| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
బనిచిన 62నందంద పటురభసమున ఘనగుహలందుండి కపిసేన వెడలె. భూరిపదా63ఘాతమున నుప్పతిల్లు ఘోరరవంబున గుహలు ఘూర్ణిల్ల వీరగర్జనములు వీరహాసములు వీరనాదంబులు వెస నింగిముట్టఁ బెల్లుగాఁగొందఱు పెడబొబ్బ లిడుచుఁ ద్రుళ్లుచుఁబటుశక్తితో దాటువారుఁ; 64గొందఱు పండినకుజములు మూపు లందిడి నమలుచు నరిగెడివారు; ‘రావణుతోఁగూడ రాక్షసప్రతతి నే విధంబుననైన నేమె చంపెదము రామభూపాలక! రణములో.’ననుచు రామునిముందఱ రాగిల్లువారుఁ; గెరలిపై నెగురుచుఁగేక వైచుచును వెరవాఱఁదోఁకలు విసరి యాడుచును జెచ్చెఱఁబర్వతశిఖరంబు లెక్కి యిచ్చఁగొందఱు బొబ్బలిడువారు నగుచు; నప్పుడు కపివీరు లందఱు65ఁజెలఁగి రప్పరమేశ్వరుఁడానందమొంద. నా రవంబున మ్రోసె నాకాశవివర; మా రవంబున మ్రొగ్గె నష్టదిగ్గజము; లా రవంబున భారమయ్యె శేషునకు; నా రవంబునఁగూర్మ మడఁచె శిరంబు. నిటు సేన నడవంగ నెగసినధూళి పటలంబు మిన్నందె బహువర్ణములను ఆ రవంబున భారమై యిల66నెసగు తోరంపునిశ్వాసధూమంబు లనఁగ. నప్పుడు ముంగలియై నీలుతోడ నొప్పెడు సైన్య మత్యుగ్రతుండముగ, నిరుదిక్కులందును నేపారినడచు తరుచరబలము లుద్ధతపక్షములుగ, స్ఫురణ మొప్పఁగ మధ్యమున వచ్చు రామ ధరణీతలేశుండు 67తన యాత్మ గాఁగఁ, గడిమిసొంపా68రి చక్కఁగ వెన్కఁగాచి వడి వచ్చుసైన్యంబు వాలంబు గాఁగ, నురగపాశంబుల నొందంగనున్న తరణివంశ్యుల యవస్థలు తొలంగింప గరుడుండు భూస్థలిఁగైకొని నడచు కరణి నొ69ప్పారె మర్కటమహాసేన.70 సరి ప్రజంఘుండుఁగేసరి దధిముఖుఁడుఁ బరువడి సందడిఁబాయ 71ద్రోవఁగను జనుదెంచి రఘుపతి సహ్యపర్వతముఁ గని యందు విడిసె లక్ష్మణసమేతముగఁ. బెంపారువనములఁబెనుతటాకముల నింపారు72నీడల 73నెడలేని తరుల విడిదలల్ గైకొని వెలయ నబ్బలము విడిసె సుగ్రీవుండు 74విడియంగఁబనుప. మఱునాఁడు నెప్పటిమాడ్కి లక్ష్మణుఁడు తఱిమి సేనయుఁదానుఁదద్దయు నడవ, దొరలు మహీపతిఁద్రోచి యేఁగఁగను ధరణి గ్రక్కదలంగఁదరుచరుల్ నడవ, నురువీరరసమున నుప్పొంగి పొంగి భరితసత్త్వంబునఁ బరపొంది పొంది తనుకాంతికరడులఁ దనరారి యారి ఘనమైన మ్రోఁత నాకసమంది యంది మునుకొని75వరశైలముల నొప్పి యొప్పి మనువంశచంద్రుచే మది నుబ్బి యుబ్బి యా సముద్రముపెంపు నడఁగింప నడచె భాసురంబగు కపిబలసముద్రంబు. ధైర్యాఢ్యు లా మహీధవు లభ్రమధ్య సూర్యచంద్రులమాడ్కి శోభిల్లి. రంత: నదు76లలోఁజొచ్చి వానరసేన నడవ నెదురు 77దొట్టుచు నుబ్బె నెగసి యా నీరు సహ్యాద్రి మలయాద్రి సందులనడవ సహ్యమై కపిబలసమితితోఁబొడము చిఱుగాలిచేఁ దరుశేఖరప్రతతు లొఱపైన కొమ్మలొండొంటితో రాసి యగచరావళిమీఁద నలరులు రాల్చెఁ; దగ నట్టిదయకాదె తలపోసిచూడ వనలక్ష్మి యా రామవల్లభు78ఁజూచి యెనయఁబుష్పాంజలు లీ కేలమాను. నప్పుడు కపివీరు79లయ్యద్రియెడల నొప్పెడికొలఁకుల నురువడిఁజొచ్చి యా నిర్మలోదక మారంగఁ గ్రోలి యానందమునఁబొంది యందంద కదిసి కమనీయమృదుకరకమలయుగ్మములఁ గమలముల్ ద్రుంతురు80గములుగాఁబట్టి “కమలాకరంబ! మా కమలాప్తకులుఁడు కమలారి యుద్ధతిఁగమలముల్ ద్రుంచు క్రమమొప్పఁగా దశకంధరువదన కమలముల్ ద్రుంచు.“నన్‌కరణిఁజెలంగి. ‘తొగలు దట్టింతుము దుష్టారిసతుల తొగలు జానకి యింకఁదొలఁగంగవైచుఁ దొగలార!యిటమీఁదఁదొగ యిట్టి.’దనుచు దొగలెల్లఁజిదిమివైతురు పెచ్చుపెరిగి. బిరుదులై యసురులప్రేవులు వెఱుకు కరణిఁబెర్కుదు రోలి ఘనమృణాళముల. నిటు వినోదించుచు నెల్లవానరులు తటములమీఁది కుద్ధతశక్తి దాటి గిరులెక్కి పణఁకులఁగ్రిక్కిఱి యంగఁ బెరల తేనియ లాని81పెన్నీరు గ్రోలి కడు నుత్సహించి యుత్కటబలాధిపులు నడచిరి వానర నాయకోత్తములు. |