| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 1. తొలివలపు | |
| వలచీనాడమ్మా | |
| మనసు | |
| కలచీనాడమ్మా దారంట మగఠీవి తారసిల్లును దినము! కాలి ధూళిగ మారి రాలిపోయిన చాలు! | |
| వలచీ... | |
| గుండెలోతులు దొలిచే గోరువెచ్చని వాని వాలుకన్నులలోన కాలిపోయిన చాలు! | |
| వలచీ... | |
| మాటలోపల యేదో మంత్రమున్నదె! వాని కవుగిట్లో కడసారి కన్నుమూసిన చాలు! | |
| వలచీ... | |
| పాటపాడితె చాలు తోట పులకించేను! వింటూనె ప్రాణాలు విడచీన చాలమ్మ!! | |
| వలచీ.. | |