ఇతిహాసములు రంగనాథరామాయణము కిష్కింధాకాండము
రాఘవులు మాల్యవంతము చేరుట
యనవుడు సుగ్రీవునాననాంబుజముఁ
గనుఁగొని ప్రీతి రాఘవుఁడిట్టులనియెఁ:
“దపసులు పురమునఁదగదు వర్తింపఁ;
దపనజ! కిష్కింధ దగదు మా111కుండ;
మహిమీఁద నాషాఢమాసంబు వచ్చె;
నహితులపైఁబోవ 112ననువుఁగాదింక;
వానకాలము మాల్యవంతంబునందు
నే నుండఁగలవాఁడ నెబ్భంగినైన;
నినతనూభవ! నీవు నీ వానకాల
మొనరఁగిష్కింధలో నుండుము పోయి.
తలకొని మఱి శరత్కాలంబునందుఁ
బొలుపొందఁబగఱపైఁబోదము కడఁగి.’
యని చెప్పి మన్నించి యతని వీడ్కొలిపి
యనుజన్ముఁడును దాను నచ్చోటు వాసి
వసుధేశుఁడమ్మాల్యవంతంబుఁ113జేరి
కుసుమకోమలి సీతగుణముఁబ్రాయంబు[వా.రా. సర్గ 27-31]
లసమానరూపవిలాస మెన్నుచును
నసమానశోకార్తుఁడై యుండె. నంత-

  1. ↑కింక
  2. ↑నలవు
  3. ↑నందు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )