ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
శ్రీరామ దుఃఖము
మాయామృగంబైన మారీచుఁజంపి
యా యెడ శ్రీరాముఁడన్యమృగంబుఁ[వా.రా. సర్గ 57-59]
జంపి తన్మాంసంబుఁజర్మంబుఁగొనుచు
నింపొంది మరలి తా నేతెంచుచోట
మ్రోయుజంబుక రవంబునకుఁ గుందుచును
నాయాసమందుచు నట వచ్చివచ్చి
రామభూపాలుఁడరణ్యమధ్యమున
సౌమిత్రిఁబొడగని చాల భీతిల్లి:
“యకట! లక్ష్మణుఁడ! నా యాజ్ఞగైకొనక
వికలధైర్యమున వివేకివై యుండి
యత్తన్వి సీత నయ్యడవిలో డించి
వత్తురే? యిట్లేలవచ్చితి వీవు?
జగతిపైఁగలుగు రాక్షసులెల్ల మనకుఁ
బగయౌట యెఱుఁగవే పలుమాఱు నీవు!
కులహాని గుణహాని గురుధర్మహాని
తలపోయవలవదే తమ్ముఁడా! నీవు!”
అనవుడు లక్ష్మణుండతిభీతిఁబొంది
యనయంబుఁగంపించి హస్తముల్‌ మొగిచి:
“జగదీశ! నాకిటు చనుదేరఁదగదు;
తగ 321కుంట నెఱుఁగుదుఁద్రైలోక్యనాథ;
మాయామృగాకృతి మఱి మిమ్ముఁద్రిప్పి
పాయక మీ దివ్యబాణాగ్నిశిఖలఁ
గూలుచునుండి యాకుటిలరాక్షసుఁడు
“హా లక్ష్మణా!”యన్నయార్త322రవంబు
సీతామహాదేవి 323చెవిసోఁక మిగుల
భీతిల్లి నీదైనపెంపెల్ల మఱచి:
“యన్న, మీయన్న చొప్పరయఁబొమ్మన్న;
యెన్నఁడు 324నెలుఁగింపఁడిటుదీనవృత్తి
సౌమిత్రి.”యన325వుడు జానకిఁజూచి:
“భూమిజ! నీకింత పొగులంగ వలదు.
పనివడి మనయందు భయము వుట్టింప
నని రాక్షసుఁడు క్రూరుఁడై చీఱెఁగాక!
యినకులాధిపుఁడేడ? యీ దైన్యమేడ?
జనకజ! నీవేల చంచలించెదవు?”
అనవుడుఁగోపించి యా దేవి, నన్ను
వినరానిపలుకులు 326వెస దూఱి పలుక
నేను నా మదిలోన నెంతయు వగచి
దానికి వనదేవతల సాక్షివెట్ట
యిట కేను వచ్చితి నిక్ష్వాకుతిలక!
యటుగాన తప్పుగా నవధరింపకుము.”
అని బాష్పలోచనుండై మ్రొక్కి యున్న
యనుజన్ముఁగరముల నల్లన నెత్తి
కనుఁగవఁదొరిగెడు కన్నీరు దుడిచి
యనయంబు వగచి యిట్లనియె రాఘవుఁడు:
“ఆజన్మశుద్ధుఁడై యఖిలజ్ఞుఁడైన
యా జనకునిపుత్త్రియై వార్తకెక్కు
నా327పడఁతుక నిన్ను నాడుటలెల్ల
నాపదలకు మూలమని విచారించి
నిలువక వత్తురే? నీ328యట్టివాని
కలుగుట దగునయ్య, యతివమాటలకు!”
ననుచు సౌమిత్రినూరార్చి329యేతెంచి
జననాథుఁడ330టనిజాశ్రమభూమిఁజొచ్చి:[వా.రా. సర్గ 60-64]
“యిదియేమి లక్ష్మణా! యీ యాశ్రమంబు
తుదిముట్ట శూన్యమైతోచుచున్నదియు;
వనదేవతానంద వచనఘోషములు
వినరావు; చెలఁగవు విహగనాదములు.
ఏలకో మునివరు లిట సంచరింప?
రేలకో సీత నాకెదురుగా రాదు?
కడుదీనమై బుద్ధిగలఁగెడు నాకు
నెడమక న్నదరెడు నేలకో నేఁడు.
ఇక్కానలోపల నీవును నేను
నక్కటా! యేదుఃఖ మనుభవించెదమొ!”
యని పర్ణశాలకు నటు సేరవచ్చి
దినకరరుచిలేని దినలక్ష్మిఁబోలి
రేరాజుకళలేని రేయునుబోలి
శారిక లేని పంజరమునుబోలి
యెనయఁగోవిలలేని యెలమావిఁబోలి
కనుఁగొన విన్ననై కడుఁబాడువాఱి,
యున్నచందముఁజూచి యుల్లంబు గలఁగి
విన్ననై ధృతిఁదూలి వెలవెలవాఱి
పన్ని శోకరసంబు ప్రవహించె ననఁగఁ
గన్నుల బాష్పాంబుకణములు దొరుగఁ
బెదవులు దడుపుచు భీతిఁబ్రాణములు
సెదరఁదమ్మునిఁజూచి శ్రీరాముఁడనియె:
“బోలఁజూచితి నేను భూమిజ పర్ణ
శాలలోపల నున్నచందంబు లేదు;
పొదలఁబూవులు గోయఁబోయెనో! కాక
వెదక నొండొకజాడ వెడలెనో!కాక,
సరసులఁగ్రీడింపఁజనియెనో! కాక,
కరముగ్రమగుభీతిఁగ్రాఁగెనో! కాక
డాసి న331వ్వులకునై డాఁగెనో? కాక,
యీసునఁగొని యెక్కడేఁగెనో! కాక,
యే చందమో నాకు 332నింతయుఁదెలియ?
దే చందమున సీత యిందులో లేదు?”
అని వితర్కించుచు నా పర్ణశాలఁ
జని చొచ్చి లోపల సకలంబు వెదకి
జానకి నా పర్ణశాలలో333పలను
గానక ప్రాణముల్‌ గలఁగి కంపింప
మనమెల్లఁజెడి మేను మ్రాన్పడి334బోధ
మను రవి శోకాబ్ధి నస్తమించుటయు
భ్రాంతి యన్‌చీకటి ప్రబలమై పర్వి
యంతరంగముఁగప్పి యక్షులు గప్పి
మఱలెడుధృతిఁగప్పి మానంబుఁగప్పి
నెఱసి335న వికలుఁడై నేలకు వ్రాలి;
“వదలక సీతకై వగచెడి నన్నుఁ
బ్రిదిలి పోనీక నొప్పించె నెవ్వగలు.
ఈవగ నాకిప్పు336డే త్రోవవచ్చె?
నే వెంటఁదరియింతు నింక నీ వగలు?
నే మెయి వచ్చితి మీ కాననముల?
కే మాటలాడుదు నితనితో నింక?
నే నన్న నితనికి, నతఁడు నా తమ్ముఁ
డేను నీతఁడుఁగూడి యెట్లు వేఁగెదమొ?
యనువిచారము బుద్ధి నణుమాత్రమైన
ననుపనేరక రాముఁడుల్లంబు గలఁగి
మదనవేదనల నున్మత్తుచందమున
బెదరి చూచుచుఁ దన పెంపెల్ల మఱచి
“తనుమధ్య! నీ వింత దడవెందుఁబోయి.”
తని చూచు “నిందుర.”మ్మని చేరఁబిలుచుఁ;
బ్రియమొప్పఁబయిఁబడి పెనఁచి రాఁదిగుచు
బయలు గౌఁగిటఁజేర్చిపలుమాఱువగచు
నొయ్యన నూరార్చు; నొకకొంతవడికి
నొయ్యనఁదనలోన నొకకొంత దెలియు.
“నక్కటా! సౌమిత్రి! యవనీతనూజ
యెక్కడవోయెనో యేమైనయదియొ?
వెలి నడుగులచొప్పు వెదకియుఁగాన;
జలజాక్షి యా పర్ణశాలలో లేదు
ఏ దెసఁబోయెనో యిందీవరాక్షి?
యీ దెసఁగాదొకో? యిది పర్ణశాల
కాదొకో? యిది దండకావనభూమి
కాదొకో? రాముఁడఁగానొకో నేను?
నైన నా ప్రాణంబు లకట! యీ బొంది
లోనెట్టులున్నవి లోలాక్షిఁ బాసి?
పూని యీ యెడఁబ్రాణములతగుల్‌ రోసి
తా337నును దివికేఁగఁదలఁచితినేని
“వ్రతము338సెల్లింపక వచ్చె వీఁడెట్టి
సుతుఁ!’డంచు నను గణించునె దశరథుండు?
కాదేని వ్రతము సాంగంబుగాఁదీర్చి
మేదినిఁబాలింప మిన్నక పురికిఁ
జనినచో మిథిలుఁడచ్చటికి రా నతనిఁ
గనుఁగొనఁగా సిగ్గు గాదొకో నాకు?
నటు339గాన నన్ను నీ340యడవిలో విడిచి
పటుబుద్ధిఁబురికేఁగి భరతునిఁగాంచి
“తనయనుమతి సర్వధరణిఁబాలింపు”
మనిచెప్పి కైకకు నా సుమిత్రకును
కౌసల్యకును జనకజ సన్నతెఱఁగు
నా సుద్దియును దెల్పు; నను మది నిల్పు.”
మని రాఘవుఁడు రెప్పలల్లన వ్రాల్చె.
జనకజ మును బర్ణశాలలో నుండి
పోయినగతి341 మనంబుననుండి వెడలి
పోయెడు నని యడ్డముగఁజేర్చె ననఁగ.
నప్పుడు లక్ష్మణుఁడన్న చందంబు
తప్పక చూచి యెంతయు శోకమంది
“యే తల్లి పనిసేసి, యే తల్లిఁగొలిచి?
యే తల్లి తల్లిగా నిటమీఁద 342నడతు?
నినకులాధిపుశోక మే343త్రోవ మాన్తుఁ?
దనకుఁదల్లులకును దన సోదరులకు
నెనయ నీతనితోడిదే లోకమగుట
344మనువంశమంతయు మడిసెఁ బొ.”మ్మనుచు
నందంద విలపింప నంతలో రాముఁ
డొందినమూర్ఛఁ దా345నొకకొంత దెలిసి
తలకొన్నవగలతో 346దండకావనముఁ
గలయ నాలోకించి కన్నీరునించి
వనజాక్షిఁజింతించి వగలు రెట్టింపఁ
దనమది శోకించి 347దైవంబు దూఱి:
“పోయితే సీత! నా బొందితోఁబాసి
పోయితే ననుఁబ్రాణములతోడ డించి!
పొరి సురాసురలోకపూజార్హ348మనక
హరువిల్లు349విఱిచితి నతివ! నీ కొఱకు.
బరునిఁగాఁదలపోసి బ్రాహ్మణుఁడనక
పరశురాముని భంగపఱచితిఁగడఁగి.
నీరజలోచన! నీకునై పూని
యీ రెండునిందల నేను గైకొంటిఁ.
గడపట నినుఁబాపెఁ350గష్టదైవంబు.
పడఁతి! నిందలఁబడఁబాలైతి నేను.
నీ వేడుకలు సూచి“నీ కేను బ్రియముఁ
గావింతు”ననిపోయి కపటమృగంబుఁ
జంపి తెచ్చితి దాని చర్మంబుఁగడఁగి
యింపార నెవ్వరి కిత్తు నే నింక?
మది నెల్లసుఖములు మఱచి కానలకు
వదలక నను నమ్మి వచ్చినచోట
నినుఁగావలేనైతి; నీ చన్నత్రోవఁ
గని రయంబున వచ్చికదియలేనైతిఁ;
బరువడి జగమెల్లఁ బాలింపఁజాలు
వరశక్తి గలిగినవాని చందమున
మునుకొని శరచాపములు దాల్చి ఘోర
వనదుర్గభూముల వర్తింప వచ్చి
పెడమఱి మా వారి పెంపెల్లఁదక్కి
పడఁతుక! నినుఁగోలుపడితి నేనింక.
నేణాక్షి! నినుఁబాసి యీ శరీరమునఁ
బ్రాణంబు లెబ్భంగిఁబట్టుదు నింక?
మేదినీతనయ! నీ మేనితోఁబాసి
యేదెస భరియింతు నీ దేహమింక?
నెలఁత! యీ విరహాగ్ని నీదు లావణ్య
జలధిలో మునుఁగక చల్లార్పరాదు.
తగిలి యీ శోకాబ్ధిఁదరుణి! నీ మేను
తగు తెప్ప గాకెట్లు తరియింపవచ్చు?
మగువ! నీ పాలిండ్లమఱుఁగు లేకున్న
నొగిఁగాముశరవృష్టి కోర్వంగరాదు?
పడఁతి! నీ ముఖచంద్రుప్రాపు లేకున్నఁ
గడతేరవశమె దుఃఖతమంబుచేత?
మటుమాయదైవంబు మత్సరంబూని
కటకటా! కపటమృగవ్యాజమునను
నన్నటు కొని చని నలినాక్షి! పిదప
నిన్నిటు గొనిపోయె; నేఁడిట్లు మనల
నిరువురఁబాపిన యీ దైవమునకు
నరుదెందుఁగల! దసాధ్యములెందుఁగలవు?
కోమలి! నిన్నెత్తుకొనిపోవు నప్పు
డేమని విలపించి? తేమంటి నన్ను?
నే దేశమున కేఁగి? తెందున్న దాన?
వే దుఃఖముల వేఁగె? దేమి సేసెదవు?
ఎవ్వరు గొనిపోయి? రేత్రోవఁబోయి?
351తెవ్విధి వాటిల్లెనే నేఁడు మనకు?
నీ యట్టిచదురాలు నీ యట్టిముగ్ధ
నీ యట్టి లావణ్యనిధి యెందుఁగలదు?
కలదొకో యొకనాఁడు గరమర్థి నిన్నుఁ
గలసి వినోదింపఁగమలాక్షి నాకు?352
జలజాక్షి! నినుఁగూడి సాకేతపురము
గలవాఁడ నని కాని, కాన నొండొకటి
కలకంఠి! నినుఁగూడి కనకహర్మ్యములు
గలవాఁడ నని కాని, కాన నొండొకటి
యలివేణి! నినుఁగూడి యఖిలభోగములు
గలవాఁడ నని కాని, కాన నొండొకటి
నెలఁతుక! నినుఁగూడి నిఖిలసౌఖ్యములు
గలవాఁడ నని కాని, కాన నొండొకటి
యిది మహారణ్యమై యిప్పుడు తోచె;
నిది పర్ణశాలయై యిప్పుడు తోచె;
నిది నాకుఁదపమని యిప్పుడు తోచె;
నిది నాకు దుఃఖమై యిప్పుడు తోచె;
నేలె మహీపుత్త్రి, యేలె మృగాక్షి,
యేలె సరో353జాక్షి, యేలె లతాంగి,
యేలె వధూమణి, యిన్నిచందములఁ
గాలుచునున్నాడఁ;‘ఁగటకటా!”యనవు.
అలసయానము354లబాగంచల కిచ్చి
లలితాంఘ్రిరుచి ప్రవాళంబుల కిచ్చి
వరకుచోన్నతి చక్రవాకుల కిచ్చి
కరములకెంపు పంకజముల కిచ్చి
మెయిచాయ 355క్రొక్కారుమెఱుఁగులకిచ్చి
నయనవైభవము మీనములకు నిచ్చి
చల్లనిముఖదీప్తి చంద్రున కిచ్చి
తెల్లని నగవు చంద్రికలకు నిచ్చి
చెలువంపుఁబలుకులు చిలుకల కిచ్చి
యలకలనునుఁగాంతి యళులకు నిచ్చి
రదములయొప్పు వజ్రంబుల కిచ్చి
పొదలుమైతావులు పూవుల కిచ్చి
సన్నపు నడు మాకసంబున కిచ్చి
356నిన్ను దైవము మ్రింగెనే? నేఁడు 357సీత!
హా వామలోచన! హా పద్మగంధి!
హా వారిజానన! హా సీత!” యనుచు
వివశుఁడై రామభూవిభుఁడు పల్వగలఁ
దవిలి దీనతఁబొంది తమ్మునిఁజూచి:
“యే దెసఁబోయెనో? 358యిందీవరాక్షి,
పోదమా! లక్ష్మణ! భూమిజ వెదక?
నొలసి యే పొదలలో నున్నదో పోయి
పిలుతమా? లక్ష్మణ! పృథ్వీతనూజ
నీ తరుజాతంబు లెఱుఁగునో యడిగి
చూతమా? లక్ష్మణ! శుకమంజువాణి
ఎత్తమ్మికొలఁకుల కేఁగెనో యరసి
వత్తమా? లక్ష్మణ! వనజాక్షి”ననుచు
ధరియింపరాని వేదనలతో రామ
ధరణి వల్లభుఁడు గౌతమిఁజేరఁబోయి
“ఓ లోకపావని! యో లోకమాత!
యీ లోకపావని నెఱుఁగవే సీత?
నో లోకబాంధవ! యో కర్మసాక్షి!
యే లీలనైన నీ వెఱుఁగవే సీత?
నో సర్వసంచార! యోజగత్ప్రాణ!
యా సీత నెఱుఁగవే యనఘ! నీవైన?
నెలదీగ! కానవే? యెలదీగబోఁడి
జలజంబ! కానవే? జలజాతవదన
హరిరాజ! కానవే? హరిరాజమధ్యఁ
గరిరాజ! కానవే? కరిరాజగమన
హరిణంబ! కానవే? హరిణాయతాక్షిఁ
బరభృత! కానవే? పరభృతవాణి
నలినాథ! కానవే? యలినీలవేణిఁ
దిలకంబ! కానవే? తిలకాంచితాస్యఁ
జందన! కానవే? యలినీలవేణిఁ
గుందంబ! కానవే? కుందాభరదన?”
ననుచుఁబరిభ్రాంతుఁడై యందునందుఁ
జనిచని యడుగుచుఁజాలిఁదూలుచును
నెడపక యిబ్భంగి నెందు వైదేహిఁ
దడవి కానక జనస్థానంబు వెడలి
విన్ననై విర359హార్తివివశుఁడై యున్న
యన్న నీక్షించి యిట్లనియె లక్ష్మణుఁడు:
“అన్న! నీ వఖిలలోకారాధ్యవరుఁడ,
వున్నతచిత్తుఁడ, వురుబలాఢ్యుఁడవు,
ఇంతికై 360విభ్రాంతి నిన్ని చందముల
నింత శోకింతురే? యినకులాధీశ!
ఈ మోహశోకంబు లిటు నీకు 361గలవె?
తామసమోహనార్థము362గాదె జగతి?
నరుదుగా నీవు విల్లందితివేని
సురలైన నీ దిక్కు చూడనోపుదురె?
యసమానసత్త్వుండ వఖిలేశ! నీవు;
వసుధేశ! నా 363యట్టివాఁడు నీ బంటు.
అక్కటా! నీ కసాధ్యము లెందుఁగలవు;
తక్కక నీ పేర్మిఁదలఁపవుగాక?”
యనిన రాముఁడు శోకమంతయు నుడిగి
తన మదిఁదెలివొంది తమ్మునిఁజూచి:
“యే నింక నిటమీఁద నెన్నిచందముల
జానకిఁబెడఁబాసి సైరింపఁజాల.
వారక నాదు దుర్వారబాణముల
ధారుణీతలము విదారించి చొచ్చి
పాతాళవాసులఁబట్టి బంధించి
శీతాంశుముఖియైన సీత సాధింతుఁ;
గాదేని, సప్తసాగరములు గలఁచి
మేదినీధరములు మెఱమి నుగ్గాడి,
యీరసంబున దిగ్గజేంద్రకుంభములు
దారించి, మేదినీతనయ సాధింతుఁ;
గాదేని, నష్టదిక్పాలమర్మములు
భేదించి, యాదిత్యబింబంబుఁ 364ద్రుంచి,
పొరిఁబొరి నక్షత్త్రములు డుల్ల నేసి,
ధరణిఁజీకటి సేసి తరుణి సాధింతుఁ;
గాదేని, సకలరాక్షసులు భస్మంబు
గా 365దీప్తబాణముల్‌ కడఁకతో నేసి
యవని నరాక్షసమై యుండఁజేసి
తివుటమై366నేఁడు వైదేహి సాధింతుఁ;
గాదేని, బ్రహ్మలోకంబెల్లఁగలఁచి
యాదిమబ్రహ్మసంహారంబు సేసి
బలసి జీవులకెల్ల భయము వుట్టించి
నెలకొన్న 367కడిమిమై నెలఁత సాధింతు.
నీ రీతి భుజశక్తి నేఁజూపకున్నఁ
జేరి మిన్నక సురల్‌ సీతఁజూపుదురె?
యదె చూడు నాదుబాణానలశిఖలు
పొదువుచు నున్నవి భువనంబు 368లెల్ల.
నిదెచూడు వైదేహి నే విజృంభించి
త్రిదశులు మెచ్చ సాధించెద.”ననుచు
నొదవి లోకములకు నుత్పాతకేతు
వుదయించె నన బొమ369లుఱక నిక్కించి,
బలసి జీవులతోడ బ్రహ్మాండ 370తలము
నలిసేయుసంకర్షణస్వరూపంబు
రూపించి, లయకాలరుద్రుండువోలెఁ
గోపించి, విల్లందికొనినమాత్రమునఁ
దలఁకె భూతములు; భూతలమెల్ల వడఁకెఁ;
గలఁగెఁబయోధులు; గగనమల్లాడె;
బ్రహ్మాండభాండముల్‌ వగిలినట్లయ్యె
బ్రహ్మమంత్రము దప్పె; 371రవి దప్పినడచె;
నక్షత్రములు డుల్లె; నభవుండు వెఱచె;
యక్షదేవాసురులాత్మఁ జేడ్పడిరి.
అత్తఱిసౌమిత్రి యా రాముఁజూచి
చిత్తంబు భయమందఁజేతులు మొగిచి:[వా.రా. సర్గ 65, 66]
“కాకుత్స్థ! నీ వతికారుణ్యనిధివి;
లోకైక రక్షణ లోలచిత్తుఁడవు.
జనకజకై పూని సకలలోకములు
మునుమిడి నిర్మూలములు సేయఁదగునె?
యొండొండ వనములు నొగి సముద్రములు
నిండినపురములు నిఖిలదేశములు
నలయక వైదేహి నరసి లేకున్నఁ
జలముపెంపున మఱి సాధిం372తుగాని.”
యనిన తమ్ముని మాటలన్నియుఁబ్రీతి
విని కోపముడిగి తా వి ల్లెక్కు డించి
యఖిలేశుఁడగు రాముఁడట దక్షిణాభి
ముఖుఁడయి తానుఁదమ్ముఁడు వోవుచుండె.
నాతఱిఁదెరువున నందంద నలఁగి
సీత కొప్పుననుండి చిందినవిరులు,
నా తన్వివక్షోజహారరత్నములు
నాతతమణిమయంబైన యా నాతి
పదనూపురము లుర్విఁబడియున్నఁజూచి
ముదము శోకంబును మూర్ఛయుఁగదుర
నప్పుడు రఘరాముఁడాత్మఁజింతించి:
“తప్ప; దెవ్వఁడొ క్రూర దానవుండొకఁడు
కుటిలకుంతల నెత్తుకొని పోయినాఁడు;
కటకటా!”యని త్రోవఁగనుఁగొంచుఁబోవ

  1. ↑ఘోషణము
  2. ↑చిత్తంబుసోఁక
  3. ↑నెఱిఁగింపఁడీదీన
  4. ↑నేను
  5. ↑విడిచిపల్కుటయు
  6. ↑పుణ్యవతి యెగ్గులాడుటయెల్ల
  7. ↑యంతవాని
  8. ↑యెంతయును
  9. ↑డంత
  10. ↑పులులకై
  11. ↑నేమియు
  12. ↑నెందుఁ
  13. ↑ధైర్య
  14. ↑నిర్విణ్ణుఁడై
  15. ↑డీ
  16. ↑నైన
  17. ↑నిడిం
  18. ↑గాక
  19. ↑వ
  20. ↑ఁబ్రాణములుదనమేనఁ బోయినగతిగాఁగ బుద్ధిఁజింతింప - (మూర్ఛఁబొందె రాఘవుడు.)
  21. ↑దలఁతు,జూతు
  22. ↑రీతి
  23. ↑మన
  24. ↑నొయ్యన
  25. ↑ఁదమ్మునిఁజూచి
  26. ↑ధైర్యంబుడించి
  27. ↑మైన
  28. ↑మోపెట్టి తతివ
  29. ↑గడిఁది
  30. ↑తి
  31. ↑దొరకునే యొకనాఁడు తొగరులేఁజిగురు - దరుము నీ మోవి సుధారసమాన, హరిణాక్షి, యొకనాఁటి కబ్బునేనాకుఁ - దఱచైన నీ చక్కఁదనము వీక్షింప జలజాక్షి…
  32. ↑జాస్య
  33. ↑రాజహంసల
  34. ↑తొలుకారు
  35. ↑మిన్నక దైవంబు మ్రింగెనే సీత
  36. ↑భామ
  37. ↑యీ వనంబులను
  38. ↑హాగ్ని
  39. ↑పనివడి (వెనుబడి) యి
  40. ↑దగునె
  41. ↑గాక
  42. ↑యంత
  43. ↑గలఁచి
  44. ↑దివ్య
  45. ↑ఁబేర్చి
  46. ↑కడఁకతో
  47. ↑లదర
  48. ↑లుదరి
  49. ↑మెల్ల
  50. ↑ప్రభలెల్ల మాసె
  51. ↑పరాదె
  52. ↑వడఁ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )