మెలికలలోన, మనసేటో చిక్కడినట్లే మనేద కుదిపేస్తది లోన | |
| ముసురేసిం... | |
| పసుపాడిన పైరులనడుమ పడగెత్తిన సన్ననితోవ నువు మసిలే చెలకలవంకే నురుగులు గ్రక్కేను గరాళం | |
| ముసురేసిం... | |
| కోవెలచిరుగంటలు చెవిలో కావాలని కతకలిపించీ, దూరానున్నావని, నీపై దుర్వార్త లెవో వినిపిస్తై, | |
| ముసురేసిం... | |
| ఏటి మళుపులో ధనుసల్లే తోట ఒడలు విరిచినచోట, నాటి మన పరాసికమంతా నవ్వుతాలె అంటదిమెరుపు | |
| ముసురేసిం... | |