| ఇతిహాసములు | రంగనాథరామాయణము | కిష్కింధాకాండము |
|
ధరణిజ నెడఁబాసి తలఁకెడురాముఁ బొరిఁబొరి దుఃఖముల్ పొదువుచందమున నఱిముఱి దివినుండి యంబుజమిత్రు మెఱయనీ కందంద మేఘముల్ 114వొదివె. రావణురాజ్యంబు రఘురాముచేత నీ విధిఁజలియించు నింక నన్ మాడ్కి నొలసి115యొండొండ విద్యున్నికాయములు జలదంబులందుండి చలియింపఁదొడఁగె. “గైకొని యింక నిక్ష్వాకువల్లభుఁడు నాకారిపై దండు నడచుచున్నాఁడు.” అని సురలకుఁజెప్ప నరిగెనో ధాత్రి యన వాయువులతోడ నట ధూళి యెగసె. “నాలంబులో దైత్యునడఁగింపు.”మనుచుఁ గాలుండు దనచేతికాల116పాశంబుఁ బొనర రామునికయి పుత్తెంచె ననఁగఁ దనరార దివి నింద్రధను వొప్పెఁజూడ. నమరులు రామునకయి దండు117నడవఁ గొమరార భేరులు ఘోషించుకరణి నున్నతధ్వనులతో నొండొంటఁబర్వి మిన్నెల్ల భేదిల్ల మేఘంబు లుఱిమె. నలరి ప్రావృట్కాల మనుపురుషుండు లలిమీఱ నాకాశలక్ష్మితోఁ118గదియ నొగి సరుల్‌దెగి రాలుచున్నముత్తెముల పగిదిఁదొల్ చినుకులు పడియె నందంద. యగపడి చెఱవోయె నని కూఁతుఁదలఁచి వగచి నిట్టూర్పులు వడిఁబుచ్చుచున్న వెరవున నావులు వెడలె నందంద ధరణి నెల్లెడల నుదగ్రంబు లగుచుఁ. జనుదెంచి రామలక్ష్మణపయోదములఁ గనుఁగొని సురచాతకము లుబ్బుకరణిఁ గనుకనిఁబర్వెడు ఘనపయోదములఁ గనుఁగొని దివిఁజాతకము లుబ్బఁదొడఁగె. ధిమిధిమియనుచు మద్దెల మ్రోయఁబాట లమర నటీమణులాడుచందమున ఘుమఘుమయనుచు మేఘుండు గర్జిల్ల నమలకేకాస్ఫూర్తి నాడె నెమళ్లు. రాక్షసాంగములపై రాముబాణములు లక్షింపఁబడు నిట్టిలాగ యన్నట్లు పర్వతాగ్రములపై భయదఘోషములు పర్వ నిర్ఘాతముల్ పడియె నందంద. ప్రకటంబుగా దైత్యపతిమేని మాంస శకలంబు లిటు రణస్థలి నిండు ననిన పరుసన నింద్రగోపము లంతకంత నరుణారుణంబులై యవనిపైఁబడియె. రావణుఁజంపుచో రఘురాముమీఁద దేవతల్ 119దీపించి దివ్యపుష్పమ్ము లెడనెడ వర్షింతు రీ క్రియ ననిన వడుపున మహిరాలె వర్షోపలములు. రావణుకీర్తిపరంపర లడఁగి పోవు నింకిట రామభూపాలుచేత ననినచందమున రాయంచల పిండు చని క్రౌంచగిరి 120మీఁదఁజయ్యన నడచె ననిమొనఁదన పుత్త్రుఁడైన సుగ్రీవుఁ డనిమిషాధిపసూను 121నకట చంపించె; నలుగు నాపై నింద్రుఁడని సూర్యుఁ122డిడిన బలితంపుఁగోటనఁబరివేష మొప్పెఁ. గుదియనికడఁకతోఁగోరి యాకాశ నది నాడఁబోయిన నాగ123కన్యకలు 124చనిచని మగుడ 125రసాతలంబునకుఁ జనుదెంచుగతి వర్షజలధార లొప్పె. వాసిగాఁదమకు జీవనము లవ్వారి గా సమర్పించినఘనుని వేనోళ్లఁ బొగడుచందమున నద్భుతవృత్తిభేద మగపడ భేకంబు లఱచె నందంద. వెలయమేఘములు ప్రావృడ్వధూమణికిఁ గలయ మైఁబూసిన కస్తూరి యనఁగ ధరణి నెల్లెడలను 126దనర సొంపెక్కి పరగ నీలచ్ఛాయఁబంక మొప్పారె. వారాశి నొడఁగూడి వలనేది రాము ఘోరబాణాగ్నిఁగ్రాఁగుట విచారించి 127చఱచి పోవెఱచినచాడ్పున వరద లఱిముఱిఁజెఱువుల నందంద నిలిచె. లోకకంటకుదైత్యులో128ఁబెట్టుకొంటిఁ; గాకుత్స్థుఁడిదె నన్నుఁగట్టించు ననుచు సుడివడి మొఱవెట్టుచును బాఱుకరణి వడి మ్రోయుచును జొచ్చె వార్ధిఁబెన్నదులు. అంత వానలు129నిల్చె నవని 130నెల్లెడల; నంతంత దివినున్న యభ్రముల్ విరిసెఁ దెలివొంది కిరణముల్ దిశలెల్లనిండఁ జెలువొంది రవి ప్రకాశించె లోకముల; ధరణి నిష్పంకమై తనరె నెంతయును; గరమొప్పఁగొలఁకులఁగమలంబు లలరెఁ గూలముల్ మదకరుల్ గ్రొచ్చి గోరాడె; రేలు నక్షత్రచంద్రికలఁబెంపారె; వచ్చె నంచలు సరోవనికిఁ గాపురము; మెచ్చెఁదామరతూండ్లు మెసఁగి యుల్లమునఁ జెఱకు రాజనములచేనుల పంట తఱచయ్యె; వృషభయూధము ఱంకెవైచెఁ గలఁక యంతయుఁబాసి కనుపట్టెఁజలము; నిల దెరువరులకు నిచ్చె సౌఖ్యంబుఁ; జదలనిర్మలములై జలదంబు లొప్పె; నదులెల్ల 131డొంకి కాల్నడ లయ్యె. నంత నటమున్న హనుమంతుఁడర్కజుఁగదిసి “యిట శారదాగమంబేతెంచె; నింక శ్రీరాముకార్యంబు సేయంగ వలయు వారు వీ రన కెల్ల వానరాధిపుల రప్పింపు.”మనవుడు రవిసూనుఁడలరి యప్పుడు పడవాలుఁడగునీలుఁబిలిచి: “వివిధపర్వతనదీద్వీపాధిపతులఁ బ్లవగగోలాంగూలభల్లూకపతుల రావింపు మొకఁడైన రాకున్న నాజ్ఞ గావింపు.”మని పంచెఁగడఁకమై.నిచటఁ దమ్ముఁడు చేయూఁత తనతాల్మికొసగఁ గ్రమ్మిన వగ వానకాలంబు గడపి రామభూవరుఁడు శరత్కాలమైనఁ గోమలిఁజింతించి కోర్కులఁబొదలి మదనాతురుండయి మదిఁజాల బ్రమసి యుదయాద్రిపయి నున్నయుడు రాజుఁ జూచి: “యిదియేమియుత్పాత? మిదియేమిచంద? మిదియేమి యీరాత్రి యినుఁడేలపొడిచె నా మేని తాపమిన్మడి గాఁగఁజొచ్చె; సౌమిత్రి! ననుఁదరుచ్ఛాయను జేర్పు.” మనినఁ:“జంద్రుఁడుగాని యర్కుండు గాఁడు; జననాథ!హరిణలాంఛనమదెచూడు.” మని లక్ష్మణుఁడు వల్క:“హరిణాక్షిపోయె.” నని సీతఁబేర్కొని యట మూర్ఛవోవ దశరథాత్మజునకుఁదమ్ముఁ డాలోన శిశిరోపచారముల్ సేసి తేర్చుటయు మఱి వివేకముఁబూని మనుజవల్లభుఁడు: “తఱి లంకపై నింక దండెత్తవలయు. సౌమిత్రి! చూచితే జలజాప్తసూనుఁ డేమని భాషించె? నేమని పోయె? వానకాలముఁబుచ్చి వచ్చెద ననియె. వానకాలము వోయె; వచ్చుట లేద. యొదవి నా సేసినయుపకారమెల్ల మదిలోన మఱచి యున్మత్తుఁడై వాఁడు తారతో రతికేళిఁదగిలియున్నాఁడొ? యా రాజ్యమున మత్తుఁడైయున్నవాఁడొ కాకున్న మత్కార్యగతులు భావింపఁ; డీ కృతఘ్నత కోర్చి యేటికిఁదడయ? మతి నుపకారంబు మఱచినవాఁడు, ప్రతినదప్పినవాఁడు, పాడిమైఁదనదు చెలికానికార్యంబు సేయనివాఁడు తలపోయ మానవాధముఁడండ్రు బుధులు అలవుమై నటువోయి యర్కజుఁబిలువు; పిలిచిన నిటురాక132 బిగు వాడెనేని? “నని వాలిఁజంపినయ మ్మెందువోయె? నని రమ్ముపొ.”మ్మన్న నన్నకు మ్రొక్కి |