| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 15. నలిగిన పూవు | |
| రాతిరి వేళకు రా, మళ్లీ ఒక రాజ్యమేలుదువుగానీ ఒక రాజ్యమేలుదువుగానీ | |
| ఏటిగట్ల ఇసకలలో వాలుగ ఇద్దర మొకటై ౙారినచోట, దాగుడుమూతల వంకన పనిగా తరిమి తరిమి కనుమూసినచోట, మామిడితోపుల, మల్లెపందిరుల, మళ్ళీపోదామోయి వయాళిగ | |
| రాతిరివేళ... | |
| ఏమో తెలియని తరితీపుల ఉ య్యేల లూపితివిగద మొనమొన్న! అనుకోలే దాగడియల నంతటి అమృత ముంటదని కలలోనైనా! మరపురాని తొలిరేయి అలజడిని మనసు తీరలే దంటివిగదరా | |
| రాతిరివేళ... | |
| కన్నులలోనా, కలలోనా, నీ కలరూపే ఆవరించుకొన్నది, ఏతలపున కెడమీయని అందా లెచట దాచుకొన్నావోయీ మును? నలిగిన పూవుల తొలిసువాసనల నాణెమెరుంగని నంగనాచివా? | |
| రాతిరివేళ... | |