తొలి తెలుగు అపరాధ పరిశోధక నవలా రచయిత
శ్రీ దేవరాజు వేంకట కృష్ణారావు

(1886-1966)
వీరి సాహితీ, జీవన సోపానాలు:
- జననం: సెప్టెంబర్ 23, 1886
- జన్మస్థానం: సంగమ వలస (మృత్యుంజయ నగరం), విశాఖ జిల్లా, ఆంధ్ర, ఇండియా.
- తల్లి: శ్రీమతి రత్నమాంబ
- తండ్రి: శ్రీ వేంకటరావు
- 1900: "గడబిడదాస్", "అర్జెంటు పంతులు", " ప్రాడ్వివాకుడు" అనే ముద్దు పేరుతో, బిరుదులతో పిలవ బడ్డారు.
- 1906: శ్రీమతి రత్నమ్మతో వివాహం.
- జనవరి 1, 1909: "ఆంధ్ర భాషాభివర్ధనీ" సమాజ స్థాపన.
- 1910: "వేగుజుక్క" ముద్రణాలయ స్థాపన.
- 1911: "వేగుజుక్క గ్రంథమాల" స్థాపన.
- నవంబర్ 21, 1912: ప్రథమ కుమారుడు శ్రీ దేవరాజు వేంకట సత్యనారాయణమూర్తి జననం.
- 1912: "వాడే వీడు" తెలుగులో ప్రప్రథమ అపరాధ పరిశోధక నవల ప్రచురణ.
- 1914: "వేగుజుక్క కథావళి" మాస పత్రిక ప్రారంభం. 16 సంవత్సరాలు నిర్వహించారు.
- 1914: "నేనే" తెలుగులో ద్వితీయ అపరాధ పరిశోధక నవల ప్రచురణ.
- 1916: "కాలూరాయి" అపరాధ పరిశోధక నవల ప్రచురణ. నాటికి లేని "హెలికాప్టర్" ని ఈ నవలలో సృష్టించారు.
- 1926: "జానకీ పరిణయం" (తప్పుల తమాషా) గ్రంథ ప్రచురణ.
- 1927: రూపవతి, విద్యావతి, భగవత్ భక్తురాలు, భార్యామణి శ్రీమతి రత్నమాంబ గారి విష్ణుసాన్నిధ్యం.
- మార్చ్ 10-12, 1933: "అభినవాంధ్ర కవి పండిత సభ" లో అఖండ సన్మానం.
- మార్చ్ 14, 1933: "కళా ప్రచారక సమితి" స్థాపన.
- జూన్ 1, 1933: "సంజయ రాయబారము" గ్రంథ ప్రచురణ.
- డిశంబర్ 1933: "శ్రీ కృష్ణ రాయబారము" మొదటి భాగం, గ్రంథ ప్రచురణ.
ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు రవివర్మ చిత్ర పటం ఆధారంగా విరచించిన గ్రంథమిది.
ఈ గ్రంథం, భారత దేశంలో, తెలుగు భాష ప్రవేశ పెట్టిన అన్ని విశ్వవిద్యాలయాలలో
ఇంటర్, బి.ఎ. లకు పాఠ్య గ్రంథంగా నిర్ణయింప బడినది.
- 1934: ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
- 1934: "శ్రీ కృష్ణ రాయబారము" రెండవ భాగం, గ్రంథ ప్రచురణ. మన జాతిపిత మహాత్మాగాంధీ గారు
"డియర్ గురూజీ" అని సంబోధించి, తన ప్రశంసను వ్యక్తం చేస్తూ "ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్‌లో అనువదిస్తే
నేనూ ఆనందించ గలను" అని ముగించారు.
- 1934: ద్వితీయ వివాహం: అతి సాధ్వి, నిరంతరము కవి పండితుల కాతిథ్యమిచ్చు అన్నపూర్ణ, శ్రీమతి సత్యవతితో.
- 1936: ద్వితీయ కుమారుడు శ్రీ దేవరాజు రవి (సత్యనారాయణ) జననం. శ్రీ రవి గారు ఇప్పటికీ అఖండ
సాహితీ సేవకులు, సినీ రచయిత, డాక్టర్ సి. నా. రె. కి ఆప్త మిత్రులు.
- 1937: "పద సమస్య బోధిని" మాస పత్రిక ఆరంభం. తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ ని ప్రవేశ పెట్టారు.
- 1940-1960: "విశాలాంధ్ర వాణి" త్రిభాషా వార పత్రిక (తెలుగు, ఇంగ్లీష్, ఒరియా)
- 1942: "కృష్ణకుమారి" కావ్యానికి కృతిభర్త. కృతికర్త: బాలకవి భోగరాజు నారాయణమూర్తి గారు.
- 1950: విజయనగరం: "విమర్శకాగ్రేసర" పండిత, గౌరవ బిరుద గ్రహీతులు.
- 1960: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ద్వారా యావజ్జీవ గౌరవ భృతి.
- 1962: "వేగుజుక్క ప్రెస్" ప్రియ శిష్యుడు, ఫోర్మెన్, గ్రంధవరపు వెంకటరావు నకు అమ్మివేత.
- సెప్టెంబర్ 1962: "రచన" పత్రికలో తొలిసారిగా, వీరి జీవన యాత్ర, సాహితీ సేవ ముద్రిత మైనది.
- సెప్టెంబర్ 13, 1966: విష్ణుసాన్నిధ్యం: రాజాం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్ర, ఇండియా.
గ్రంథమాల వ్యవస్థాపకునిగా, పత్రికా సంపాదకునిగా, రచయితగా, సాహిత్య సేవాపరునిగా,
సుప్రసిద్ధులైన ఆయన జీవన కాలంలో సన్నిహితులు, మిత్రులు, గురువులు, బంధువులు:
డాక్టర్ మండపాక కామేశ్వర రావు, శ్రీ శ్రీ, రామానుజాచార్యుల వారు,
వరదయ్య గారు, వెంకటరావు గారు, శూద్ర కవి, పరవస్తు రంగాచార్యుల వారు, వేదం వేంకటరాయ శాస్త్రి,
గూనా అప్పల స్వామి, సర్వశ్రీ బచ్చు జగన్నాథ దాసు, ఊటుకూరి వేంకట గోపాల రావు, న్యాయపతి రామానుజ స్వామి,
సర్వశ్రీ గిడుగు రామ్మూర్తి, గురుజాడ, కందుకూరి, చిలకమర్తి, పానుగంటి, బంకుపల్లి, కోరాడ,
విశ్వనాథ కవిరాజు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, తిరుపతి వేంకట కవులు, మారెళ్ళ గంగరాజు,
కొచాడ వారు, పోలవరం దేవిడీ జమిందారు, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, దుగ్గిరాల సత్యమూర్తి,
టంగుటూరి ప్రకాశం, చెరకువాడ, వి. వి. గిరి, నీలం సంజీవ రెడ్డి, దేశోద్ధారక కాశీనాథుని వారు,
వడ్డాది సుబ్బరాజు కవి, అయ్యంకి వేంకటరమణయ్య, కట్టమంచి, దివాకర్ల వేంకటావధాని,
పింగళి లక్ష్మీకాంతం, మండపాక పార్వతీశ్వర శాస్త్రి, తాపీ ధర్మారావు, అప్పలస్వామి నాయుడు గారు,
నృసింహ శర్మ, సెట్టి లక్ష్మీ నృసింహం గారు, సర్కిల్ ఇన్ స్పెక్టర్ గున్నేశ్వర రావు,
ఉన్నవ రామలింగం మాస్టారు, నాజీ వారు, వైశ్యరాజు వారు, ఇందుపూడి వారు, ఇమ్మిడి శెట్టి వారు,
పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, గిడుగు సీతాపతి, చింతా దీక్షితులు, కొంపెల్ల, గుడిమెండ,
దేవులపల్లి, వేదుల, ఇంద్రగంటి, చిలుకూరి నారాయణ రావు, డాక్టర్ లంక సుందరం,
ఎమ్. వి. రమణమూర్తి, వల్లభాయి పటేల్, మహత్మా గాంధీ, పంగనామాల రమణారావు, పురిపండా,
ఇచ్ఛాపురపు యజ్ఞ నారాయణమూర్తి, అనంత పంతుల వారు, సురభి పాపాభాయి, చిన వేంకట రామయ్య,
సురభి కమల, పి. పుల్లయ్య, వేంకటేశం గారు, పప్పు సూర్యనారాయణ, కొట్ర శ్యామల కామ శాస్త్రి,
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, జాకీర్ హుస్సేన్, జయపురం మహారాజా విక్రమదేవ వర్మ, బుర్రా శేషగిరి రావు.
1966లో కుటుంబం:
ఆరుగురు పుత్రులు, ముగ్గురు పుత్రికలు, పదముగ్గురు మనుమలు.
2006లో, నేటికి:
వీరి మనుమలు, మునిమనుమలు, మునిమునిమనుమలు మొత్తం పద్దెనిమిదిమంది అమెరికాలో స్థిరపడి ఉన్నారు.
దేవరాజు వేంకట కృష్ణారావు గారి, ప్రథమ కుమారుడు, శ్రీ దేవరాజు వేంకట సత్యనారాయణ మూర్తి గారు
తన తొంభై నాలుగేండ్ల వయసులో కూడ, అఖండ సంఘ, సాహితీ సేవ చేస్తూ, చేయిస్తూ, తన తండ్రి గారి
మధుర స్మృతులతో, విశాఖలో స్థిర పడ్డారు.