ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
శ్రీరాముఁడు హనుమఁ గొనియాడుట
శ్రీరామచంద్రుఁడాశ్రితహితోదయుఁడు
వారిజబాంధవ వంశవర్ధనుఁడు[వా.రా. సర్గ 1]
ప్రియములయందెల్లఁబ్రియమైనయట్టి
ప్రియవాక్య మంజనాప్రియసుతుచేతఁ
బ్రియమున విని తన ప్రియసతి యునికిఁ
బ్రియము1న భావించి ప్రీతితో ననియె:
“హనుమంతు చేసినయంతకార్యంబు
చనునె చేయంగ నిర్జరులకునైన!
నరయ సత్త్వమున నీ హనుమంతుఁడొండెఁ
గరువలియొండె, నగ్గరుడఁడునొండె,
వనధి దాటఁగఁజాలువారలుగాక!
మనమునఁదలపోయ మఱి యెవ్వఁడోపు?
దేవగంధర్వదైతేయ2 కిన్నరులు
భావించి చొరరాక పగలును రేయు
రాక్షసానీక విరాజిత బాహు
రక్షితంబగు లంక రయమునఁజొచ్చి
ప్రాణంబుతోడన బ్రదికి క్రమ్మఱఁగ
నేణాంకధరుఁడైన నెట్లు రానేర్చుఁ?
గడు3మోదమునఁబెద్దగార్యంబు పతికి
వడిఁజేయు నెవ్వఁడు వాఁడుత్తముండు;
ఏలినపతి కార్య మెడరైనయెడను
4వాలూర నటు చేయువాఁడు మధ్యముఁడు;
పలుమాఱు5మూల్గుచుఁబతివంచుపనికిఁ
దొలఁగఁ6బాఱెడువాఁడు దుస్సేవకుండు
ఈ మూవురందును నెక్కువయైన
యా మేలివాఁడయ్యె నఱ యింత లేక
యనురాగమునఁబెద్దయైన నా కార్య
మనుపమంబుగఁజేసె ననిలనందనుఁడు.
కావునఁబ్రత్యుపకార మీతనికి
నే విధంబునఁజేయ నే నేర్చువాఁడ?
నాలింగనంబె నా యర్థ.”మంచతని
నాలింగనము సేసె నప్పుడవ్విభుఁడు.
ఈ రీతి మెచ్చి యా యినసూతి వినఁగ
నా రాముఁడనియె నా యాంజనేయునకు;
“ననిలతనూజ! నీ వంబుధి దాటి
జనకజఁగని రాఁగ సంతోష మొదవె.
నిట నాకుఁబొడమిన యీ ముదంబెల్ల
నిటమీఁద మఱి తుద7నెట్లౌనొ8కాని.
యది యెట్టిదంటేని నగ్గలంబైన
యుదధి లంఘింపంగ 9నోపెడి 10వెరవు
కపిసేన కెబ్భంగిఁగలుగునో యనుచుఁ
గపినాథ! నా మది గలఁగంగఁజొచ్చె.”
ననిపల్కి యటమీఁద నాస్యంబు వంచి
మనుజేశుఁడేమియు మఱి పల్కకున్న
శ్రీరామదేవుని చిత్తంబుకలఁక
నా రవిజుఁడు మాన్తు నని విచారించి:[వా.రా. సర్గ 2]
“యిది యేమి దేవ? నీ వితరులభంగి
మదిలోన శోకంబు మాన11వెప్పుడును?
దాటరా దననేల? 12దాటుద; మబ్ధి
దాటి సువే13లాద్రి దాటి యా లంక
సాధించి రావణుఁజంపి లోకముల
బాధ మా14న్చెదము భూపాలకా! చూడు
ముర్వీశ! కపులెల్ల నుద్యోగ15పరులు;
16దోర్విభవాఢ్యులు దుర్జయక్రములు.
వీరుండ రాఘవోర్వీనాథ! నీకు
వారక యిబ్భంగి వగవ నేమిటికి?
నుద్యోగి వగుము; సముద్యోగి కెందు
సద్యఃఫలంబులు సకలకార్యములు.
నుత్సాహియగువాని కులుకుదు రహితు
లుత్సాహ రహితున కులుకరు17గాని.”
యని18యతఁడిబ్భంగి నాడు వాక్యములు
విని హనుమంతుతో విభుఁడర్థిఁబలికె:
“వేఁడుదుఁ; గాదేని వెడలు నా యంప
వాఁడిమినైనను వార్ధి నింకింతు;[వా.రా. సర్గ 3]
బంధింతు19ఁగాదేని20ఁ;బవనతనూజ!
కంధి దాటుట యెంతగగనంబు నాకు?
నది యెంతపని21విను మనిలనందనుఁడ!
పదిశిరంబులవాని పట్టణంబునకు
నెన్నికోటలు? బలమెంత వీక్షింప?
22నన్నిటి గవనులు నవి యెవ్వి23ధంబు?
కావలియుండు రాక్షసు24లెందఱందు?
భావింపఁదద్గృహపంక్తులే తెఱఁగు?
చూచివచ్చితి25కాన చూచిన తెఱఁగు
నీ చేత వినియెద నిక్కంబు సెపుమ.”
యనిన నంజలి మోడ్చి యాంజనేయుండు
వినయోక్తులెసగ నవ్విభున కిట్లనియె:

  1. ↑రెట్టింప సం, రెట్టించిన ప్రీతి (ప్రియము)
  2. ↑ముఖ్యులకు
  3. ↑నెయ్య
  4. ↑వాలాయముగఁజే
  5. ↑మునుకుచుఁ
  6. ↑జారెడు
  7. ↑నెట్టిదో
  8. ↑తెలియ
  9. ↑నోపరెవ్వరును
  10. ↑తెరువు
  11. ↑వయ్యెదవు
  12. ↑దాటెద వబి
  13. ↑లయు
  14. ↑న్పెదవు
  15. ↑యుతులు
  16. ↑దోర్విక్రమా
  17. ↑గాక
  18. ↑యినసూనుఁడిట్లా
  19. ↑నొండేని
  20. ↑బాణజాలముల
  21. ↑యిప్పు డనిల
  22. ↑నెన్నిగవను లవి యెవ్విధంబుండు
  23. ↑ధములు
  24. ↑లెవ్వరందు
  25. ↑కదా
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )