| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అరణ్యకాండము |
|
నని యంత శరభంగుఁడనుమునీశ్వరునిఁ గనుఁగొనుతలఁపునఁగాకుత్స్థకులుఁడు చనుచోట నుదయార్కసంకాశ మగుచు నొనర నమ్మునియాశ్రమోపరివీథి హరితహయాకీర్ణమై సితచ్ఛత్ర పరివృతంబై దేవభరితంబు నగుచు నకలంకమణిరోచు లందంద పర్వ నొక విమానముఁగాంచె నుడువీథి నంతఁ గని విమానములోనికల్యాణశీలుఁ గనుఁగొనుతలఁపునఁగదియవచ్చుటయు నది యదృశ్యంబయ్యె.నంత రాఘవుఁడు ముదమొప్ప శరభంగమునిఁగాంచి మ్రొక్కి మునిచేత 23సత్కారములు సాలఁబడసి యనురాగమునఁబొంది యతనికిట్లనియె: “నే మిమ్ము దర్శింప నేతెంచుచోట నో మునీశ్వరచంద్ర!యొక విమానంబు చదలెల్లవెలుఁగ నిచ్చటనుండి పోయె. నది యెందులకు వచ్చె? నదియెందుఁబోయె? నా విమానములోని యతఁడెవ్వఁ?డనిన భూవరునకు మునిపుంగవుఁడనియె: “దేవేంద్రుఁడాతఁడు దేవేంద్రవంద్య! దేవ! నా కడకును దివినుండి ప్రీతి ననిమిషులును దాను నర్థి దీపింప నను బ్రహ్మలోకంబునకుఁబిల్వవచ్చె. వచ్చిన రామభూవరచంద్ర! నీవు విచ్చేయు టిచ్చ భావించి యే నెఱిఁగి నెఱసిన24భక్తితో నిన్నుఁబూజించి మఱి పోవువాఁడనై మది నిశ్చయించి ‘యంతకు రా’నని యతనిఁబొమ్మంటిఁ. జింతించి వజ్రియు శ్రీరామ! నిన్నుఁ గాంతారఖిన్ను నిక్కడ సూడకరిగె. నింతలో విచ్చేసి తినవంశతిలక! ధరణీశ! నీ ప్రసాదమున నా తపము నరుదార నొక విఘ్నమైనను లేక సలిపితి నిష్ఠతో; సఫలంబు నయ్యె. నెలకొని రఘురామ, నినుఁజూడఁగంటి; ననఘ! సుతీక్ష్ణసంయమి నింక నీవు గనుఁగొని యతని చెంగట నుండు;మేనుఁ బనివినియెద నింక బ్రహ్మలోకమున.” కనిచెప్పి రాముసమక్షంబునందు ననలముఖంబున నమ్మునీశ్వరుఁడు తనమేను మంత్రపూతము సేసి వేల్చి యెడపక యింద్రాదులెల్లను గొల్వఁ గడునొప్పుబ్రహ్మలోకమునకుఁజనియె. నా యాశ్రమావాసులైనసంయములు వాయుభక్షకులును వైఖానసులును[వా.రా. సర్గ 6] వాలఖిల్యులు, మౌనవంతులుఁ, బర్ణ శాలావిహీనులు, స్థండిలశయులు, మననశీలురు, దాంతిమంతు లేకాంతు లనశన వ్రతులుఁ,బంచాగ్ని మధ్యగులు మొదలైన తాపసుల్ మూఁకలుగట్టి సదయాత్ముఁడగు రామచంద్రునిఁజేరి: “పితృవాక్యపాలనప్రియుఁడవు, సత్య రతుఁడవు, నీవు నిర్మలయశోనిధివి. రామ! నీ యంతటిరాజు గల్గియును నేము రాక్షసబాధ నిట గుందఁదగునె? వ్రతిని రక్షించిన రాజుకుఁ గలుగు నతని పుణ్యమున నాలవపాలు; గాన, యీ తఱి దైత్యులనెల్ల ఖండించి మా తపోవ్రతములు మైత్రి నిండింపు; సొరిది నీ శరణంబు సొచ్చితి.”మనిన శరణాగతత్రాణచరితుండు గాన యా యాశ్రమమ్మునయందుండు మునుల కాయతమతి రాముఁడభయమ్ములిచ్చి: “మీ యనుగ్రహమున మేటిరక్కసుల, దాయల ఖండింతుఁదలఁకకు.”డనుచు |