| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అరణ్యకాండము |
|
యత్తఱి విహగేంద్రుఁడరుణతనూజుఁ డుత్తమసాహసుండొక కొండనుండి యుక్కలుండగు జటాయువు బిట్టు వినియె నక్కటా! రఘురామ!”యనునార్తరవము. విని సంభ్రమించి నివ్వెఱఁగంది దిశలు గనుఁగొని మోమెత్తి గగనంబు సూచి: “యదయుఁడై రావణుండా రాముదేవిఁ బొదివి యిమ్ములఁగొనిపోవుచున్నాఁడు. నాఁ డీ వనంబున ననుఁగన్న మొదలు పోఁడిమి ఘనమైత్రిఁబ్రోచు రాఘవుఁడు. తగదింక వర్జింప; దైత్యునిర్జించి తెగువమై వైదేహిఁదెత్తు; 279నొండేని, నినకులాధిపునకై యింకఁబ్రాణంబు లనిమొన నొప్పింతు.”నని నిశ్చయించి కులిశంబుధార తాఁకునకు నెబ్భంగి నలవిగా కెగయు మహాద్రిచందమున 280నురుశక్తి మెయివెంచి 281యూఁకించి యెగసి పొరిఁబొరి గిరిశృంగములు నుగ్గుగాఁగ, మరలించి పుక్కిటిమాంసఖండములు ధరణిపై నుమిసి యుదగ్రభావమున ఖరనఖంబులనున్న కరి సింహ శరభ శిరము లంతంతన చిద్రుపలై తొరుగఁ, బటుతుండరోచులు పక్షదీధితులు చటులకోపోగ్రలోచన 282రుచుల్ వర్వఁ బక్షానిలంబులఁ బర్వత283శిఖర వృక్షముల్ విఱిగి284దిగ్వివరంబు నిండఁ, బరగురావణతమఃపటలంబు నడఁప నరుదెంచుమధ్యందినార్కుచందమున నాసన్న285ఖలరావణాదిత్యు మ్రింగ రాసి యుగ్రతవచ్చు రాహుచందమున, వడిఁబేర్చి 286పఱచురావణరాహుమ్రింగఁ దడయక చనుదెంచు తార్క్ష్యునిపగిది:[వా.రా. సర్గ 50, 51] “నిలునిలు పోకుము; నిలు పోకు పోకు; నిలునిలు; రఘురామనృపచంద్రుదేవిఁ గుటిలరాక్షస! యెందుఁగొనిపోయె దింక? నెటపోయె; దెటపోయె; దెందుఁబోయెదవు? పోయినఁబోనీను 287పొరిగొందునిన్ను; వ్రేయుదు,ఖండింతు,విదళింతుఁ,ద్రుంతు, దండింతుఁ288దుండింతుఁదలలుత్తరింతుఁ జెండుబెండుగ.” నంచు సీత నీక్షించి: యోడకోడకు దేవి! యుగ్రరాక్షసుని నీ డాడి నీ చెఱ నే విడిపింతు.” ననిన యా పల్కు మహానిదాఘమున వనమయూరికి ఘనధ్వనియునుబోలి వాడినచేనికి వానయుఁబోలి వేడుక గొంత గావించిన నలరి యా సీత వల్కె: “జటాయువా! నన్ను నీ సురకంటకుండెత్తి యుద్వృత్తి మాయచే రామలక్ష్మణుల వంచించి యో యన్న! కొనిపోవుచున్నవాఁ.”డనిన నలుకమై రథమున కడ్డంబు వచ్చి ప్రలయాభ్రనిర్ఘోషపటుభాషణములఁ బలుమాఱు దశకంఠు భర్జించి మించి నిలిచి యిట్లనియె నూనిన కోప మెసగఁ “బరమపావనుఁడైన బ్రహ్మమన్మఁడవు; వరపుణ్యనిధి విశ్రవసు తనూజుఁడవు; ధనదానుజుండవు; దానవాగ్రణివి; విను మిట్టికృత్యంబు విహితమే నీకు? జగదేకపతి రామచంద్రుని దేవిఁ దగదోరి! కొనిపోవఁదగిలి యిబ్భంగి. ముదలించి తేక రాముని డాఁగురించి సుదతి నీ భంగిఁదెచ్చుట బంటుతనమె? నీ లంకయును నిన్ను నీ బంధుజనులఁ గాలుచు నోరి! రాఘవుకోపవహ్ని. యెఱిఁగియు విషమిటు లేల క్రోలెదవు? ఎఱగొన్న పెనుబాము నేల త్రొక్కెదవు? అఱువదివేలేండ్ల యతివృద్ధు నన్ను నెఱఁగుదో యెఱుఁగవో యే జటాయువను. ఈ పుణ్యసాధ్వి నీవిప్పుడొప్పించి పోపొమ్ము; పోకున్నఁ బోరిలో నిన్నుఁ దుండాగ్ర 289ధారలఁదునియలు సేసి మండిత 290చర్మమర్మములు భేదించి యడరి నీదైన ప్రాణాభిమానములు విడిపించి జానకి విడిపింతు.” ననుడు నరదంబు నిలిపి యుదగ్రుఁడై దైత్య వరుఁడల్గి విలు గుణధ్వని సేసి యార్చి ఘోరబాణము లేయఁగోపించి విహగ వీరుఁడు తద్బాణవితతులు ద్రుంచి యురుపక్షయుగమున నురము దట్టించి పొరి ఫాలములు సీఱి భుజములు వొడిచి దరమిడి ఖరనఖతతుల నొప్పింపఁ గరముఁగోపించి రాక్షసకులేశ్వరుఁడు ఖగరాజు నెఱకలు గాఁడనుగ్రంబు లగు బాణములు 291వది యడరి యేయుటయుఁ దుండాగ్రమున విల్లు దునియలుగాఁగ ఖండించి వడిఁబతాక292ము నేలఁగలపి దనుజేశుమకుటముల్ ధరఁ293బడఁదన్ని పెనఁచి సారథిఁబట్టి ప్రేవులు 294సీఱి తలమీఱి దనుజురథ్యములఁజెండాడి చలమొప్ప నరదంబుఁజదియ మోఁదుటయు విరథుఁడై రాక్షసవిభుఁ295డు 296గంపించి ధరణిపైఁబడి లేచి ధరణిజఁగొనుచు మాయాబలంబున మఱి మింటి కెగసి పోయెఁ.,బోయినఁజూచి పోనీక 297మఱియు నడ్డగించి జటాయు వాకాశవీథి నొడ్డినగతిఁదాఁకి:“యోరి, పాపాత్మ! జుణిఁగి యే లోకంబుఁజొచ్చిననైనఁ దృణముగాఁబట్టి వధింతు ని”న్ననినఁ దిరిగి రోషమున దైతేయవల్లభుఁడు298 కరముగ్రమైన ముద్గరము వైచుటయు నది తుండమునఁద్రుంచి యతనిమస్తములు సదియంగ నడిచి కేశములు 299రాల్చుటయు సురవైరి గోపించి స్రుక్కక కదిసి యురువడిఁబక్షీంద్రు నొడిసి రాఁదిగిచి మొగిఁబట్టి యందంద ముష్టి300ఘట్టనలఁ దగిలి నొప్పింప నుద్ధతశక్తి మెఱయ దనుజేంద్రవిహగేంద్రదారుణయుద్ధ మనిమిషాదులు సూచి యచ్చెరుపడిరి. అరుదైనకడమిమై నంత రావణుఁడు కర ముగ్ర301గతి మించి ఖడ్గమంకించి యెఱకలుపదములు 302నెగిచి త్రుంచుటయు నెఱిదూలి ఖగపతి నేలకువ్రాలె303[వా.రా. సర్గ 52-55] నంత సంతోషించి యవనిజఁగొనుచు నెంతయు రయమున నేఁగె రావణుఁడు అప్పుడు బ్రహ్మాదులగు సురల్ మునులుఁ “దప్పదు రాముచే దశకంఠుఁ డీల్గు; మన మనోరథములు మనకు సిద్ధించు.” నని చెప్పికొని యుబ్బిరందఱుఁబ్రీతి. ననిమిషపథమున నంత రావణుఁడు చనురయంబున సీతచరణ నూపురము సురవైరి కుత్పాత సూచకం304బగుచు నురువడిఁ305బఱతెంచునుల్కయై పడియె. జగతిపై జాహ్నవి జలధార లొలుకు పగిదియై యాకాశపథమున నుండి చెలువకుచంబులఁజెలువొందుహార ములు ద్రెవ్వి యందంద పుడమిపైఁబడియెఁ. నా లోన సీత“హాహా”రవంబెసగ లోలోనఁగడు నడలుచుఁబోయి పోయి యట ఋశ్యమూకంబునందు వానరులఁ బటుసత్త్వులేవురఁ306బరికించి కాంచి తన 307వస్త్రమునఁగొంత 308దగఁజించిపుచ్చి. తనభూషణంబులు దాన బంధించి “వీరైన రామభూవిభున కీ వార్త లారయఁదెలుపరే.”యను బుద్ధినపుడు తడయక రాముచే దశకంఠుఁడింకఁ జెడునంచు ముడియ వైచినబాగు దోప వారి మధ్యంబున వైచుచుఁ309బోవ వారును దాఁచి310రి వడిఁదానిఁబుచ్చి. దనుజాధిపతి యంత దశరథాత్మజులు ‘దనవెంట వత్తు’ రన్‌తల్లడంబునను వెలవెలఁబాఱుచు వెనుకఁజూచుచును దలఁకుచు వడి సముద్రము దాటిపోయి జడిగొను311మరణసూచకనిమిత్తములు పొడ312సూచుచును రయంబునలంకఁజొచ్చి |