దేశి సాహిత్యము రగడలు సుదర్శన రగడ

తాళ్లపాక యన్నమాచార్యుల కొమారుండు తిరుమలయ్యంగారు చెప్పిన
సుదర్శన రగడ

ఓంకారాక్షరయుక్తము చక్రము
సాంకమధ్యవలయాంతర చక్రము
సర్వఫలప్రదసహజము చక్రము
పూర్వకోణసంపూర్ణము చక్రము
హరవిరించి దివిజాశ్రయ చక్రము
గురుగతి రెండవకోణపుఁ జక్రము
స్రావనిశాచరసంఘము చక్రము
కోవిద తృతీయకోణపుఁ జక్రము
రణభయంకరవిరాజిత చక్రము
గుణయుతచతుర్థకోణపుఁ జక్రము
హుంకారరవమ(హో)గ్రపుఁ జక్రము
కొంకని పంచమ కోణపుఁ జక్రము
ఫట్కారపరబ్రహ్మము చక్రము
షట్కోణాంతవిశాలపుఁ జక్రము
బహళపటహరవభైరవ చక్రము
మిహిరతుహినకరమిళితము చక్రము
కఠినపవి నికరకల్పిత చక్రము
శఠమతఖండనచతురము చక్రము
దంభోళినఖరదారుణ చక్రము
గంభీరసమరకలితము చక్రము
చండమారుతవిసారిత చక్రము
కుండలీశముఖఘోషిత చక్రము
కాలదండశతకాండము చక్రము
జ్వాలానలముఖశౌర్యము చక్రము
విస్ఫులింగచయవిభ్రమ చక్రము
సాస్ఫాలితభుజహారము చక్రము
విద్యుత్కోటినివేశము చక్రము
ప్రద్యోతనమణిబంధము చక్రము
సంభ్రమసంభృతిసహజము చక్రము
బంభ్రమితవిదిక్పటలము చక్రము
భద్రగజప్రభుపాలన చక్రము
రుద్రైకాదశరూపము చక్రము
రక్షోగణగళరక్తము చక్రము
భక్షితదుష్టప్రాణము చక్రము
కంఠనాదఘనగర్జిత చక్రము
లుంఠితతిమిరవిలోకన చక్రము
రోదసినిబిడసురోచి శ్చక్రము
వేదరాశిగణవేల్లిత చక్రము
ప్రళయకాలయమభావము చక్రము
దళితపాతకవితానము చక్రము
వజ్రాయుధబహువర్షుక చక్రము
వజ్రమౌక్తికసువర్ణపుఁ జక్రము
బ్రహ్మాది దివిజపాలన చక్రము
జిహ్మగభూషణజీవిత చక్రము
షోడశభుజసంశోభిత చక్రము
బాడబసహస్రబంధుర చక్రము
ప్రేంఖత్పరశువిభీషణ చక్రము
శంఖచక్రశరచాపము చక్రము
అసిగదాత్రిశూలాంకుశ చక్రము
ముసలపాశహలమోహన చక్రము
అగ్నిఖేటవజ్రాయుధ చక్రము
లగ్నకుంతశుభలక్షణ చక్రము
నేత్రత్రయవర్ణితగురు చక్రము
రాత్రించరవిద్రావణ చక్రము
జ్వాలాకేశవిశాలపుఁ జక్రము
కాలకూటనిభకాంతుల చక్రము
ఘూర్ణమానమదగుంభిత చక్రము
పూర్ణభక్తజనపోషక చక్రము
నిఘ్నబాణకరనికరము చక్రము
విఘ్నాపహరణవిభవము చక్రము
విహ్వలితనరకవీరము చక్రము
సైంహికేయగళసంహర చక్రము
ముష్కరపౌండ్రనిమూలన చక్రము
దుష్కరకర్మవిధూనన చక్రము
నక్రకంఠదళనక్రమ చక్రము
ధిక్కృతదనుజాతిక్రమ చక్రము
దుర్వాసస్సంస్తుత్యము చక్రము
శర్వరీశశతసంచయ చక్రము
త్రిపురవిజయకరతీవ్రము చక్రము
విపులనవరసనవీనము చక్రము
మంత్రాధిరాజమానిత చక్రము
యంత్రపీఠమధ్యాసిత చక్రము
కుంజరపాలనగుణయుత చక్రము
రంజితపుష్పపరాగము చక్రము
సంధ్యారుణపటసంవృత చక్రము
వంధ్యేతరగర్వస్ఫుట చక్రము
మిథ్యావాదతిమిరహర చక్రము
తథ్యామృతసంతర్పిత చక్రము
కల్హారమాలికాధర చక్రము
సిల్హధూపసంశ్లిష్టము చక్రము
అర్కానలదీపాంచిత చక్రము
మార్కండేయనమస్కృత చక్రము
హవ్యకవ్యవివిధాశన చక్రము
దివ్యమునివరధ్యేయము చక్రము
వలయముమీదఁటవలగొను చక్రము
బలవదష్టదళపద్మపుఁ జక్రము
ఎడలఁగేసరము లెనసిన చక్రము
వడినందుమీఁదివలయపుఁ జక్రము
షోడశదళములసొంపగు చక్రము
వీడనికీసరవితతుల చక్రము
మొగిమూఁడువలయములుగల చక్రము
తగుభూగోళముఁదనరిన చక్రము
అంగమంత్రములనధికపుఁ జక్రము
జంగిలిపదాఱుస్వరముల చక్రము
అనఘచక్రగాయత్రిక చక్రము
తననిజమంత్రముదగిలిన చక్రము
నరసింహమంత్రనామపుఁ జక్రము
ధరనక్షరములదామెన చక్రము
మహాసుదర్శనమంత్రము చక్రము
విహారితవజ్రవిధముల చక్రము
అంబరనరసింహాక్షర చక్రము
సాంబుజాక్షపాశాంకుశ చక్రము
మానితదిక్పతిమంత్రము చక్రము
నానావిధహరినామపుఁ జక్రము
వేయువిధంబులవెలసిన చక్రము
వేయంచులుగలవిశ్వపుఁ జక్రము
భావించుసుజనపాలన చక్రము
శ్రీవేంకటపతిచేతిది చక్రము
శ్రీకృష్ణార్పణమస్తు
మంగళమహాశ్రీ శ్రీంజేయు\న్‌.
AndhraBharati AMdhra bhArati - dEshi sAhityamu - ragaDalu - sudarshana ragaDa - sudarSana ragaDa - tALLapAka tirumalayyaMgAru - peda tirumalAchArya - pedatirumalAchArya ( telugu andhra )