యనిన నా హనుమంతుఁడద్దశకంఠుఁ
గనుఁగొని యెంతయుఁగనలియిట్లనియె.[వా.రా. సర్గ 49, 50]
“నోరి రాక్షస! వినరోరి నీచాత్మ!
దూరీకృతాచార! దుష్టమానసుఁడ!
విశదకీర్తులు మున్ను విశ్వంబునిండ
దశరథేశ్వరునకుఁ దనయుఁడై పుట్టి
.......... పరగ నహల్యశాపము నివారించి
చరణాగ్రమున నీ భుజాగర్వ మణఁచి పొరి నొప్పు విమలవిస్ఫురితకేయూర
తరుణజైవాతృకధరుఁడైన యట్టి ..........
యరిగి విశ్వామిత్రుయాగంబు గాచి
హరువిల్లు విఱిచి మహాశక్తి మెఱసి
అని నిన్నుఁజెఱఁగొని యమితశౌర్యమున దనరారు నర్జునుఁదాఁకి జన్యమునఁ
.......... గరసహస్రంబులు ఖండించినట్టి
పరశురామునిఁబట్టి భంగించి విడిచి
ఖరదూషణాదిరాక్షసుల ఖండించి
నీ పెంపుఁగుదియించి నినుఁదోఁకఁగట్టి
యేపున జలధుల నీడ్చినవాలిఁ
బొలుపార నొక బాణమునఁగూలనేసి
బలియుఁడై సుగ్రీవుఁబట్టంబుగట్టి
యక్షీణశక్తిమై నతులకోదండ
దీక్షాగురుండనఁదేజంబు మెఱసి
తగిలి రాక్షసకులాంతకుఁడైన రామ
జగదీశ్వరునిదూతఁ; జతురమానసుఁడ;
హనుమంతుఁడనువాఁడ; నర్కజుమంత్రి;
నినవంశనిధి రాముఁడిట నన్నుఁబనుప
ముదమొప్పఁబతివ్రేలిముద్రికఁగొనుచు
నొదవిన కడిమిమై నుదధి లంఘించి
వచ్చి నీ పురిఁజొచ్చి వైదేహి వెదకి
యెచ్చటఁబొడగాన కెంతయు వగచి
యవనిజ వనములో నారసి కాంచి
యవనీశుఁడిచ్చిన యానవా లిచ్చి
దేవి నీ పురి నున్న తెఱఁగొల్ల రామ
భూవరునకుఁజెప్పఁబోవుచునుండి
యెనసి నా రాక నీ కెఱిఁగింపఁగోరి
పెనచి నీ వనమెల్లఁబెఱికి పోవైచి
వనపాలురగు దైత్యవరులఁగింకరుల
నెనుబదివేపుర నేపుమైఁ గడఁగి
మడియించి మునుమిడి మంత్రినందనుల
మడియించి యక్షుని మడియించి పిదపఁ
దగిలి నీ యున్న చందములెల్లఁజూచి
మగుడిపోయెద నని మఱి పట్టువడితి.
వనజాతజాతుచే వరములు గొనిన నను నాజి దేవదానవులకునైన
వెఱవొప్పఁ దమ బాహువిక్రమస్ఫురణఁ గరముగ్రశరములఁగట్టఁగా రాదు
అనిశంబు బ్రహ్మరుద్రాదులకైన మనమునఁజింతింప మఱియొండుగతిని
రావణ! నీదు దర్శన మశక్యంబు గావున నిటులు నీ కడకు వచ్చితిని
నా రామునిజ.......... ..........
నా రాము నిజభృత్యుఁడైన సుగ్రీవు
భూరిసైన్యములలోఁబొలుపు దీపింప
నలవున నాకంటె నతిబలాధికులు
కొలఁదిఁబెట్టఁగరాని కోటులున్నార.
లదిమి బ్రహ్మాదుల నైన సాధించు
మదయుతుల్ నీవన్న మండుచుండుదురు.
గొనకొని యా వీరకోటులతోడ
వననిధి బంధించి వచ్చి రాఘవుఁడు
లంకపై విడిసి చలంబు పెంపెక్కఁ
గింకమై నసురుల గీటణఁగించి
నీ తలల్ నుగ్గాడి నిను సంహరించి
సీతఁదోడ్కొనిపోవు; సిద్ధ మీ పల్కు.
ఇరవొంద రామున కెగ్గొనరించి హరిహరబ్రహ్మాదులైన నా యనఘు
నిర్ఘాతసంఘాతనిష్ఠురపాత ఘర్ఘర రణితభీకర తీవ్రశాత
మాణిక్యకాంచనమహితోరుపుంఖ బాణహతుల్ గాక బ్రతుకంగఁగలరె?
ఉరువడి రాఘవు లుజ్వలామోఘ శరములర్చులు బర్వఁజనుదెంచి నీదు
కరము లంసంబు లంగములుఁగంఠంబు నురము నాస్యము లంఘ్రు లూరులు బరులు
శిరములు మర్మముల్ చించుచుఁద్రుంచు చురక నొప్పించుచు నుచ్చి పాఱుచు
మురియించి నిగుడఁగా మూఁడుజగమ్ము లురుశక్తిమై నాప నోపునె? తవిలి
సౌమిత్రి యత్యంత చండకోపమున భీమాశుగశ్రేణి బిట్టుగాఁగురియ
ఖరరుక్మపుంఖసంఘాతమహోగ్ర సురుచిరరత్న నిష్ఠ్యూతస్ఫులింగ
చటులచ్ఛటోజ్వలజ్జ్వాలలు దిశలఁ బటుగతి నేర్చుచుఁబఱతేర నెదిరి
బలిమి సప్రాణులై బ్రహ్మాదిసురలు నిలువలే రనినచో నీ వననెంత?
తురగ సామజరథస్తోమాదిభీమ తర దానవులచేతఁ దనరారు నీదు
పురిఁగాల్చి నీ భటపుత్రానుజులను నెరసినకడఁకతో నెత్తురుల్ గ్రక్కి
ధరణిపైఁబడ గ్రుద్ది తక్కక నీదు శిరములు కరములు చెలరేగి త్రుంచి
సురసిద్ధసాధ్యులు చూచి నుతింప వరజయశ్రీలొంది వర్ధిల్లుటకును
నేనె చాలుదు దానవేశ! పెంపెక్క భానుజుఁడాదియౌ ప్లవగుల యెదుర
నిలఁగూల్తు ని న్నని యినకులేశ్వరుఁడు పలికినయట్టి యా ప్రతినకతమునఁ
జావక మనితి దశగ్రీవ! నాదు చేవచే మును నీవు సేయు సుకృతమున
నజునివరంబు నీ కమరగంధర్వ రజనీచరులచేత రణములోపలను
మడియకుండఁగఁగాని మనుజవానరుల కడిమిఁజూపకయుండఁగాఁగాదు....
ధనుఁడైనయట్టి యా దశరథాత్మజుఁడు మనుజుండు నినజుండు మర్కటేశ్వరుఁడు
గావున వారిచేఁగడిమికిఁదొఱఁగి చావఁగలాఁడవు సమరమధ్యమున
మనములోపల నాదు మాటలు నమ్మి మనువాక్యసరణిధర్మప్రకారమున
సీత నొప్పించి.......... ..........
నెలకొని నీ వింక నీతిమార్గమునఁ
దొలఁగక బుద్ధిమంతుఁడవైన వినుము:
తనరారు నీదు మస్తకపాళి యశని ఘనకంఠయుతఘోరకాలపాశంబు
నతులలంకాపురాటన కాళరాత్రి తతగళపరివృతోదగ్ర కాలాహి
కారాగృహాగత ఘనమృత్యుదేవి క్రూరంబు మదిని గైకొని పేర్చియున్న
సీత నొప్పించి.......... ..........
సీత నొప్పించి యాశ్రితలోక పారి
జాతంబు రఘురాముశరణంబు సొరుము.
వలవదు వైరంబు, వర్జింపు; రిత్త
పొలియక నీ ప్రాణములు గాచికొనుమ.”
శరణన్న నెటువంటి శత్రునినైనఁ గరుణ మీఱఁగఁగాచు ఘనపుణ్యుఁడతఁడు
సకలలోకముల కీశ్వరుఁడతఁడొకఁడె యొకపాట నృపతిగా నూహింప కాత్మ
మఱి యాతఁడెంతేని మార్కొనుటెల్ల కొఱవిచేఁ దలగోఁకికొనుట నిక్కంబు
అది యిది యన నేల యతనికి నీకు మదిఁదలంపఁగ హస్తిమశకాంతరంబు
యెల్లదిక్కులను జయించితి ననుచు నుల్లంబులోపల నుబ్బంగ వలదు
మహియెల్లఁగల్పింప మన్నింప నొంప మహి కెక్కునట్టి దైవవతంసుఁడతఁడు
ఎదిరిఁదన్నెఱుగక యేల త్రుళ్లెదవు? వదలుము బీరంబు వైరంబు నేఁడు
లలి నీవు బ్రదుకఁ దలంచితివేని వెలఁది జానకిని వేవేగ నొప్పింపు
కాదని యనిసేయఁ గడఁగితివేని యా దేవదేవు బాణాగ్ని నిన్ గాల్చుఁ
దప్పదు నా మాట తలఁపులో నిల్పు చెప్పితి గర్వంబుచేఁ జెడిపోకు
మని బుద్ధిసెప్పిన.......... ..........
యని బుద్ధి సెప్పిన హనుమంతుఁజూచి
కనలును బెంపు మొక్కలమును గదుర
ఘనఘనాఘన మేచి గర్జించినట్లు
తనియక భర్జించి దశకంఠుఁడనియె:
“వెఱవక చనుదెంచి వీఁడు నా యెదుర
నఱుక్రమ్మి దుర్భాష లాడుచున్నాఁడు.
మదగజంబులచేత మట్టించియైన వదలక యుదధిలోపల ముంచియైన
కొదుకక గుదియలఁగొట్టైన పట్టి మెదలకుండఁగఁగట్టి మెలపుతోడుతను
|