ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
శబరీ సందర్శనము
పంపాసరోవర పశ్చిమస్థలిని
సంపూర్ణతరులతాసంపదఁబొదలి
ప్రబలపుణ్యములకుఁబట్టైనయట్టి
శబరియాశ్రమవనస్థలికిఁ బోవుటయు
నెదురుగా వచ్చి యయ్యింతి సద్భక్తిఁ
బదములకును సాగఁబడి మ్రొక్కి లేచి:
“దశరథవరపుత్త్ర! తాటకాజైత్ర!
కుశికసంభవయాగకుశలప్రయోగ!
చిరమునిధ్యేయ! శిక్షితతాటకేయ!
పరమగంగాతీర పాదసంచార!
పదరజోనైర్మల్యపాలితాహల్య!
విదళితహరచండవిపులకోదండ!
భీమ భార్గవ రామ బిరుదవిరామ!
కామిత పితృవాక్యకరణసుశ్లోక!
ప్రకటాపరాధవిరాధనిరోధ!
సకలమునిత్రాణ సత్యప్రవీణ!
ఖరదూషణాదిరాక్షసశిరచ్ఛేద!
మరణార్థి మారీచ మర్దినారాచ!
సీతావియోగసూచిత మోహరాగ!
ఖ్యాతఖగాధ్యక్ష కల్పితమోక్ష!
యలఘువిక్రమధామ! యతిపుణ్యనామ!
నెలకొన్న వేడుక నినుఁజూడఁగంటిఁ;
బరికింప నా తపఃఫల మందఁగంటి;
నరుదైన పుణ్యంబులన్నియుఁగంటిఁ;
గాకుత్స్థ! తెరువునఁగడు డస్సి; తెందుఁ
బోకు; మా యాశ్రమంబున నేఁడు నిలువు;
మనఘాత్మ! నా గురుండైన మతంగ
మునిచేత నీ కథల్‌ మును వినియుందు;
నీ వాద్యుఁడవు సర్వనిగమవేద్యుఁడవు
గావున నిను నుతుల్‌ గావింపఁదరమె?
యిది యా మతంగమునీంద్రు నాశ్రమము
విదిత తపశ్చర విశ్రాంతికరము.”
నని యా మహత్త్వంబు లన్నియుఁదెలిపి
వనమూలఫలములు వలనొప్పఁదెచ్చి
యిచ్చిన భుజియించి యెలమిమై రాముఁ
డచ్చటఁ బ్రీతితో నా రాత్రి పుచ్చి
ఘనజటాబంధైకకబరి నా శబరిఁ
గనుఁగొని మఱునాఁడు కాకుత్థ్సుఁడనియెఁ;
“దరమిడి నన్ను సీతావియోగాగ్ని
దరికొన నెంతయుఁదలఁకుచున్నాఁడ;
నొకచోట నిలువలే కుడుకుచున్నాఁడ;
వికచాబ్జముఖి సీత వెదకఁబోవలయుఁ;
బనివినియెద.”నన్నఁ బరమసంతోష
మునఁ బొంది శబరి రామునిఁజూచి పలికె:
“దను వనుఘనుఁడు ముందఱఁజేయఁదగిన
పనులెల్లఁదెల్పె నేర్పడ మున్నె మీకు;
నైనను మఱియు నే నదియె తెల్పెదను
మానవనాథ! నీ మది కెక్కునట్లు:
రావణుఁజంపెదు రామ! నీకూర్చు
దేవిఁగూడెదవు; సందేహంబు వలవ
దైన నేకాకులై యట పోవఁదగదు
భానుకులాధీశ! పగఱపై నెపుడు,
నినకులాధిప! విను మిట ఋశ్యమూక
మను పర్వతమునకు నరుగుము ప్రీతి;
సునిశితమతి సూర్యసుతుఁడు సుగ్రీవుఁ
డను వానరాధీశుఁ డా కొండ నుండుఁ;
దన వధూరత్నంబుఁదన రాజ్యపదముఁ
దన యన్న వాలిచేఁ దాఁ గోలుపోయి
యతఁడు శోకాతురుఁడై యున్నవాఁడు
అతనికిఁ గపిసేన లప్రమాణమ్ము.
లతనికి విశ్వాస మాత్మఁబుట్టించి
యతనికి నుపకార395 మలవుమైఁజేసి
యతఁడు నీవును గూడి యటు లంక కరిగి
యతిసత్త్వు రావణు ననిలోనఁజంపి
బలవిక్రమంబులు ప్రస్తుతి కెక్కఁ
జెలువొంద నీ దేవి సీతఁగైకొనుము.”
అని 396ప్రీతి శబరి కార్యములెల్లఁ397దెలిపి
తన గురువాక్యముల్‌ దలఁచి యా క్షణమె
యనలంబు దరికొల్పి యా యగ్నిలోనఁ
దన శరీరము వేల్వఁ దా సమకట్టి
యా సమయంబున నంతరిక్షమున
వాసవప్రముఖగీర్వాణులందఱును
మణిఘృణి దేదీప్యమాన విమాన
గణసమారూఢులై కనుఁగొనుచుండ
నారద సనకసనందన ప్రముఖ
398సారమునీంద్రులు సంతోషమందఁ
బరముఁబరంధాముఁ బరమకల్యాణుఁ
బరిపూర్ణుఁబరమాత్ముఁబరమేష్ఠి వినుతు
నవ్యయు నవికారు నఖిలాంతరాత్ము
నవ్యక్తు నఖిలేశు నాద్యంతరహితు
భవముఖామరవేద్యు భవరోగవైద్యు
రవికులాంబుధిచంద్రు రఘురామచంద్రు
దనమది నిలిపి యత్తఱి వలగొనుచు
వినుతించి శబరి యా విభునిసన్నిధిని
ననలునియందు రామార్పణంబుగను
దన శరీరము వేల్చి దైవతానీత
మానిత దివ్యవిమానంబు నెక్కి
నానావిధముల వర్ణనసేయ సురలు
దేవలోకమున కెంతే వేడ్కఁ జనియె
దేవదుందుభులు ధింధిమ్మని మ్రోయ.
ననలముఖంబున నా రీతి శబరి
యనిమిషసౌఖ్యంబు లందిన యంత,

  1. ↑యొప్ప
  2. ↑జెప్పి
  3. ↑సౌర
  4. ↑లటపోయిపోయి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )