ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
శూర్పణఖా వృత్తాంతము
నంత శూర్పణఖ నిత్యము దెచ్చునట్లు
వింతగా నన్నంబు వివిధభక్ష్యములు
పొసఁగ నించినబోనపుట్టికఁగొనుచు
వెసవచ్చి తునిసిన వెదురుజొంపంబు
నడుమ ఖండంబులై నలిఁబడియున్న
కొడుకుఁగనుంగొని కుంభిని వ్రాలి
తెలిసి యా తునుకలు దృఢముగాఁగూర్చి
పలవించి పలవించి పడఁతి యిట్లనియె:
“నోకుమారకచంద్ర! యుచితమే నన్నుఁ
గైకొని చూడవు గన్నులు దెఱచి!
తగుమామ యనక ప్రతాప లంకేశుఁ
డగు రావణునిఁజంప నాత్మఁగోరినను
నీ కొనఁగూడునే! నేరవై తకట!
యా కార్తవీర్యుచే నణఁగెనే యతఁడు!
అనరణ్యుశా104పాబ్ధి నణఁగెనే యతఁడు!
వనజసంభవుశాపవహ్నిచేఁదెగెనె!
నలకూబరునిచేత నలఁగెనే యతఁడు!
అల నందికోపానలార్చులఁ105దెగెనె!
శాండిల్యమౌనిరోషంబునఁజెడెనె!
ఒండేల: ధననాధుఁడుండెనే లంక!
బలవద్విరోధంబు పాడిగా దనెడు
పలుకు నెమ్మదిలోన భావింపవైతి?
ప్రాపింప దతనికిఁబంచత్వ మిపుడు.
‘పాపీ చిరాయు.’వన్‌పలుకు వమ్మౌనె?
పగ వలదన్న నా పలుకు గైకొనక
తెగితి; రావణుఁడేల తెగును నీ చేత?
ధర్మదేవతమాట తల్లిమాటండ్రు.
నిర్మలాత్మక! విననేరవై తకట!
గంధర్వసురసిద్ధగణములు సెఱల
నంధులై యున్నార లసుర మీఱుదురె?
కోరి విద్యుజ్జిహ్వకులదీపకుండ,
భూరితపోనిధి! పుణ్యమానసుఁడ!
తపము106వండె ననంగఁదగ నీకు బుద్ధి
కపటించె; దైవంబుకత లేల యింకఁ?
బతిహీనఁ107నైనట్టి పాపాత్మురాల;
సుతునైనఁగన్నులఁజూడంగ నైనఁ
గొంతశోకము మానుఁ; గులముద్ధరించు
సంతతి ముఖ్యంబు సతులకు నందు.”
రనియని శోకించి యక్కుమారకునిఁ
గనుఁగొని యగ్నిసంస్కారంబు సేసి
యనతిదూరంబున నచలసమాధిఁ
దనరుచునున్న పెద్దలఁ జేరఁబోయి:
108“యోరి!కన్నులు మూసి యుడుగనినిష్ఠ
ఘోరతపంబుఁగైకొని సేయురీతిఁ
దలల మోపెఁడుజడల్‌ ధరియించి భూతి
యలఁది జన్నంబుల నందఱుఁగూడి
తొలఁగక మేఁకపోతుల మెడల్‌ విఱిచి
పొలుపార నుడికించి పొట్టల నిండ
నెట్టన109భుజియించి నెఱిఁగళాసములు
గట్టి యేమియు నెఱుంగనియట్టులుండి
క్రొవ్వి నా శిశువును గుమతులై పట్టి
యెవ్విధిఁజంపితి? రెఱిఁగింపకున్నఁ
దాపసాధములార! తాపంబు దీర
వే పట్టిమ్రింగుదు విడువక మిమ్ము.”
నని కహ కహ రావ మడర డగ్గఱిన
మునులెల్ల భీతిల్లి ముదిత కిట్లనిరి:
“విను శూర్పణఖ! మునివేషుఁడొక్కరుఁడు
సనుదెంచి నీ పుత్త్రు సమయంగఁజేసి
ఫలములు గొని యల్లపర్ణశాలకును
జలియింప కేఁగి యచ్చట నున్నవాఁడు.
ముక్కుమో110మేర్పడు మొగిఁగార్యమునకు;
దిక్కు గల్గితిగాన తెఱవ,యందరుగు.”
మని చూపి చెప్పిన నా దుష్టబుద్ధి
గనలుచు నపుడు లక్ష్మణుఁడు 111సన్నట్టి
యడుగులచొప్పున నరుగ నమ్మునులు
పొడమినభీతిచేఁ:“బులి నాకి విడిచెఁ;
దప్పక దీనికిఁ దగినట్టి బుద్ధి
సెప్పి పంపుదురింకఁ జెలఁగి రాఘవులు.
నాదట సకలదైత్యక్షయంబునకు
నాదికారణమిది.” యని ముదంబంద
విధి బలవంతమై వెసఁద్రిప్పికొనుచు
నధిక వేగంబున నట గొనిపోవ
నత్తఱిఁ112దఱి వేచి యసురేశుచెలియ
లుత్తుంగనాసికం బుగ్రభాలంబు[వా.రా. సర్గ 17]
గురువిలోచనములు గోరదౌడలును
బరపైనకడుపును బల్లవెండ్రుకలుఁ
దెఱనోరుఁగఱిమేను దీర్ఘజిహ్వయును
వెఱపైనరూపును విషమదృష్టియును
నరుదుగా ధరియించి యాఁడురూపమునఁ
గర ముగ్రముగ వచ్చు గరళమో యనఁగ
నొడిసి లోకములెల్ల నొగిమ్రింగఁగడఁగి
పొడమినయొక మహాభూతమో యనఁగఁ
దఱి113వేచి దైత్యసంతతి నాశకాల
మెఱిఁగి భూస్థలిఁదోచుమృత్యువో యనఁగ
నడుఁకక 114వెస శూర్పణఖ యను నాతి
కడఁకతో రాముడగ్గఱఁ115జేర116వచ్చి
యిందీవరశ్యాము నినకోటిధాము
సౌందర్యజితకాము జగదభిరాము
రాము దైతేయవిరాము నీక్షించి
కామభూతము సోఁకఁగనుఁగొన రాక
తామసగుణ మేచి తన్ను లోకాభి
రామఁగాఁదలఁచి యారక్కసి నిక్కి
‘తనమొద్దు మొగము నాతనిముద్దుమొగలీరి
తన మహోదరము నాతనితనూదరము
తన త117ప్పకన్ను లాతనిగొప్పకన్ను
లెన.’యంచుఁ‘దన కితఁడే తగు.’నంచు
మొగము118చేఁటంతగా ముసిముసినగవు
లిగురింప రఘురాము నీక్షించి పలికె:
“శరచాపములు పూని చరియింపనేల
యరుదైనయడవుల నతివయు నీవు?
నీ వేషమున నుండ నేమిగారణము?
నీ వెవ్వఁడవు? మఱి నీకుఁబేరేమి?”
యనవుడు విని రాముఁడల్లన నవ్వి
దనుజకామినితోడఁ దగ నిట్టులనియె:
“రామాభిరామ! యోరామ! నా పేరు
రాముఁడు; దశరథరాజు మా తండ్రి;
యా పర్ణశాల నున్నతఁడు నా తమ్ముఁ;
డీ పద్మలోచన యిల్లాలు 119సీత;
యేను120దండిరి వంప నీ యరణ్యములఁ
బూని చరింతుఁదపోవృత్తి121నిపుడు.
నీ వెవ్వరెలనాఁగ? నీకుఁ బేరేమి?
నీవేల వచ్చితి నేఁడు మాకడకు?
నీ విలాసంబును నీ వయోరూప
లావణ్యమును నింతులకు నెందుఁగలదు?”
నా విని యా శూర్పణఖ రాముఁజూచి
వావిరిఁబల్కె దుర్వారయై నిలిచి:
“ఆ విశ్రవసుకొడు కఖిలకంటకుఁడు
రావణుఁడుగ్రవిక్రమయశోధనుఁడు;
ఆ పటుసత్త్వుని యనుఁగుఁజెల్లెలను;
నా పేరు విను శూర్పణఖ యండ్రు దెలియ.
నీ రూపరేఖలన్నియు సరిచూచి
కూరిమి నీకు నాకును దగునంచు
గామించి వచ్చితిఁ;గడు నొప్పురూపు
గామించినప్పుడే కైకొననేర్తు;
నెందైనఁజననేర్తు; నే వస్తువైనఁ
బొందుగాఁదే నేర్తు; భోగింప నేర్తు;
నున్నదియేల? నా యొప్పు భావింపు;
నన్నుఁబాణిగ్రహణమ్ముఁగావింపు;
మిది కులగుణహీన; యిది వికృతాంగి;
యిది నీకు మఱి తగునే? యటుగాన
యీ మెలఁతుకఁబట్టి యిప్పుడే మ్రింగి
రామ! నీ కోరినరతి సల్ప నేర్తు.”
122నని యది దనుఁజేర నా సీతఁదిగిచి
కొని రాఘవుఁడు దానికోర్కికి నవ్వి
కొంతహాస్యము సేయఁగోరి యా దనుజ
కాంతవికారంబు గనుఁగొని పలికె:
“నే నింతిగలవాఁడ; నిది నన్ను నమ్మి
పూని నాతో వనంబునకు నేతెంచెఁ;[వా.రా. సర్గ 18]
దగిలి నీ కొప్పింపఁదగ దీ లతాంగిఁ;
బగగొనుసవతితోఁ బడఁజాల వీవు;
నీ నాతి లేకున్న నింతకమున్నె
యే నిన్నుఁగైకొందు; నిప్పుడేమాయె?
వాఁడె నా తమ్ముడు వర123సత్త్వధనుఁడు;
124వాఁడు నాకంటెను 125వరరూపధరుఁడు
తన కొక్కచక్కని తరలాయతాక్షి
ననుకూలవతిని నిత్యము గోరుఁ;గాన
నినుఁబొంద నాతఁడు నేర్చు126నీ వరుగు.”
మనవుడు“నౌఁగాక.”యని డాయఁబోయి
నెలకొని:“లక్ష్మణ!నిన్నుఁగామించి
కలయ వచ్చితి నన్నుఁగైకొను.”మనుడు
నా రామునుద్యోగ మతఁడును దెలిసి
ధీరుఁడై దానితోఁదెఱఁగొప్పఁబలికె:
“మెలఁత! మా యన్నఁగామించితి తొలుతఁ
దలఁపున; నటుగాన తగదునిన్‌ బొంద.
సీత నిన్‌ బోలదు చెలువంబునందు;
నీ తరితీపును నీ మురిపంబు
భాతి నింకొకసారి పరికించెనేని
సీత నొల్లక నిన్నుఁజెందు రాఘవుఁడు;
రాము127నిఁబ్రార్థింపు;రమణి!పొ.”మ్మనిన
సౌమిత్రిమాటలు సత్యంబులనుచుఁ
దామసి128తనరోఁత దలఁపక మఱియు
రామునికడ కేఁగి రతికిఁ బ్రార్థింప
“వలవ; దాతనిఁబొందు వనిత! నీ.”వనిన
జలజాక్షి మగుడి లక్ష్మణునిఁ బ్రార్థింపఁ
దమ్ముఁడన్నను, నన్నదమ్మునిఁజూపఁ
ద్రిమ్మరి తనకోర్కి 129తిరితీపులాడ
మఱియు మన్మథుసూత్రమహిమచేఁదిరుగు
130వెఱబొమ్మయో యన వెస నడియాస
131విరసవర్తనలచే వెలఁది యిబ్భంగి
నిరువురిసన్నిధి కెడ దాఁకి తాఁకి.
వేసరి యన్యోన్య వి132రస 133వాక్యముల
గాసిల్లి యెంతయుఁ గలుషించి పలికె:
“నోరిమానవులార! యొకపేదరాలిఁ
గారించు 134గతి నన్నుఁగారింపదగునె?
యేను గోపించిన నింద్రాదిసురుల
నైనను మ్రింగుదు, నట మర్త్యులెంత?
పొదివి యీ యింతితో భువనంబులెల్లఁ
జదిపి మ్రింగెద.”నని 135సంరంభ మెసగ
నదియు మృత్యువుఁబోలె నట్టహాసంబు
పొదల దగ్గఱ 136వచ్చుపూనిక సూచి:
“జానకి దలఁకెడు సౌమిత్రి; యింక
దీనిమేలము చాలు; దీని శిక్షింపు.”
మనిరాఘవుఁడు వల్క137నపుడు లక్ష్మణుఁడు
ఘనవిషజ్వాలోరగము పుట్టవెడలు
ననువున నొఱఁబాపి 138యదరులు సెదరఁ
దనఖడ్గ మంకించి దానవురాలి
ముక్కును జెవులును మొద139లంటఁ140బట్టి
యొక్కటఁద్రెంచిన నుఱక రోఁజుచును
శృంగముల్‌ 141వోయినజేగుఱుఁగొండ
భంగి రక్తము లొల్క భయమంది పాఱి
చని చతుర్దశసహస్రనిశాచరేంద్ర
142జనవిరాజిత జనస్థానంబు నైన

  1. ↑కోపాగ్ని
  2. ↑బడెనె
  3. ↑పండిననైన
  4. ↑నేనెట్టి
  5. ↑ఓర
  6. ↑నమలియెండినకళా
  7. ↑మేర్పడ ముని కార్యమునకు (మొనసినీకనిన)
  8. ↑డేఁగినట్టి
  9. ↑వెసనేచి, నెసరేగి
  10. ↑లేచి
  11. ↑యట
  12. ↑వచ్చిపలికె
  13. ↑ఁబోయి
  14. ↑కప్పకన్ను
  15. ↑చాటింత
  16. ↑నాకు
  17. ↑దండ్రివనుప
  18. ↑మోచి
  19. ↑అనవుడు
  20. ↑తపో
  21. ↑గా
  22. ↑గడు
  23. ↑నందరుగు
  24. ↑సన్నిధికినో
  25. ↑మదిఁగొంత
  26. ↑తీదీపులాడ, తీగలుసాఁగ
  27. ↑తెఱ… దిరిగెఁబేరాస
  28. ↑విరహ
  29. ↑వశవర్తనల
  30. ↑భావముల
  31. ↑తెఱఁగున
  32. ↑సంభ్రమంబెసగ
  33. ↑ఁజూచు
  34. ↑నడరి
  35. ↑యసువులు
  36. ↑లంటిరాఁగఁ-నొ
  37. ↑గోయ-వెక్కుచు వేసారి వివశాత్మ యగుచు
  38. ↑వగిలిన
  39. ↑జననవిరాజిత స్థానంబునైన
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )