నురువడి నా లంక యొకటఁగంపింప
బరవసంబునఁబేర్చి పదిలుఁడై వెడలి[B]
.......... యరుదైన నడవలు నావరణములు
పరిఘలన్నియు నూడఁబలువిడిఁద్రుంచి యరుణాబ్జభాతి ముఖాంబుజం బలరఁ
దెఱఁగుమీఱఁగ నేఁగుదెంచు నావేళ నిరవొంద నినుఁడుదయింప మోదించి
వరుసతో నట్టళ్లు వడిఁగూలఁదన్ని
యరిగి సువేలాద్రి నవలీల నెక్కి
కలయ లంకాపురిఁగల దైత్యులెల్లఁ
బెలుకుఱి భీతిల్లఁ బెల్లార్చి యార్చి,
కడఁగి సానువులు భగ్నంబులై యబ్ధిఁ
జెడి కూల వడి గండశిలలెల్ల డుల్ల,[B]
యరిగి సువేలాద్రి నవలీల నెక్కి సరసర నుత్తరాశాముఖుండగుచు
నూని యెగయు పదయుగళవేగమున నా నాగపతిఫణావళి వ్రస్సి చెదఱ
విపులోరుజవమున విరిగితో నెగసి చపలతఁదరులు నక్షత్రముల్ చెఱుప
మెయిగాలి మున్నీరు మిన్నేఱు గలఁగ రయమున నురుమేఘరాజి వేతూలఁ
జటుల ఘనరవభీషణ సింహనాద పటలిచే బ్రహ్మాండభాండముల్ వగుల
బెదరి సింహంబులు బిలమహీస్థలులు పదపడి ఘూర్ణిల్లఁబలువిడి మ్రోయ
సానుకందరములు సంధులు వ్రీలి పూనిక మీఱ గొబ్బున వాయులీల
నటుదాటి.......... ..........
నంగద మైవెంచి యద్రిశృంగములు
క్రుంగఁగుంభినిక్రుంగఁగుప్పించి యెగసి[B]
.......... ..........గుప్పించి యెగసె
అపుడు గంధర్వ విద్యాధరస్త్రీలు విపులభయంబున విరులతోఁగూడ
నాకులంబై యంబరావళుల్ వీడ నా కల్పములు రాల నఖిలదిక్కులకుఁ
బరువడిఁదమతమ భవనముల్ విడిచి పరవఁగా శిరములు వగుల నాలుకలు
వెడలించి సర్పముల్ విషములు నుమియ ..........
జలధాతుచయములు సెలయేఱు లగుచు బలువిడి నుప్పొంగి పాఱఁగాఁబృథివి
పెలుచ నాడెడిభంగిఁబృథివి చలింప శిలలు నల్గడలును జెలువేది కూల
దశయోజనములవిస్తారంబు మఱి ద్వి దశయోజనోన్నతత్వంబును గలిగి
యలరుగిరి తరు మృగాదులతోడ నిలఁగ్రుంగె నట నా యహీనసాహసుఁడు
అటు దాటి బలువిడి నాకాశవీథి జటులత ఘనవిష్ణుచక్రంబుఁబోలె
మెఱయు ఱెక్కలతోడి మేరువుఁబోలె నఱిముఱి సురియుచు నమరులు వొగడ
ఘనమనోవేగంబుఁగైకొని నిగుడఁ జనుదెంచుచున్నట్టి చందంబునందు
ననిలనందనుని మహా సింహనాద మనువార విని యంగదాదివానరులు
పరమహర్షంబునఁ బర్వతాగ్రముల నురువడిఁదెరల నెక్కుచుఁగనుంగొనఁగ
ఘనచాపనిర్ముక్త కాండంబుపగిదిఁ జనుదేరఁగనుఁగొని జాంబవంతుండు
అదె వచ్చెఁబవనజుం డాకాశవీథి మది సంతసింపుఁడు మర్కటులార!
యనవుఁడు నంగదుండాదిగాఁగపులు అనయంబు హర్షించి రంత వాయుజుఁడు
చటులతేజమున నిశ్చలమానసమునఁ బటుసత్త్వ..........
యటుదాటి బలువిడి నాకాశవీథిఁ
బటుసత్త్వదేహసంపద వచ్చివచ్చి
యరుదైనపేర్మితో నబ్ధిమధ్యమునఁ
బరగెడుమైనాకపర్వతాధీశుఁ
గని యందుఁదనమేనఁ గల డప్పి దీర్చి
కొని పర్వతుని వీడుకొని యట వచ్చి[B]
వననిధి వడి దాటి వలనొప్పు మీఱ ననిమిషపతిపౌత్రుఁ డాదిగాఁగల్గు
వనచరపతులు నవారితబలులు మనమున సంతోషమగ్నులై పొంగి
తనుఁ జూడఁగాను బతంగునిభంగిఁ దనుకాంతి నిఖిలదిక్తటములు వెలుఁగ
నిరవొందుచున్న మహేంద్రభూధరము ధరఁగ్రుంగఁగా సమత్వరగతి నుఱికి
యవరోహణము సేసి యర్థిదీపింపఁ బ్రవిమలసంతోషభరితాత్ముఁడగుచు
పొలుపొందఁదనజవంబునుఁ బెంపుసొంపుఁ
దలకొని జలధియుత్తరతీరభూమి
నతిసత్త్వసంపన్నుఁడై వచ్చి నిలువ
నతనిసంతోష చిహ్నములెల్లఁజూచి[వా.రా. సర్గ 56, 57]
యంగదుండాదిగా నగచరోత్తములు
సంగతి నెదురుగాఁజని కౌఁగిలించి
ప్రకటించి యందంద పరిణామ మరసి
యొకట నందఱుఁగూడి యోలిఁగూర్చుండి
పోయినకార్యంబు పొలుపొంద నడుగ
నా యున్నతోన్నతుం డందఱఁ జూచి:[B]
కనుఁగొంటి రామభూకాంతునిదేవి జనకతనూజాత; జగదేకమాత;
శోభనగుణయుతక్షోణిసంజాత; వైభవయుతనీత; వరశుభవ్రాత;
(?)విభవపరాభూత; విశ్వలోపైత; నభిరామయగు సీత ననువంద ననిన
నాతని పల్కులు నమృతసమంబు లై తలంచియుఁ దమయాస్యంబులలర
వీనులవిందుగా విని సంతసించి మేను లుప్పొంగఁగా మింటితో నొఱయ
వాలపాశంబులు వరుసఁద్రిప్పుచును నూల పెట్టుచు నోలి నుర్విఁగూలుచును
గంతులు వైచుచుఁగరములు చరచి యంతంత నార్చుచు, నాడుచు, నగుచు,
సొరిది వానరులును సొంపున నపుడు కరువలిసుతుఁబూజ గావించిరంత
నంగదుండహితసంహారైక విజయ సంగతుం డప్పు డంజనతనూభవునిఁ
బరిరంభణముల సంభావించి యతని కరముఁగరమ్మునఁగరమర్థిఁబట్టి
తరుచరవరులమధ్యమునఁగూర్చుండి యరుసించి మారుతాత్మజుఁజూచి పలికె
వనధి లంఘించి యెవ్వడు బలంబెసగఁ జనుదెంచు మగుడ నీ పాటియే దివిజు
లనఘాత్మ! రఘురాముఁడానంద మొంద జనకజఁగని వృక్షచరులప్రాణములు
గాచితి వింక నా కాకుత్థ్సుకడకు వే చనియెదము నీ విమలసత్కృపను
అని యిట్లు వలికెడు నతని వారించి హనుమంతుఁజూచి ఋక్షాధీశుఁడనియె
శరధి యేగతి దాటి చనితివి? దనుజ పురమెట్లు చొచ్చితి? భూమిజ నెట్టి
వెరవునఁగంటివి? పృథ్వీజ శోక భరముచే నేమని పలికె?దానవుల
మొఱఁగి క్రమ్మఱి యెట్లు ముదమున వచ్చి తెఱిఁగింపు మీ తెఱంగేర్పడ ననిన
వనచరులను జాంబవంతునిఁజూచి హనుమంతుఁడెంతయు నట చెప్పఁ దొడఁగె
“కపులార! యేను మీ కరుణమైఁజేసి
యుపమింప నరుదైన యుదధి లంఘించి[B]
యరుదార మైనాకుఁడను గిరిఁగడచి యురుమతి నరుగ దివ్యులదూత సురస
చనుదెంచి నాదగు సత్త్వంబుచూచి యనిమిషపురి కేఁగె నటుపోవుచుండ
నొలసి దేహచ్ఛాయ నొడిచి రాఁదిగిచి చెలఁగి జీవుల మ్రింగుసింహికఁగడఁగి
పొదివి నిర్జించి యంభోరాశిఁగడచి విదితవిక్రమబలవృద్ధి పెంపొంద
విలసిల్లుచున్న సువేలశైలమున నిలిచి భానుఁడు గ్రుంక నిశ్చలబుద్ధి
నగణితవైభవం.......... ..........
యగణితవైభవంబగు లంకఁజొచ్చి
తగిలి శోధించి సీతాదేవిఁగాంచి
యినకులాధిపుఁడానతిచ్చిన తెఱఁగు
జనకనందనతోడ సకలంబుఁజెప్పి
యింతికి ముద్రిక యిరవొంద నిచ్చి
యింతిశిరోమణి యిట పుచ్చుకొనుచు[B]
వనభంగ మొనరించి వనపాలకులను అనిమొన నిర్జించి యక్షాదిదనుజ
దళములఁద్రుంచి యా దశకంఠసుతుని బలుబాణములఁబట్టువడిపోయి దైత్యుఁ
దూలపోఁబలుమాఱు తొలఁగక పలుక వాలిన కినుక రావణుఁడు భర్జించి
వాలపాశంబున వహ్ని రగిల్చి యా లంకవీథుల నటు నిటు ద్రిప్ప
బోరన బంధవిముక్తుండ నగుచు నా రావణుని పురంబలుక దహించి
వెరవున వాలాగ్ని విషధిలో నార్చి వరుస రావణుకేళివనములోఁజొచ్చి
సీతతో భాషించి సింధువు గడచి యాతతబలముపెంపలరఁ గ్రమ్మఱను
వచ్చితి నే.”నన్న వనచరాధిపులు
నిచ్చలో హర్షించి యెంతయు మెచ్చి
హనుమంతు నందఱు నన్నిచందములఁ
గొనియాడి కొనియాడి కోర్కులఁదేలి
యున్నచో నంగదుఁడురుపరాక్రముఁడు
క్రన్నన నుత్సాహకలితుఁడై పలికె:
“జనకజ మనమింక సాధించి తోడు
కొనిపోయి రఘురాముఁగూర్చుట లెస్స.[B]
జానకిఁదోడ్కొని చనక పోరాదు భూనాథుకడ కటు పో మెచ్చు గలదె?
వనచరవరులార! వారిధిదాటి చనుదము పదము రాక్షసరాజుపురికి
ననుపమాత్మకులార! యట్లు గాకున్న వినుఁడు ఇంకొకమాట విశదంబుగాఁగ
మీరేమిటికిఁదోడు మీ పంపు సేసి వారిధి లంఘించి వడి లంకఁజొచ్చి
దానవావళినెల్ల ధరఁగూల్చి కడిమి పూనితెచ్చెద నేను భూమీశుదేవి
ప్రకట మహోద్ధతి రావణుఁగడఁగి యకలంకతరమగు నగ్నిసాయకము
ఘనవారుణాస్త్రంబు గాంధర్వశరము ననిలసాయకము బ్రహ్మాస్త్రంబు పాశు
పతము నైంద్రము యమబాణంబు మొదలు ప్రదరముల్ పఱప నా బాణజాలముల
మది లెక్కగొనక యమర్త్యవైరులను బొదివి నిర్జించి యా భూమిజఁదెత్తు
హనుమంతుఁడొకఁడు మహావిక్రముండు దనుజులఁబెక్కండ్ర ధరఁగూల్ప నోపు
విజయుండు మైందుండు వృషభుండు నలుఁడు ..........
గవయుండు పవనుండు కఠిన విక్రముండు ద్వివిదుండు నత్యంతధీరవర్తనుఁడు
అంబుజాసనసూనుఁడై వార్తకెక్కు జాంబవంతుని నోర్వఁజాలదు రొరులు
యటుగాన యిప్పు డీ యంబుధి దాటి
పటుపరాక్రముఁడైన పంక్తికంధరుని
సుతులతో హితులతోఁజుట్టాలతోడ
నతిరయంబునఁజంపి యవనిజఁగొనుచు
వత్తములెం.”డన్న వాలిసూనునకు
నత్తఱి ఋక్షేశుఁడనియె భావించి:
“మనల సుగ్రీవుండు మైథిలి వెదకఁ
బనిచినపనులెల్లఁ బావని వలన[B]
.......... వినుతబాహాబల విను(త)తసంపదను
అనిమిషమునివరు లభినుతిసేయ దనుజ గజాశ్వరథంబులతోడ
రావణు వధియింతు రణభూమిననుచుఁ గావించె బ్రతిన యా ఘనుఁడిత్తెఱంగు
నొనరింపఁగలవాఁడు ఒగి నిటమీఁద నినకులాధిపునితో..........
ననఘాత్మ! సఫలంబులయ్యె; నీ మీఁద
నినకులాధిపునితో నీ వార్త దెలుపఁ
బోవుట దగు.”నన్న బుద్ధి నొండొరులు
భావించి దాని కేర్పడ సమ్మతించి
వనచరుల్ నాఁ డెల్ల వార్ధితీరమున
ననిలసూనుఁడుఁదారు నర్థితో నుండి
బహుమూలఫలములఁబరితృప్తినొంది
మహితసత్త్వాధికుల్ మఱునాఁడు గదలి[వా.రా. సర్గ 58-60]
ధరణిపై మేరుమందరములకంటెఁ
బరపైనదర్దుర పర్వతంబునకుఁ
జనుదెంచి యగ్గిరిసానుదేశముల
వనమూలఫలములు వడి నాస్వదించి
యా యద్రిపతిమీఁద నా రాత్రి నిలిచి
యాయతభుజశక్తులంత వేగుటయు: