| 1. |
పదాద్యంబులు ఋ ఌ వర్ణంబులు ర ల తుల్యంబులు.
అతఁడు ఋషి - ఇట సంధి లేదు.
ఆ ఋషి - ఇట యడాగమము లేదు.
వచ్చె ఋషి - వచ్చెన్ ఋషి - వచ్చెను ఋషి. ఇట ద్రుతమునకు లోప సంశ్లేష స్వత్వములు. |
|
| 2. |
ఆచ్ఛికపదంబులం దుత్తమంబు లగు రు లు డు ల ముందఱి యేత్వంబునకు హ్రస్వంబు విభాష నగు.
| నల్లేరు - నల్లెరు, పల్లేరు - పల్లెరు, పెన్నేరు - పెన్నెరు, మానేరు - మానెరు, ఆడేలు - ఆడెలు,
కుందేలు - కుందెలు, తోఁడేలు - తోఁడెలు, నాఁగేలు - నాఁగెలు, నేరేడు - నేరెడు,
మారేడు - మారెడు, పూరేడు - పూరెడు, తంగేడు - తంగెడు. |
|
| 3. |
ఊ యే ల పయ్యెద తాయెతులం ద్రిక్క నామంబులందు యాకుం దాలవ్య వక్రయోగంబు లేదు.
|
| 4. |
ఊయేల యూయాల ల చాఁపుల నొండొంటికిం గుఱుచ యొండె నగు.
ఉయేల - ఊయెల - ఊయేల - ఉయాల - ఊయల - ఊయాల.
వక్ష్యమాణంబు యద్విత్వంబు.
ఉయ్యేల - ఉయ్యెల - ఉయ్యాల - ఉయ్యల. |
|
| 5. |
పయ్యెద పయ్యద.
|
| 6. |
ఊ యే లాదుల దొలియచ్చుమీఁది హల్లునకు ద్విర్వచనం బొండె నగు.
| ఉయ్యేల - ఊయేల, ఊయేల - ఊయెల, ఊయాల - ఊయల, ఆయె - ఏవిధము -
ఓయ - ఓయారము - కోపు (ధనురగ్రము) - జాగర - తీనియ - తీయము - తేప(ప్లవము) -
తేమ - తోయలి - దీవియ - నూవు - నోవి - నోవు - పూవు - పేయ - మోక(అంకురము)
మోటిక - మోపు - వీయము ఇత్యాదు లూయేలాదులు. |
|
| 7. |
ఱ కారంబు క్రింది ఱ కారంబునకుం దుది ను లు ల క్రింది న ల లకు
లోపంబు బహుళంబుగ నగు.
అఱ్ఱు - అఱు, గొఱ్ఱియ - గొఱియ, కన్ను - కను, నన్ను - నను, పల్లు - పలు, విల్లు - విలు. |
|
| 8. |
అక్కటాదుల ౙడ్డకు లోపంబు విభాష నగు.
అకట - అక్కట.
అక్కట - అట్టిక - అట్టుక - అట్టె - అయ్యో - అయ్యారె - అవ్వారి - ఇట్టిక -
ఉప్పవడము - ఉమ్మి - ఎక్కసక్కియము - ఎక్కసెక్కియము - ఎక్కిరింత - ఎడ్డ -
ఎన్నిక - ఎమ్ముక - కజ్జాయము - కట్టా - కట్టిక - కప్పురము - కమ్మటము -
కమ్మతము - కువ్వాడము - కొట్టిక - కొమ్ము - కొయ్యగూర - గయ్యాళము -
గిజ్జిగాఁడు - గుజ్జరాతి - చిట్టి - చిన్న - చిమ్మట - చెన్నఁటి - చెప్పుము - చెప్పుఁడు -
చెమ్మట - చెల్లియలు - జవ్వాజి - జాబిల్లి - తమ్మటము - తమ్ములము - తల్లి -
తుమ్మికి - తువ్వర - తెల్ల - దువ్వు - దివ్వియ - నవ్వు - నిద్దుర - నివ్వరి - నివ్వాళి -
నువ్వు - నెట్టిక - నెమ్మలి - పవ్వళించు - పిన్న - పుల్లియ - పువ్వు - పెద్ద - పొట్టి -
ప్రాకెన్న - ప్రెగ్గడ - బెగ్గడు - బొమ్మ - బొమ్మికము - బొమ్మిడికము - బొమ్మిడీకము -
మజ్జ - మత్తాబు - మల్లారము - ముక్కు - మద్దియు - మెట్టిక - మొక్కరము -
మొగ్గరము - మొల్లాము - రడ్డి - లొట్టిపిట్ట - వట్టి - వయ్యాళి - సన్నియ - సవ్వడి -
సివ్వంగి - అట్టు - ఇట్టు - ఎట్టు - అప్పుడు - ఇప్పుడు - ఎప్పుడు - అన్ని - ఇన్ని -
ఎన్ని - కొన్ని - మమ్ము - మిమ్ము - తమ్ము - అమ్మ - అక్క - అవ్వ - అయ్య -
అప్ప - అచ్చొటు - ఇచ్చొటు - ఎచ్చొటు - అచ్చటు - ఇచ్చటు - ఎచ్చటు.
ఇత్యాదులు లక్కటాదులు. |
|
| 9. |
ౙడ్డక్కరంబుతోఁ బదాదిస్వరంబు గూడుచో జడ్డకు లోపంబు లేదు.
| అఱ్ఱెత్తె - కన్నదరె - నన్నడిగె - పల్లొత్తె - విల్లందె. |
|
| 10. |
హాదులయు నీలుగు లోనగు వాని తొలి హల్లునకు లోపంబు బహుళంబుగానగు.
హడపము - అడపము, హరిదళము - అరిదళము, హలఁది - అలఁది, నీలుగు - ఈలుగు,
నీలుగు - నెగయు, పొందు - పొనరు.
పూను పొదవుల కాదిలోపం బొకండు వచియించె నది యవిచార మూలకంబు. |
|
| 11. |
ఆరాటాదులం బ్రథమేతర దీర్ఘంబునకు హ్రస్వంబు విభాష నగు.
ఆరాటము - ఆరటము.
ఆరాటము - కక్కూఱితి - కేళాకూళి - కొమారుఁడు - కొమారిత - గంబూరము -
పెండారము - బంగారము - బేహారము - వీటతాటము - సంతోసము. |
|
| 12. |
ఓయారాదులం దొలిదీర్ఘంబునకు హ్రస్వంబు విభాష నగు.
ఓయారము - ఒయారము.
ఓయారము - కేళాకూళి - కోలె - గూడారము - గోరువంక - పక్షి - జోహారు -
నీలుగు - పేఁడ - బేహారము.
దీర్ఘమధ్యంబు - మాఱు - మూలుగు - మోఱకు -
వీటతాటము - వీడియము - ఇత్యాదులు. |
|
| 13. |
అడంగ్వాదుల డాకు ణ కారంబు విభాషనగు.
అడఁగు - అనఁగు.
అడఁగు - కడఁగు - చిల్లాడము - తడగము - నాఁడెము - పోఁడి - మిడుఁగు -
వదఁకు - మిడుఁగుఱు ఇత్యాదు లడంగ్వాదులు. |
|
| 14. |
దక్కులోనగువాని దాకు డ కారంబు విభాష నగు.
దక్కు - డక్కు.
దక్కు - దగ్గఱు - దాఁగు - దాకలి - దిగు - దిగ్గియ - దూయు - దెందము -
దెప్పరము - దెప్పు - దొంగ - దొప్ప ఇత్యాదులు. |
|
| 15. |
ఏతాదులకు మువర్ణకంబు పరంబగునపుడు దీర్ఘంబు విభాష నగు.
ఏతము - ఏతాము.
ఏతము - కళ్ళము - గాలము - గుడ్డము - గోణము - గోతము - జాజము - జుంజము -
జోతము - తణగము - బొండ్లము - మండము - లాతము - వీణము ఇత్యాదులు. |
|
| 16. |
పదాంతంబు లయి యసంయుక్తంబు లయిన ను లు రు ల యుత్వంబునకు
లోపంబు బహుళంబుగ నగు.
ఇందు నురుల కుత్వలోపంబు ప్రాయికంబుగ హల్పరకంబులకుఁ జూపట్టెడు.
మ్రాన్పడె - మినువడె - మిన్వడె - వత్తురు వారు - వత్తుర్వారు -
కారుకొనియె - కార్కొనియె - రాములు - రాముల్ - వనములు - వనముల్. |
|
| 17. |
ఆచ్ఛికంబులం బదమధ్యంబుల న ల డ ర ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగ నగు.
| కినుక - కిన్క, కానుక - కాన్క, చిలుక - చిల్క, కాలువ - కాల్వ, అడుగు - అడ్గు,
కడుపు - కడ్పు, పెరుగు - పెర్గు, కూరుకు - కూర్గు. |
|
| 18. |
లాఁతియచ్చునకు సహిత మొకానొకచో నుడినడుమ లోపంబు గానంబడియెడి.
| కలికి - కల్కి, ములికి - ముల్కి, బుడిపి - బుడ్పి, పొలఁతి - పొల్తి. |
|
| 19. |
అబ్బురాదులం దుత్వంబునకు లోపంబు విభాష నగు.
అబ్బురము - అబ్రము.
అబ్బురము - కప్పురము - అప్పుడు - ఇప్పుడు - ఎప్పుడు - చప్పుడు - నెత్తురు ఇత్యాదులు. |
|
| 20. |
చుక్పరక రు వర్ణంబునకు ముందఱి దు వర్ణంబు నుత్వంబునకు లోపంబు విభాషనగు,
నగుచోఁ దత్పూర్వంబు గురువు గాదు.
అదురుచు - అద్రుచు, ఎదురుచు - ఎద్రుచు, పదురుచు - పద్రుచు. |
|
| 21. |
జూదాదుల దాకు జకారంబు విభాష నగు.
జూదము - జూజము.
అవుదు - జవాది - జాది - జాదు - విరవాది. |
|
| 22. |
నిందయం దామ్రేడితంబు నాద్యక్షరములకు హ్రస్వదీర్ఘంబులకు గిగీ లగు.
| కుంభకర్ణుఁడు - గింభకర్ణుఁడు, రావణుఁడు - గీవణుఁడు. |
|
| 23. |
పాదంబునం బ్రథమ ద్వితీయాక్షరములు వళిప్రాసంబులు నాఁబడు.
|
| 24. |
య వ ల లు లఘ్వలఘువులు మైత్రిం బొరయు, రేఫంబులు పొరయవు.
|
| 25. |
రేఫంబులు లఘ్వలఘువులుం దక్కుంగల విశేషంబులు నార్యవ్యవహారంబులఁ దెలియుట శ్రేయంబు.
|