| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“నుడు26గక మదధార లొలుకుచు నుండఁ గడు27నొప్పుపర్వతాకారంబు లగుచు రౌద్రంబు మోముల రంజిల్లుచుండు భద్రదంతావళప్రతతు లగ్గలము. పెక్కాయుధంబులఁబెరిగి చూడ్కులకు నక్కజమై ఘోరమై 28కనుపట్టు గొడగులుఁబడగలుఁగొమరారు29పెక్కు నడియాలములుఁడెక్కియంబులుఁగ్రాల భానుబింబప్రభాపటలంబుపగిది మానైనమణిదీప్తిమహి30మ 31వెలుంగు రథికసారథిమనోరథములై యుండు రథములెక్కుడు దశరథరాజతనయ! ఘనవీరరసవార్ధికరడులో యనఁగఁ దనరారి యెంతయుఁదఱచువన్నియల మెఱసి32చూడ్కులకును మిఱుమిట్లు33గొలుప వఱలిన హేషారవంబులు సెలఁగ హరి ఘోటకంబులనైన వేగమున హరియింప నోపినహరిశక్తి గలిగి హరులెంతయును మనోహరములై యుండు హరి34వాజు35లను మెచ్చనట్టి వగ్గలము. పిడుగులతోడఁబ్రబ్బిననల్లమొగుళు లడరి దానవరూపు లయ్యెనోయనఁగఁ గాదేని హరుఁడు 36మ్రింగఁగఁబడ్డగరళ మీ దైత్యకోటియై యెసగెనో యనఁగఁ బ్రలయకాలమునాఁటి పావకధూమ మలవడ రాక్షసు లైరొకో యనఁగ నేర్చి రౌద్రముతోడ 37నెనయించి నడపు గూర్చిన నల్లనికొండలో యనఁగఁ గలిగినయట్టి రాక్షసు38లకు సంఖ్య గలుగదు దేవ! రాఘవధరాధీశ!39 అజుఁడాదిగా సుర లలమిననైన భుజబలంబున వారిఁబోలంగ లేరు. ఉర్వీశ! లంకలో నున్నతంబగుచు సర్వలోకంబుల సరిపోల్చరాని మానైనకోటలు మఱి యేడు గలవు వీనుల కింపుగా విన్నవించెదను: 40జుట్టు లోనట్టళ్లు చూపట్టునట్టి. యిట్టికకో టొప్పు నిక్ష్వాకుతిలక! యా లోనఁగలుకోట;యం41దుక్కుఁగోట; జాలకంబుల నొప్పుసరిరాగికోట; దంచనంబులతోడఁదగిలి యిమ్మైన కంచుకోటొక టొప్పు కమలాప్తవంశ! యజభవాదులకైన42నరిగొనరాని రజతంపుఁగో టొప్పు రాజేంద్రతనయ! మణి43మరీచులతోడ మానైనమహిమ ప్రణుతింపఁగల దందుఁబసిఁడికోటొకటి. కాలునివక్షంబుకరణిఁ44బల్పెక్కు మేలైనతలుపుల మెఱసి యెంతయును నక్కోటలన్నింటియందును జూడ మిక్కిలిదీప్తుల మిక్కుటంబగుచు నఖిలరత్నముల మేలైనవాకిళ్లు నిఖిలావనీనాథ! నెఱి నాలుగేసి. వరయంత్రవిధుల దివ్యంబు లైనట్టి శరచాపచయము లసంఖ్య45ంబు లందు46 నా కోటచుట్టును నఖిలలోకేశ! భీకరమకరసంభృతములై పరగు నాలు47గునడవలు నాల్గగడ్తలును జాలంగఁబాతాళ48సదృశమై యొప్పు. దేవ! యా నాలుగు తెరువులయందుఁ గావలి పెక్కురాక్షసకోటులుండు. నమితశిలాబాణయంత్రజాలములు తమతమయంతన దాయలఁజంపు. నవియన్ని యిట్టిట్టివని యెన్ననేల? యవనీతలేశ! మహావైభవమున వారక సేనతో వాహ్యాళి వెడలి యా రావణుండు నిత్యము49ఁదోడుసూచు వాలినమదమున వడిఁగయ్యమునకుఁ గాలుదువ్వుచు నుండుఁగమలాప్తవంశ! యగ్గలికయు లావు నడరువైరులకు లగ్గవట్టఁగ రాదు లంక భూనాథ! జల వన కృత్రిమ స్థల శైల దుర్గ ములు50నాలుగుండు సముద్రంబులోన నది యెల్లకాలంబునందును; గాని కదియఁబోవఁగ రేవు గానంగరాదు. మృత్యుజిహ్వనుబోలి మెఱుఁగులతోడి యత్యుగ్రశూలంబు లనిశంబుఁబట్టి కడు నుగ్రదైత్యులు గాచియుండుదురు పడుమటివాకిటఁబదివేలసంఖ్య. లక్షదైతేయు లా లంకాపురంబు దక్షిణద్వార ముద్ధతిఁగాతు రెప్పు. డట దూర్పువాకిట నమరారి యుండుఁ బటుతరచతురంగబలసమేతముగ. నగణితశస్త్ర సహాయమై యుండుఁ దగ నొక్క లక్ష యుత్తరపువాకిటను. జాలురాక్షసులు లక్షయు నిర్వదేను వేలు దత్పురమధ్యవీథి నుండుదురు. ఆ లంక మీ కృప నర్కకులేశ! యే లీలఁజొచ్చితి నింతగైకొనక; వడిఁజొచ్చి యా నడవలు గూలఁదన్ని యడరి కోటలు51ద్రవ్వి యగడితల్ పూడ్చి యచ్చెరువుగ లంకయంతయుఁగాల్చి వచ్చి మీ శ్రీపాదవనజముల్ గంటి. నడిగి యక్కడికార్యమంతయు వింటిఁ. దడయ నేటికి? నబ్ధి దాటుద మింక. దాటినయప్పుడే దశకంఠులంక మీటివైచెదరు వ్రేల్మిడిలోనఁగపులు.” అనవుడు రఘురాముఁడర్కజుఁజూచి: “యినసుత! యాలస్య మేటికి? నింక52[వా.రా. సర్గ 4] వెడలింపు కపిసేన విజయలగ్నమునఁ; గడులెస్స మధ్యాహ్నకాలంబు53నందు. నా యస్త్రమును54 దక్కనరభోజ55నునకు నే యుపాయముగల? దెందు56 దాఁగెడిని?” అని నీలుదెసఁజూచి యర్కవంశజుఁడు: వినుమని బుద్ధిగా వెసఁజెప్పె నపుడు: “కడు నింపుదనమును గడు నిర్మలంబుఁ గడు తీపుఁగల 57నీరు గలుగంగఁజూచి పరిపక్వఫలములభరితంబులైన 58తరువులనీడలు తఱచైన త్రోవ నడ 59వుము ముంగలి నలిఁజొరనీక; వడిఁబరికింపు 60మొవ్వనిలాతివారి.” ననిన నా రామునియానతి61యెల్ల విని నీలుఁడట్ల కావించె శ్రీఘ్రమున. నప్పుడు సుగ్రీవుఁడఖిలవానరులఁ దప్పక రావించి దండెత్తఁబనిచెఁ. |