| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అరణ్యకాండము |
|
దుందుభిపటహాదితూర్యనాదముల క్రందునకంటె384వెగ్గలముగా385ఁబొదలి ముందఱ నొకమ్రోఁత మ్రోయంగ దాని చందంబుఁగనుఁగొని చనుచు రాఘవులు యోజనాయతబాహు లొగి బారసాచి యే జంతువులనైన నేపుమై నొడిసి యఱిముఱి మ్రింగుచు 386నాఁకలిచిచ్చుఁ జుఱవుచ్చి మస్తకశూన్యుడై నిలిచి యుదరంబు నోరుగా నున్నకబంధు విదళితబహుజీవవితతకబంధుఁ ద్రిదశనిర్బంధు సందీప్తమదాంధుఁ గదిసి రాముఁడు సూచి కడుఁజోద్యమందె. వాఁడును దన కరద్వయమున వారి వేఁడిమి 387వడిఁబట్టి వేవేగఁదిగువ నన్ననుజూచి యిట్లనియె లక్ష్మణుఁడు: “నన్ను వీనికి భక్షణము సేసి మీరు సీత నన్వేషించి చేకొని సకల భూతలం బేలంగఁబొం.” డన్న నతఁడు చింతించుచును వానిచేతులవెంటఁ గొంతదూరము వోయి కూర్మితమ్ముఁడును దానును బుద్ధి నెంతయు విచారించి పూనిక మీఱ గొబ్బున నొఱల్ వెఱికి[వా.రా. సర్గ 70] కడు వాఁడిఖడ్గముల్ గైకొని వాని కడిఁదిచేతులు రెండు ఖండించుటయును నుబ్బెల్లఁజెడి దైత్యుఁడొఱలుచుఁగూలి గొబ్బునఁదెలివి గైకొని వారిఁజూచి “మీరెవ్వ?”రనుడు సౌమిత్రి సర్వంబు శ్రీరాముచరితంబు సెప్పినవాఁడు. 388వినుకలిచే నంత విజ్ఞాన మొదవఁ దనదువృత్తాంతమంతయుఁజెప్పఁదొణఁగె: “దనువనుదివ్యుఁడ ధరణీశ! యేను; ఘనమైన మునిశాపగతి నిట్టులైతిఁ.[వా.రా. సర్గ 71] గనకగర్భునిచేతఁ గామరూపత్వ మును జిరంజీవిత్వమును గాంచి క్రొవ్వి యిట్టి రూపముఁదాల్చి యెల్లసంయములఁ బట్టి బాధింపంగఁబరమ కోపనుఁడు స్థూలశిరుండు నా శోభిల్లు మునికి నీ లోకమునఁదొల్లి యెగ్గు గావింప నతని శాపంబున నా క్షణంబునను నతిఘోరరూపుండనై యేను మరల నతనిఁబ్రార్థించిన నతఁడు మీ వలన నతులశాపవిముక్తి యగు నంచుఁబలుక నదియాదిగా నిట్టియాకృతిఁ బూని త్రిదశేంద్రు నాజి కే తెమ్మన్న నతఁడు కంఠంబు తలతోడఁగడుపులోఁబోవఁ గుంఠితంబుగ సేసెఁగులిశపాతమున.” ననిన రాఘవుఁడు:“దశాననుచంద మనఘ! నీవెఱుఁగుదే?”యనిన వాఁడనియె: “నెఱుఁగుదుఁ;గాని మౌనీంద్రుశాపమున నెఱుక చాలదు నాకు; నీ శరీరమున ననలంబు దరికొల్పుఁ; డామీఁద మీకు వినిపింతుఁదెలియ నివ్విధ.”మన్నవారు దనువు శరీరంబుఁదగ సంస్కరించి యనలున కా దేహ మాహుతి సేయ[వా.రా. సర్గ 72, 73] నతఁడంత దివ్యుఁడై యాకాశవీథి నతులవిమానంబునందుండి పలికె: “నో రఘురామ! యా యోధనోద్దామ! కారుణ్య తారుణ్యగాంభీర్యధుర్య! కాకుత్స్థవర్య! నీ కారుణ్యదృష్టి389ఁ గైకొంటి నా తొంటి కమనీయతనువు; విను; మింక రావణువిధమెల్ల నేను వినుపింతుఁదేటగా వివరించి; యతఁడు ధనదానుజుఁడు; పులస్త్యబ్రహ్మకూర్మి మనుమఁడు; తన తపోమహిమ మెప్పించి నలువచే వరము లున్నతిఁగాంచినాఁడు; చెలఁగి దిగ్విజయంబు చేసినవాఁడు; తొలివేలుపులకెల్ల దొరయైన వాఁడు; కలవేలుపులకెల్లఁగంటైనవాఁడు; బలుతలల్ పదియును బాహు లిర్వదియుఁ గలవాఁడు; లవణసాగరఖేయమైన లంకాపురంబు పాలనసేయువాఁడు; బింకాన రజతాద్రిఁబెఱికినవాఁడు.” అని చెప్పి రావణుండట సీతఁగొనుచుఁ జనినమార్గము 390సెప్పి సరగ నా దనువు మఱిత్రోవ గుఱుతులు మార్గంబునందుఁ దఱచైన వస్తువుల్ దప్పక చెప్పి “391మేరగాఁబంపాసమీపంబునందు నా రూఢమతి మతంగాశ్రమంబొప్పు; నమ్ముని శిష్యురాలైనట్టి శబరి మిమ్ముఁబూజించు; నమ్మెలత యున్నెడకు 392మీరు పొం;డట393మీఁద మిహిరసూనునకుఁ గూరిమిచెలిమి గల్గును;దానివలన జానకి394బొందెదు; సామ్రాజ్యపదవిఁ బూని కాంతు.”వటంచుఁబోయె నద్దివికి. దను వటు దివ్యపదంబున కరుగ మనువంశతిలకులు మఱునాఁడు కదలి[వా.రా. సర్గ 74] |