“దేవ! నీకేటికి ధృతిదూలి వగవ?
నా వానరాధము నవలీలఁదాఁకి
వారక యట చంపివత్తు నొండేని
ధీరత నిట పట్టితెత్తు నొండేని.”
నా విని తన యగ్రనందనుఁజూచి
రావణుఁడనియె ధైర్యస్ఫూర్తి నిగుడఁ:
“జిరకాల మమరేంద్రుఁజెఱఁబెట్టినావు;
పరమమాయాబల ప్రౌఢుఁడ వీవు;
శస్త్రాస్త్రవిద్యావిశాలుండ వధిక నిస్త్రాసుఁడవు నీతినిపుణుండవరి వి
నాశనకృతివి భూనాక భయుఁడవు భాసురబలుఁడవు పద్మజదత్త
వరశరధన్యుండ వతికోవిదుఁడవు పొరిఁబొరి గాఢతపో రక్షకుఁడవు
గురుఘనభుజవీర్యగుప్తుండ వఖిల ..........
వినుతప్రతాప సంవృతవిక్రముఁడవు ననవరతంబును నఖిలలోకముల
నని నోర్చి విజయంబు లందినవాఁడ వనఘుండ వీ విల ననిమిషసేన
పోఁడిమి జెడఁదోలి పురుహూతుఁబట్టు నాఁడెఱుంగుదును నున్నతబాహుబలము
భూరిశస్త్రాస్త్ర తపోబలంబులను వారక ననుఁబోలువాఁడ వీ వాజి
నాకంటె విక్రమోన్నతి మించినావు;
నీ కెదురెవ్వరు నిఖిలలోకముల!
మనసు గుందఁగ జంబుమాలియు మొదలు దనుజులు పోరి యా తరుచరుచేతఁ
బొలిసిరి యని వానిఁ బొలియింపఁజాలు బలియు నెవ్వనిఁగాన బలియుండవీవు
కావున దానవాగ్రణులతో నేఁగు వావిరితోడఁ దీవ్రత జన్యమునకు
నసమున నటులయ్యు నా వానరేంద్రు
నసదుగాఁదలఁపక యాత్మనేమఱక
తనయుఁడ! విను, రాజధర్మక్రమంబు పనుపడ శస్త్రాస్త్రబలము దక్కంగఁ
దక్కినబలములు ధర నిష్ఫలంబు లక్కజంబుగ వాయు వాశుగమనము
ననలుఁడు కడుతీవ్రమైనట్టి శిఖల వెనుకొని జగముల విజయంబు నొందు
పగిది నా వానరప్రముఖునిఁగదిసి యగణితభుజబలం బభినుతి కెక్క
బహుదివ్యబాణప్రభావముల్ సూపి
సహజశౌర్యంబున జయము గైకొనుము.”
..........యా మేఘనాదుఁ డెనసినబంధులనెల్ల వీడ్కొనుచు
ననుపమాశనికల్పమై ఘోరదంష్ట్ర ఘనసుకళాస్యముల్ గామచారంబు
గరుడవేగంబును గల్గునాభీల తురగచతుష్కంబుతోడఁబెంపొదవి
పనుగొనుశస్త్రాస్త్ర భరితంబు నగుచు ననలార్క సంకాశ మగు..........
అనఁదండ్రి వీడ్కొని యా మేఘనాదుఁ
డనలార్కసంకాశమగు రథంబెక్కి
యగణిత నిజధనుర్జ్యాఘోషమునకుఁ
బొగిలి దిగ్గజకర్ణపుటములు వగుల
జగములు బెదర దిక్చక్రబంధములు
పగుల నార్చుచు వచ్చి పవనజుఁదాఁకె.
నా సమయంబున నమరులు మునులు
వాసవప్రముఖదిగ్వరులుఁగిన్నరులు
నుప్పరంబుననుండి యొదిఁగి వీక్షింప
నప్పంక్తికంఠుని యగ్రనందనుఁడు
నడరి యాతని దేహమణుమాత్రమైనఁ
బొడ వడకుండ నద్భుతశితాస్త్రములు
గురియ నయ్యస్త్రముల్ క్రూరవాలమునఁ
దరమిడి చిదిపియుఁ దప్పించుకొనియు
నురుభుజనిజవిక్రమోన్నతి మెఱసెఁ
బరువడి నప్పు డప్పవమానసుతుఁడు.
జగతీతలము దిశల్ సరివ్రయ్య నార్చి యగణితవేగుఁడై యట మింటి కెగయఁ
గనుఁగొని దానవాగ్రణి యల్క మదిని దనరఁగ నప్పుడు ధనువు మ్రోయించి
యాతతరత్నపుంఖాంచితప్రభల ఖ్యాతి మించిన నేమిఘట్టనోద్ధూత
ధరణీపరాగాంధతమసంబు నణఁపఁ బొరినొప్పు గరుసముద్భూతవాతూల
ఘాతంబుచే బలాకలు దూల నశని పాతవేగంబులౌ పటుకాండసమితి
నెఱ తెగగొని వడి నిగుడించుటయును నఱిముఱిఁగోపించి హనుమంతుఁడపుడు
శరముల కెదురుగాఁజనుచు మహోగ్ర శరమండలస్థమౌ శరలక్ష్యమనఁగ
గురుతరంబైన జవోన్నతిఁదిరిగి శరముల నడఁచి ఖేచరుఁడునై మలసి
శరవేగలక్ష్యగోచరుఁడు గాకిట్లు దుర మొనరించె నద్భుతపౌరుషమున
రావణి నిర్జితైరావణి యంతఁ
బావని యసమానబలవేగమునకు
నరుదంది మఱియు దివ్యాస్త్రంబు లేయఁ
బరువడి ఖండించి పవనజుఁడతనిఁ
దరుశైలముల వైవ దర్పించి యసుర
శరముల వాని జర్జరితముల్ సేసెఁ.
జేసినఁగని యింద్రజిత్తుపైఁగవిసి
యా సమీరాత్మజుఁడవలీలఁ దన్ని.
మునుమిడి రథరథ్యములు నుగ్గుసేయ
ననిమొన విరథుఁడై యా యింద్రజిత్తు
అనుపమంబగు రథంబాజిఁగూలుటకు ఘనబాణతతులు మోఘంబు లౌటకును
దన వ్రేటు పోటును దాఁక కుండుటకు దన మది కొండొకతడవు చింతించి
యితఁడవధ్యుఁడజేయుఁడే నింక నుఱక యతివేగ మగుడిన ననుచితంబనుచు
హనుమంతుకడిమికి నచ్చెరువంది
వినుతోగ్ర గతి వాయవీ యాస్త్రమేయ
వాయుపుత్త్రుఁడు గాన వానరాధీశుఁ
డా యస్త్రమునఁదూల కచలుఁడై యున్న
నరుదంది రౌద్రాస్త్ర మతనిపై నేయఁ
బెరిగి యాతఁడు రుద్రబీజంబుగాన
కదలక నిలిచినఁ గని యింద్రజిత్తు
మదిలోనఁగోపించి మారుతిమీఁద
సురసిద్ధసాధ్యులు సూచి కంపింపఁ
బరమదుర్జయమైన బ్రహ్మాస్త్ర మేయ
నా యస్త్రరాజంబు నవనియు మిన్ను
రాయుచుఁదనమీఁద రా వాయుసుతుఁడు
బ్రహ్మాస్త్రమునఁబ్రాణభయము లేకుండ
బ్రహ్మచే వరములు పడయుటఁజేసి
బలువిడిఁబఱతెంచు బ్రహ్మాస్త్రమునకుఁ
దలఁకక బ్రహ్మమంత్రము లుచ్చరింప
నది చంపఁజాలక యతని బంధించి
కుదియించి పడవైచెఁ గుంభినిమీఁదఁ.
బడినమారుతిఁజూచి“పట్టుఁడు కట్టుఁ
డడువుఁడు పొడువుఁ”డం చఖిలరాక్షసులు
చుట్టుముట్టి కఠోరసూత్రజాలముల
గట్టిగాఁ గట్టిరి కట్టల్కనిగుడ.
..........ఁడవశుఁడై తెలిసి చింతించి యిది యేమి చిత్రమో?తనకు
నీ యస్త్రమున భయం బెఱుఁగక యుండఁ దోయజాసనుఁడిచ్చెఁ దొలుత వరంబు
ననుచు నా బాల్యమం దాంగిరసాఖ్య మునికి భార్గవుఁడను ముని శిఖామణికి
వరగర్వి నగుచు నవజ్ఞ గావింప నఱిముఱిఁగోపించి యమ్మునీశ్వరులు
దనకు బ్రహ్మాస్త్రబంధము ప్రాప్తమగుచు ననువుగా ఘటికాత్రయార్థము బాయ
శాపించి రదియు నిశ్చలబుద్ధి నెఱిఁగి పాపదూరులు వారి పలుకొండు నగునె?
ఘటికాత్రయార్థంబు గడచిన పిదప చటులబంధము లూడు సరి నదిగాక
బ్రహ్మేంద్రమారుతుల్ పాలించునాకు బ్రహ్మాస్త్రబంధముల్ పాయుటెంతనుచు
నజుని యానతి గొంత యనుసరించుచును రజనీచరేంద్రుడౌ రావణుకడకుఁ
జని కొన్నిమాటలు సరసత నాడి తనరారు నతని చిత్తస్థితి గొంత
యారసి చూచెద నాతని కడకు నీ రీతిఁజనకున్న నిఁక దుర్ఘటంబు
గావున నిపుడె రాక్షసుని పాలికిని బోవలెఁగాకంచుఁ బొలుపొందుచుండె
పడినమారుతిఁజూచి పట్టుఁడు కట్టుఁ డడువుఁడు పొడువుఁడంచఖిలరాక్షసులుఁ
జుట్టు ముట్టి కఠోరసూత్రజాలముల గట్టిగాఁగట్టిరి కట్టల్క నిగుడఁ
బావని రావణుఁబరికింపఁగోరి వావిరి నొప్పెడువాఁడు గావునను
దనదుబంధము విముక్త మగుట యెఱిఁగి కనుకని దైత్యులకట్టుల తర్జ
నములను బోటుల నాటుల భర్జ నముల నందంద వెంబడి విచేష్టుండ
పోలినట్లుండె నార్పులు నింగిముట్ట వాలు చేఁగొనుచు నవారితశక్తి
నంతకాకారుఁడై యతికోపుఁడగుచు నెంతయు రయమున..........
నంతలో హనుమంతుఁడవశుఁడై యున్న
నెంతయు రయమున నింద్రారి చేరి:
.......... బలియుఁడై తాఁకట్టఁబడియున్నయపుడె(డు)
యితరబాణములవి యెంత దలంప నితనికి నతిబలాన్వితవిక్రమునకు
“నలువబాణంబుచే నాశంబుకాక
బలియుఁడై యిటు కట్టఁబడి యున్నవాఁడు.
ఎనయ నీ వానరుండెవ్వఁడో? వీని
ననిమొనఁజంపరా.”దని నిశ్చయించి
యమిత సత్త్వోన్నతుఁడై పట్టితెచ్చి
తమతండ్రి ముందఱఁదడయక పెట్టఁ[వా.రా. సర్గ 48]
దనమంత్రివరులును దాను వేర్వేఱఁ
దనయు లావునకుఁ దద్దయు సంతసించి
ఎక్కడివాఁడొ? వీఁడెవ్వఁడో? పనుప స్రుక్కక యీ పురి సొచ్చి రాక్షసుల
నిలఁగూల్చె వీని వధింతము కాల్త మెలమి మ్రింగుద మంచు నిందును నందుఁ
గట్టి యీడ్చుచును బ్రక్కలు పొడుచుచును బెట్టుగా నిరసించి బెరయునయ్యెడను
రక్షోగణేశుండు రౌద్రంబు నిగుడ వృక్షచారుని నతివిస్ఫురితాక్షుఁ
డగుచుఁజూచిన విస్మయభ్రాంతుఁడగుచు నగణితంబగుచు దివ్యంబులైనట్టి
తతభర్మభూషణోదంచితకాంతి నుతగతి సౌదామినులయొప్పు మిగుల
రమణీయతనులిప్తరక్తచందనము విమలమౌ నెఱసంజవిధమునై మెఱయ
మకుటనానారత్నమణిగణదీప్తి ప్రకటపర్జన్యచాపప్రభల్ నిగుడ
భూరివక్షంబునఁ బొలుపొందు తార హారజాలము బలాకాళి చెల్వొలయ
భయదహుంకృతి గర్జపగిదినై చెలఁగ మెయి మేచకాభ్రంబు మెలుపునఁదనర
దృష్టి కక్కజమారుతేజంబెసంగ సృష్టి భయంబందఁ జేయుచునున్న
వాఁడిట్లు మగఁటిమివాలియు మహిమ పోఁడిమి నొంది విస్ఫూర్జితపంక్తి
మస్తకోదరబాహుమహితకఠోర విస్తరోరస్థ్సలీవికటభ్రూకుటుల
చటులరక్తాస్యప్రజ్వలితవిఘూర్ణ పటువిస్ఫులింగ విస్ఫార నేత్రోగ్ర
లంబోష్ఠదంష్ట్రా కరాళరక్తాగ్ని చుంబితదిశుఁడు చక్షుర్భీతికరుఁడు
హాటక శైలశృంగాంచిత దివ్య జూటరత్నవిచిత్రశోభితాననుఁడు
సకలలోకైక భీషణుఁడు సంగ్రామ వికటభాషణుఁడు విద్వేషిదూషణుఁడు
చారుదుకూలవస్త్రసమన్వితుండు నై రూఢికెక్కి యుదాత్తవైఖరులఁ
గరములఁగంకణక్వణనముల్ మొరయ సరస నప్సరతతుల్ చామర లిడఁగ
నా సుధర్మాస్థానమందుఁజింతామ ణీసింహపీఠి నుండెడు నింద్రుఁడనఁగ
మానితంబగు సభామంటపవేదిఁ బూని సింహాసనంబున నున్నవాని
నలరి పార్శ్వములఁబ్రహస్తాదిమంత్రు లలవుమై సేవింప నటనిటఁజేరి
గరుడోర గామరగంధర్వభర్త లురుమతిఁగొల్వఁబెంపొందురావణునిఁ
గనుఁగొని యంతరంగంబునఁజాల వినుతించి మఱియును వెసనిట్టులనియె
నీ రూపవిభవంబు లీ ఘనబాహు సార మీ ధృతి యిట్టి సౌందర్యమమిత
ధీరగుణంబు నుద్దీపితోదార మీ రాక్షసేశ్వరు కిట్లొప్పె నౌర!
పాతకమూర్తి దుర్బలుఁడును దైత్య జాతుఁడు గాకున్న శక్రాదిదేవ
వ్రాతంబులకు నధీశ్వరుఁడునై తనరి యీతఁడు లోకంబు లేలంగఁదగఁడె?
యనునంత రోషతామ్రాక్షుఁడై కనలి
కనుఁగవలం దగ్నికణములు దొరుఁగ
ననయత నపుడు ప్రహస్తుతోఁగూడి హనుమంతుఁజూచి..........
దనయులావునకుఁదద్దయు సంతసిల్లె హనుమంతుఁడప్పు డయ్యసురేశుఁజూచి
వీనికి సరి గద్దె వేతు నన్మాడ్కిఁ బూని వాలము వెంచి పొసగఁ గూర్చుండి
పటుతరనవరత్న భద్రపీఠమున.... ..........
శిరములు పదియును జేతు లిర్వదియు వరభూషణంబులు వైభవస్ఫురణ
దశకిరీటద్యుతుల్ దశదిశల్ వెలుఁగ దశకంధరునిపేరు దనరు నతనికి
నిదిగాక కొడుకులు హితులు సోదరులు మదమేది బలములు మంత్రులు గొలువఁ
గరకంకణంబులు గల్లుగల్లనఁగ వరుస వింజామరల్ వనితలు వేయఁ
ద్రిదశులతోఁగూడ దేవేంద్రుపగిదిఁ ద్రిదశారి సభయందు దీపించె నవుర!
మెఱుఁగుతోఁగూడిన మేఘంబుకరణి నరుదంది రావణు నమర వీక్షించి
కడఁగి రామద్రోహి కాకుండెనేని ఒడయండుగాఁడె?యీ యుర్వియంతటికి
నని రాఘవునిచేత నసురేశుఁడల్గు ననుచు విస్మయమంది యగచరుఁడున్న
గనుఁగవఁగోపాగ్నికణ.......... ..........
‘కనుఁగవఁగోపాగ్ని కణములు దొరుగ
హనుమంతుఁజూచియిట్లనియె రావణుఁడు:
“ఓరి, వానరుఁడ! నా యున్నపట్టణము
శూరత నొంటిమైఁ జొచ్చుటయెట్లు?
నీ వెవ్వఁడవు? మఱి నీకుఁబేరేమి?
యే వెరవున వచ్చి తీ వార్ధి దాటి?
హరుఁడు వంచినవాఁడొ? హరి వంచినాఁడొ?
సురగణాధీశుండొ? శుక్రుఁడో?దండ ధరుఁడొ? గృతాంతుఁడొ? దానవేశ్వరుఁడొ?
వరుణుఁడో? వాయువో? వైశ్రవణుండొ? యిరవార నిటకు నిన్నెవఁడు పుత్తెంచె?
వాని నెఱింగింపు వలను మీఱఁగను బూనినభయమున బొంకక నీవు
పరమేష్ఠి నిన్నిట పంచినవాఁడొ?
సుర గరుడోర గాసుర సిద్ధసాధ్య
నర వియచ్చరవరుల్ నా పేరు విన్న
వెఱతురు; నీ విట్లు వెఱవక వచ్చి
తెఱగంటిదొరకైన దృష్టింపరాక
వఱలెడు నా పురి వంచనఁజొచ్చి
పెఱికితి వనమెల్ల బీరంబు మెఱసి.
బడుగురక్కసుల దుర్బలులఁగొందఱను
మడియించితివి మేటిమగవాఁడపోలె.
దీపించు నీ దగు తేజంబు సూడఁ
గాపేయమాత్రుఁడు గావుచింతింప.
నిప్పు డీ నేరంబు లిన్నియుఁగాతుఁ
దప్పక నీ రాక తగఁజెప్పితేని.”
అనవుడు హనుమంతుఁడతికోపుఁడగుచు దనుజనాయకునితో దర్పంబునెసగ
వాలంపుగద్దెపై వలనొప్ప నుండి యా లోనఁబ్రతిమాట లాడఁగఁగడఁగి
యనిలనందనుఁడంత నద్దశకంఠుఁ గనుఁగొని..........
|