ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
లంకలో సీత నుంచుట
యనుపమవివిధభోగాస్పదంబైన
తన నగరికి వచ్చి తగు రాజసమున
జనకజకును దన సకలసంపదలు
మునుకొని యెంతయు ముదమొప్పఁజూపి
“యివె నా నివాసంబు; లివె నా ధనంబు;
లివె నా తురంగంబు;లివె నా గజంబు;
లివె యేను దివిజులనెల్ల భంజించి
తివుటమైఁదెచ్చిన దివ్యరత్నములు;
నిదె కుబేరుని గెల్చియేను గైకొన్న
మది కింపుగావించుమణిపుష్పకంబు;
వీరె నా కుడిగముల్‌ వేర్వేఱ సేయు
చారణామరసిద్ధసాధ్యకన్యకలు;
వారె నా మాట గర్వమునఁగైకొనక
కారాగృహంబుల గాసిల్లుసతులు;
నవె నాట్యశాల; లల్లవె కేళివనము;
లివె చంద్రశాల లోయిందీవరాక్షి!
కరమర్థి నింతకుఁగర్తవై నీవ
యరుదుగా భోగింపు మఖిలసంపదలు.”
ననవుడుఁదృణఖండ మతివచేఁబట్టి
కొని పల్కె వానిఁగైకొనక యెంతయును
“ఓరి! నీ కీ పాప మూరకపోదు
ఘోరాగ్నియై నిన్నుఁగొని కాల్చుఁగాని;
నిడివిగా బ్రదుకరు నీవు నీ వారు;
చెడిపోవఁగలవారు; సిద్ధ313మీ పలుకు.
రాముబాణానల రాశిలోఁగూలి
నీమేను వడిఁగాలి నీఱు గాకున్న
ఘనమైన యీ పాతకము లొంటఁదీర.”
వని పల్కి వైదేహి యందంద పొగిలి
“యిట్టిదుర్వాక్యంబు 314లేను నా చెవులఁ
బెట్టితి; నేఁడు నాపెంపెల్లఁ315బొలిసె;
316నామాన మిటుసేసి నన్నింతసేసె;
నేమని పలవింతు317నేను నా విధికి?”
నని మహారోదన మందంద సేయఁ
దనమదిఁగోపించి దనుజవల్లభుఁడు
తెఱఁగొప్ప నప్పుడు త్రిజటాదులైన
తెఱవలఁబిలిచి ధాత్రీపుత్త్రి318ఁజూపి:
“యెందునేమఱకమీరిందఱుఁ319గూడి
పొందుగా320ననుఁబొంద బోధించుకొనుచు
నెనసిన కడఁక నీ యింతి నశోక
వనమున నిడుకొని వర్తింపుఁ.”డనుచుఁ
బనిచి కాపుగఁబెట్టి పంక్తికంధరుఁడు
తనమది మదనాగ్ని దరికొన నుండె.

  1. ↑లీవు
  2. ↑దూలె
  3. ↑నాపాలికర్మమే
  4. ↑నింక - నేఁడు
  5. ↑నిప్పుడె
  6. ↑గాచి
  7. ↑ఁదను
  8. ↑కున్కియె
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )