భాష బాల వ్యాకరణము ఆచ్ఛిక పరిచ్ఛేదము
1. సంస్కృతసమేతరంబయిన యీభాష యచ్చ యనంబడు.
స్పష్టము
2. ఆచ్ఛికశబ్దంబులెల్లం దఱుచుగ స్త్రీసమంబులుం గ్లీబసమంబులు నయి యుండు.
స్త్రీ సమత్వాతిదేశంబుచేఁ ప్రథమైక వచన లోపాదికంబును, గ్లీబ సమత్వాది దేశంబుచే మువర్ణకంబు నగునని యెఱుంగునది. అన్న - మిన్న - అద్ద - గద్ద - జాణ - గాణ - ఓడ - గోడ ఇత్యాదులు స్త్రీసమంబులు. బియ్యము - నెయ్యము - అల్లము - మొల్లము - సున్నము - సన్నము ఇత్యాదులు క్లీబసమంబులు.
తఱచుగ ననుటచేఁ బుంలింగతుల్యంబులుం గొండొక కలవని తాత్పర్యము.
కొమరుఁడు - చందురుఁడు - జముఁడు - కందుఁడు ఇత్యాదులు.
3. బల్లిదాదులు సంస్కృత తుల్యంబులు.
మహత్త్వంబున వీని కుత్వడుఙాదులు నమహత్త్వంబున మువర్ణకాదులును, స్త్రీత్వంబునం దాలు శబ్దముతోడ సమాసంబునుం గలుగునని యెఱుంగునది.
బల్లిదుఁడు, బల్లిదము, బల్లిదురాలు, బల్లిద, అక్కజ, కావల, బెట్టిద, బెడిద, మిసిమింత, మొక్కల ఇత్యాదులు బల్లిదాదులు.
4. మహత్తు లగు మగాదులకుం గయిరాదులకును డుఙ్ఙగు నుత్వంబు గాదు.
మగఁడు - మనుమఁడు - కయిరఁడు - కత్తళఁడు.
మగ - మనుమ - రాయ - పాప - వ్రే - ఱే - ఈ - కా ప్రత్యయాంతంబులు ఇత్యాదులు మగాదులు.
కయిర - కత్తళ - జన్న - నీల ఇత్యాదులు కయిరాదులు.
5. పగతాదుల బహువచన లకారంబునకు రేఫం బగు.
పగతురు - అల్లురు - నెయ్యురు - బలియురు - మార్తురు.
6. కొన్ని డుమంతంబుల బహువచన లకారంబునకు రేఫంబును, దానికి ముందు పూర్ణబిందు పూర్వక డకారంబు నగు.
గండ్రండు - మిండ్రండు ఇత్యాదులు.
7. కాప్రత్యయంబుమీఁది బహువచన లకారంబునకు లఘ్వలఘురేఫంబులును, లఘురేఫంబునకు ముందు బిందుపూర్వక డకారంబు నగు.
విలుకాండ్రు - విలుకాఱు, వేఁటకాండ్రు - వేఁటకాఱు, వేడుకకాండ్రు - వేడుకకాఱు.
8. ఱే ప్రభృతుల బహువచనమునకు ముందు డుఙ్ఙగు.
ఱేఁడులు - ఱేండ్లు.
9. కూఁతు శబ్దము ప్రథమైకవచనంబునకు రువర్ణం బగు.
కూఁతురు - కూఁతులు - కూఁతురులు - కూతుళ్ళు.
కూఁతురి నిత్యాది రూపంబులు గ్రామ్యంబులని యెఱుంగునది.
10. చెయువు బహువచన లకారంబున కలఘురేఫంబు విభాష నగు.
చెయువుఱు -చెయువులు - చెయువుఱను - చెయివులను.
11. ఆల్వాదుల బహువచన లకారంబునకు రేఫంబును ముందఱి లువర్ణంబునకు బిందుపూర్వక డకారంబు నగు.
ఆండ్రు, ఆండ్రను, ఆలు, చెలియలు, చెల్లెలు, కోడలు, మఱఁదులు ఇవి యాల్వాదులు.
12. బహువచనము పరంబగునపుడు డ ల ట ర ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగా నగు.
గుండ్లు - గుండులు, గిండ్లు - గిండులు, కాళ్ళు - కాలులు, మొసళ్ళు - మొసలులు, గొండ్లు - గొంటులు, తుంట్లు - తుంటులు, గోర్లు - గోరులు, సీవిర్లు - సీవిరులు.
బహుళగ్రహణముచే విల్లులు, పిల్లులు, పులు లిత్యాదులందు లోపంబులేదు.
తత్సమంబులం గోటి పిప్పలిశబ్దంబుల కీకార్యంబు చూపట్టెడు.
కోట్లు - కోటులు, పిప్పళ్ళు - పిప్పలులు.
13. బహువచనము పరంబగునపు డసంయుక్తంబులయి యుదంతంబులయిన డ ల ర ల కలఘు లకారంబు బహుళంబుగా నగు.
త్రాళులు - త్రాడులు, గుమ్మళులు - గుమ్మడులు, మొగిళులు - మొగిలులు, పిడికిళులు - పిడికిలులు, ఊళులు - ఊరులు, పందిళులు - పందిరులు.
14. బహువచన శ్లిష్టంబులయి యద్విరుక్తంబులయిన డకార లకారంబుల కలఘు లకారంబు నిత్యంబుగ నగు.
త్రాళ్ళు, గుమ్మళ్ళు, మొగిళ్ళు, మొసళ్ళు, విళ్ళు, సిళ్ళు.
15. సమాసపదంబునందు సంయోగంబు పరంబగునపుడెల్లచో ఖండబిందునకుం బూర్ణం బగు.
అనఁటులు - అనంట్లు, పనఁటులు - పనంట్లు, గోఁటులు - గోంట్లు, తేఁటులు - తేంట్లు, ఏఁడులు - ఏండ్లు, కాఁడులు - కాండ్లు.
ఏండ్లు కాండ్లి త్యాదులందు డాకు ళాదేశంబు కొండఱు వక్కాణించిరి.
తెనుఁగున బిందుపూర్వక స్థిరంబు లేమింజేసి యది గ్రాహ్యంబుగాదు.
16. ఔపవిభక్తికంబుల లివర్ణ స ల లు వర్ణంబులకు బహువచనంబు పరంబగునపుడు పూర్ణబిందుపూర్వక డువర్ణంబు బహుళంబుగా నగు.
కొడవలి - కొడవండులు.
ఉల్లోపంబు -కొడవండ్లు.
పక్షంబునం దలఘులకారంబు - కొడవళ్ళులు - కొడవళు - కొడవలులు.
రోఁకలి ప్రభృతుల కిట్లు రూపంబు లెఱుంగునది.
ఇల్లు - ఇండులు - ఇండ్లు - ఇల్లులు.
ఇట్లు కల్లు, పల్లు, ముల్లు, విల్లు శబ్దంబులకు రూపంబులు తెలియునది.
మధ్య నిమ్నార్థకంబులయిన కల్లు, పల్లు శబ్దంబులు ఱెల్లు ప్రభృతి శబ్దంబులు ననౌపవిభక్తికంబు లగుటంజేసి వానికీ కార్యంబు లేదు.
17. ఒకానొకచో నామంబు సంశ్లిష్ట బహువచనాంత తుల్యంబయి బహువచనంబు నెనయు.
కొడవండ్లులు - కొడవండ్లులను, కొడవళ్ళులు - కొడవళ్లులను ఇట్లు ప్రయోగదృష్టంబులు గ్రహించునది.
18. కలన్వాదుల నువర్ణంబు కుఙ్ఙగు; బహువచనము పరంబగునపుడు నిత్యముగా నగు.
కలఁకు - కలను - కలఁకులు - కలను - కెలను - కొఱకు - కొలను - గవను - నెఱను - మ్రాను - వరను - వలను. ఇవి కలన్వాదులు.
19. అట్లు రేను గోను శబ్దముల నువర్ణంబు గుఙ్ఙగు.
రేఁగు - రేను - రేఁగులు, గోఁగు - గోను - గోఁగులు.
20. బహువచనంబు పరంబగునపుడు చేను పేను మీను శబ్దంబుల నువర్ణంబు లోపించు.
చేను - చేలు, పేను - పేలు, మీను - మీలు.
21. బహువచనంబు పరంబగునపుడు రేయి ప్రభృతుల తుది యక్షరంబు లోపించు.
రేయి - రేలు, ఱాయి - ఱాలు, వేయి - వ్రేలు, వ్రాయి - వ్రాలు ఇత్యాదులు.
ఈ లోపంబు సమాసంబులందుం జూపట్టెడు.
రేరాజు - మగఱాపతకము - వేవెలుఁగు.
22. బహువచనంబు పరంబగునపు డావు ప్రభృతుల తుదియక్షరంబునకు లోపంబు విభాష నగు.
ఆవు - ఆలు - ఆవులు, జాము - జాలు - జాములు, చుట్టము - చుట్టలు - చుట్టములు, మీసము - మీసలు - మీసములు.
23. ఇ య కు మాఱుగా నామాంతంబున కెత్వంబు బహుళంబుగా నగు.
కన్నియ - కెన్నె, జన్నియ - జన్నె, వన్నియ - వన్నె, కొంచియము - కొంచెము, కొండియము - కొండెము.
బహుళ గ్రహణముచే సందియము కాఱియ మొదలగు శబ్దంబులందెత్వములేదు.
ఇయశబ్దంబునం దికారలోపంబు కొందఱు వక్కాణించిరి. అయ్యది ప్రయోగంబులందు మృగ్యంబు.
ముత్తియ శబ్దంబునందు మాత్ర మిత్వలోపంబు గానంబడియెడి.
ముత్తియము - ముత్తెము - ముత్యము.
**సర్వనామ ప్రకరణము**
24. అన్ని ప్రభృతులు సర్వనామంబులు.
అన్ని - ఇన్ని - ఎన్ని - కొన్ని - పెక్కు - పలు - ఆ - ఈ - నీ - నా - మన - తా సంఖ్యావాచకములు అన్ని ప్రభృతులు.
వీనికిం బ్రథమాంతరూపంబు లుదాహరించెద. వీనిలో డుమంతంబులకెల్ల న్యాగమంబు పూర్వోక్తంబును స్మరించునది. బహువచన లకారంబునకు రాదేశంబును, బూర్వాగమంబును బ్రథమా బహువచనంబునకుం బోలె నెఱుంగునది.
విశేషాకారంబులు గలిగెనేనిఁ గొండొకచో ద్వితీయవఱకును గొండొకచోఁ దృతీయయం దొక్క రూపంబు వఱకును రూపభేదంబులు వక్కాణించెద. శేషంబూహించునది.
అన్ని మొదలగు శబ్దంబులాఱును, ద్విప్రభృతి సంఖ్యావాచకంబులును మహదర్థంబులు బహువచనాంతంబులగు - అమహదర్థంబు లేకవచనాంతంబులగు.
ఇందు నీ మొదలగు నాలుగు శబ్దంబులు - సర్వార్థంబులం దుల్యరూపంబు లయియుండును.
మ - అనునది మహదర్థమనుటకు, అ - అనునది యమహదర్థమనుటకు, ప్ర - మొదలగునవి ప్రథమాది విభక్తులకును సంకేతములుగా నిందు గ్రహించునది.
సర్వతావదర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమఅందఱు
అందొఱు
- అన్ని -
ఇయదర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమఇందఱు - ఇన్ని -
కియద్యావదర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమఎందఱు - ఎన్ని -
కతిపయార్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమకొందఱు - కొన్ని -
బహ్వర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమపెక్కుండ్రు
పెక్కురు
- పెక్కుపెక్కులు
ఈ శబ్దంబు లౌపవిభక్తికంబు లగుటంజేసి అన్నిటి - అన్నింటి, ఇన్నిటి - ఇన్నింటి, ఎన్నిటి - ఎన్నింటి, కొన్నిటి - కొన్నింటి, పెక్కిటి -పెక్కింటి యను రూపంబులు ద్వితీయాద్యేక వచనంబులు పరంబు లగునపు డమహత్త్వంబునం దగునని తెలియునది.
బహ్వర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమపలుగురు
పలుగుండ్రు
- అమహత్త్వంబున దీనికి వ్యస్త ప్రయోగంబు లేదు.
తదర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమవాఁడువారు
వారలు
వాండ్రు
అది
అద్ది
ఆయది
అయ్యది
అవి
అవ్వి
ఆయవి
అయ్యవి
ద్వితీయవానినివారిని
వారలను
వాండ్రను
దానిని
ఆదానిని
అద్దానిని
వానిని
ఇదమర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమవీఁడువీరు
వీరలు
వీఁడ్రు
ఇది
ఇవి
ఈయది
ఇయ్యది
ఇవి
ఇవ్వి
ఈయవి
ఇయ్యవి
ద్వితీయవీనినివీరిని
వీరలను
వీండ్రను
దీనిని
ఈ దానిని
ఇద్దానిని
వీనిని
యత్కిమర్థకము:
 మహదర్థముఅమహదర్థము
 ఏక వచనముబహు వచనముఏక వచనముబహు వచనము
ప్రథమఏఁడు
ఏవాఁడు
ఎవ్వాఁడు
ఎవ్వఁడు
ఎవఁడు
ఏరు
ఏవారు, ఏవారలు, ఏవాండ్రు
ఎవ్వారు, ఎవ్వారలు, అవ్వాండ్రు
ఎవ్వరు, ఎవ్వండ్రు
ఎవరు, ఎవండ్రు
ఎది
ఏది
ఎద్ది
ఏయది
ఎయ్యది
ఎవి
ఏవి
ఎవ్వి
ఏయవి
ఎయ్యవి
ద్వితీయఏనిని
ఏవానిని
ఎవ్వారిని
ఎవ్వనిని
ఎవనిని
ఏరిని
ఏవారిని, ఏవారలను, ఏవాండ్రను
ఎవ్వారిని, ఎవ్వారలను, ఎవ్వాండ్రను
ఎవ్వరిని, ఎవ్వండ్రను
ఎవరిని, ఎవండ్రను
దేనిని
ఏదానిని
ఎదానిని
వేనిని
ఏవానిని
ఎవ్వానిని
మహతి వాచ్యంబగునే నేకత్వంబున మత్కిమర్థక శబ్దంబు ఎవ్వరిత - ఎవ్వర్త - ఎవ్వత - ఎవరిత - ఎవర్త - ఎవత - ఎవ్వరితి - ఎవ్వర్తి - ఎవ్వతి - ఎవరితి - ఎవర్తి - ఎవతి - ఎవ్వరితె - ఎవ్వర్తె - ఎవ్వతె - ఎవరితె - ఎవర్తె - ఎవతె - ఎవ్వతుక - ఎవర్తుక - ఎవర్తుక అని యిరువది రెండు రూపంబులు వడయు.
తదాదులు మూఁడు మహద్వాచకంబు లేకత్వంబునం బూజ వివక్షించునపుడు అతఁడు - ఆతఁడు, ఇతఁడు - ఈతఁడు, ఎతఁడు - ఏతఁడు అను రూపంబులు వడయు.
మహతీవాచకంబులు ఆమె - ఆపె - ఆకె, ఈమె -ఏపె - ఏకె, ఏమె - ఏపె - ఏకె అను రూపంబులు వడయు.
యుష్మదర్థకము:
 ఏక వచనముబహు వచనము
ప్రథమనీవు
ఈవు
మీరు, మీరలు
ఈరు, ఈరలు
ద్వితీయనిన్నునుమిమ్మును
తృతీయనీ చేతనుమీ చేతను
అస్మదర్థకము:
 ఏక వచనముబహు వచనము
ప్రథమనేను
ఏను
మేము, నేము
ఏము
ద్వితీయనన్నునుమమ్మును
తృతీయనాచేతనుమాచేతను
ఉభయార్థకము:
 ఏక వచనముబహు వచనము
(నిత్యబహువచనాంతము)
ప్రథమ - మనము
ద్వితీయ - మనలను
తృతీయ - మనచేతను, మనలచేతను
ఆత్మార్థకము:
 ఏక వచనముబహు వచనము
ప్రథమతన్నుతన్ను
ద్వితీయతన్నునుతమ్మును
తృతీయతనచేతనుతమచేతను
25. సంఖ్యకుం బూరణార్థంబునం దవగాగమం బగు.
రెండవవాఁడు - రెండవది, మూడఁవవాఁడు - మూఁడవది.
26. సర్వనామక్రియాపదంబుల బహువచనంబు మహత్తునకుం బోలె మహతికగు.
వారిద్దఱు రుక్మిణీ సత్యభామలు, వీరు మువ్వురు శ్రీభూనీళలు.
27. అపదాద్యంబయి యసంయుక్తంబయిన గకారంబునకు వకారంబు విభాష నగు.
పలుగురు - పలువులు, ఇరుగురు - ఇరువురు, వేగురు - వేవురు, తొగ - తొవ, పగలు - పవలు.
ఔప విభక్తిక ప్రకరణము
28. ఇ టి తి వర్ణంబులు వక్ష్యమాణంబు లౌపవిభక్తికంబులు.
విభక్తి నిమిత్తకంబులయి యాదేశాగమాత్మకంబులయిన ఇ - టి - తి అను వర్ణంబు లౌపవిభక్తికంబు లనంబడు.
29. ఇవి ద్వితీయాద్యేక వచనంబులు పరంబులగునపుడు నామంబులకుం గొన్నింటికిం బ్రాయికంబుగ నగు.
కాలు - కాలిని - కాలిచే, నాఁగలి - నాఁగటిని - నాఁగటిచే, నేయి - నేతిని - నేతిచే.
ద్వితీయైక వచనంబు పరంబగు నపు డౌపవిభక్తికంబులు రావని కొందఱు వక్కాణించిరి.
అయ్యది లక్ష్యలక్షణ విరుద్ధంబగుటంజేసి యనాదరణీయంబు.
30. ఊరు మొదలగువాని కిత్వం బగు.
ఊరు - ఊరిని, కాలు - కాలిని, మ్రాను - మ్రానిని, నోరు - నోరిని, చోటు - చోటుని.
31. టి వర్ణంబు గొన్నింటి యంతాక్షరంబున కాదేశంబును, గొన్నింటి కంతాగమంబును, గొన్నింటికిం బర్యాయంబున రెండును బ్రాయికంబుగ నగు.
ఆదేశము: త్రాడు - త్రాటిని, కాఁడు - కాటిని, నోరు - నోటిని, ఏఱు - ఏటిని.
ఆగమము: ఆన్ని - అన్నిటిని, ఎనిమిది - ఎనిమిదిటిని, వేయి - వేయిటిని.
ఉభయము: ఏమి - ఏటిని - ఏమిటిని, పగలు - పగటిని - పగలిటిని, మొదలు - మొదటిని - మొదలిటిని, రెండు - రెంటిని - రెండింటిని, మూఁడు - మూటిని - మూఁడిటిని, నూఱు - నూటిని - నూఱిటిని.
32. హ్రస్వముమీఁది టి వర్ణకంబు ముందు పూర్ణబిందువు బహుళముగానగు.
అన్నింటిని, ఎనిమిదింటిని, పగంటిని, పగలింటిని, రెండింటిని, మూఁడింటిని.
33. పదాద్యం బగు హ్రస్వంబుమీఁది టి వర్ణంబునకు ముందు పూర్ణబిందు వగు.
కన్ను - కంటిని, మిన్ను - మింటిని, ఇల్లు - ఇంటిని, పల్లు - పంటిని.
34. అఱ్ఱు మొదలగు శబ్దముల కంతాగమంబు తి వర్ణంబును రేఫంబున కొక్కటికి లోపంబు నగు.
అఱ్ఱు - అఱితిని. అఱ్ఱు - కఱ్ఱు - కొఱ్ఱు - గొఱ్ఱు - ముఱ్ఱు - వఱ్ఱు ఇవి యఱ్ఱు మొదలయినవి.
35. విభక్తి పరంబగునపుడు గోయి ప్రభృతుల తుదియక్షరంబు తి వర్ణకం బగు.
గోయి - గోతులు - గోతిని - గోతులను. గోయి - చేయి - దాయి - నూయి - నేయి - వాయి - రోయి ఇత్యాదులు.
36. టి తి వర్ణకంబులు పరంబులగునపు డుత్వంబున కిత్వం బగు.
రెంటిని - మూఁడిటికి - నాలుగిటికి - పగలిటికి - మొదలిటికి - పెక్కిటికి.
కొండొకచో నుత్వంబున కిత్వంబు చూపట్టదు - నెత్తుటికి.
37. టి వర్ణంబు పరంబగునపుడు క్రిందు మీఁదు ముందు పువర్ణంబుల కత్వం బగు.
క్రిందు - క్రిందటిని, మీఁదు - మీఁదటిని, ముందు - ముందటిని, మాపు - మాపటిని, అప్పుడు - అప్పటిని.
38. ఔపవిభక్తికముల తృతీయాసప్తముల కత్వం బాదేశంబు బహుళంబుగా నగు.
గోరను గీరెను, ఊరనున్నాడు, గొడ్డట నరెకెను, ఇంటలేఁడు, వఱుతఁ గలిసె, కఱతఁ దూటె. పక్షంబునందుఁ గోరిచేత నూరియం దిత్యాదులు.
AndhraBharati AMdhra bhArati - bhAshha - bAla vyAkaraNamu - aachchhika parichchhEdamu - chinnaya sUri - andhra telugu tenugu ( telugu andhra )