| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నని రామవిభుఁడు శోకాంబుధిలోన మునుఁగుచుండఁగ మూఁడుమూర్తులు గలిగి యతనితోడిదె లోకమనిన చందమున నతివేగమున నినుఁడపరాబ్ధిఁగ్రుంకె. నినుఁడు గ్రుంకినయప్పు డెల్లలోకములు పెనుపేది మణిలేని పెట్టియఁబోలె. మనసిజానలతప్తమానసు రాముఁ గనుఁగొని తనుపుగాఁ గప్పెడు కొఱకుఁ 92జెలువొంద నపరాబ్ధి చెంగావిచీర నెలమిఁదెచ్చినక్రియ నెఱసంజ యొప్పె. ‘నినవంశచంద్రుచే నింద్రారిమోము లనయంబు నిటు వాడు’ ననినచందమున దలములబిగు93వెల్లఁదఱిఁగి యందంద లలి94ఁదక్కుచును గమలంబులు మొగి95డెఁ. జెలువుగా రామునిశీతలక్రియకు నలిరేఁగి యాశాంగనలు గూడవైచు లలిత తమాలపల్లవ రాసులనఁగఁ గలయంగ 96దెసలఁజీకటి 97పర్వఁజొచ్చె. ‘దిననాథకులుదేవిఁదెచ్చి మోదించు దనుజనాథు98నకు ముదంబులు విరియు’ నని నగియెడిమాడ్కి నప్పుడందంద దనరారఁగాఁ గుముదంబులు విరిసె. ‘శ్రీరామదేవుని శిత99మార్గణముల నా రత్నములు దక్క నంబుధి యింకి యీ రూపమున నుండు నిఁక’ ననుమాడ్కిఁ దారకావళిచేతఁ దనరారె మిన్ను. ఆ నిశీథిని రాము నంగతాపంబు కై నిబిడంబుగా నమరించియున్న సారంపుమల్లికా శయ్యనా నొప్పి తారలు ప్రతిబింబితములయ్యె నబ్ధి. ‘విరహంబుచే రామవిభుఁడును జిక్కె; నరిదియే విరహుల మౌటమే!’మనుచు దెసలకుఁజెప్పెడు తెఱఁగునఁబాసి వస మఱి వెసఁజక్రవాకముల్ సనియె. ‘రాజనై యేను వారాశి యుబ్బింతు; రాజవై నీవు వారాశి యింకింపఁ దలఁచుట పాఁడియే ధరణీతలేశ!? విలసితసత్కళాన్వితుఁడవు నీవు; నటుచేసితేని దోషాకరత్వంబు పటువృత్తి నీయందుఁబ్రభవించు.’ననుచు దూఱవచ్చినమాడ్కిఁదోచెఁజందురుఁడు మీఱినకరములు మిన్నులుముట్ట. ‘జనకజకై రామజననాథతిలక! ననుఁదలఁదాల్చి మన్నన చేసినట్టి హరువిల్లు విఱిచిన యా దోషమునను విరహివైతివి సీతవెఱవున’ననుచుఁ జందురుఁడట్టహాసము చేసె ననఁగ నందంద చంద్రిక లతిశయంబందె. శరనిధి నురువనుచందనంబర్థిఁ గరమొప్పు వీచికాగణములపేరి కరములఁ100దిగిచి దిక్కాంతలమేనఁ బొరిఁబొరి 101నా రాజు పూసెనో యనఁగఁ దలకొని మఱియును దట్టమై పర్వి వెలయంగ నచ్చపువెన్నెల యొప్పె. నప్పుడు వేడుక నా చకోరంబు లొప్పుచిత్తములఁబెంపొలయంగఁ గదిసి పొరిఁబొరిఁదమచంచుపుటములు సాఁచి నిరతంబుగాఁగ వెన్నెల పుక్కిలించి లలితోడఁదమప్రియలకు నిచ్చి యిచ్చి యెలమితో నవి యందియీఁగ్రోలిక్రోలి మలసి యాడుచుఁబలుమఱు సోలిసోలి పొలుచువెన్నెలరసంబులఁదేలి తేలి గమిఁబాసి యెడ గలుగఁగఁ దారితారి కొమరారి యింతులఁగూడి యుండుటయుఁ గనుఁగొని మదనమార్గణపాతభిన్న తనుఁడైన రాముఁ డా ధరణిజఁదలఁచి యంతకంతకు మదనాగ్నిచేఁ102గంది యంతరంగంబున నడలుచు నుండె. నప్పుడు లక్ష్మణుండన్న సంతాప ముప్పొంగుటయుఁజూచి యుడుపంగఁ దలఁచి: “యిదె యబ్ధి దాటుద, మిదె దాటిపోయి పదిశిరంబులవానిఁ బటుశక్తి నాజి భంజించి మిథిలాధిపతికూర్మిపుత్రిఁ గంజాస్యయగు సీతఁగైకొనె దధిప! యసమాన103వీరుఁడ; వారూఢమతివి; 104వసుధేశ! నీ కింతవగవ నేమిటికి?” ననవుడు తమ్మునియనునయంబునకు జననా105థుఁడెంతయు సంతోషమందె. నాదట వెన్నెలయందు వానరులు మోదంబుతోడ నిమ్ముల నెల్లకడల నా రామదేవుగుణాంకంబు లింపు లారంగఁబాడుచు నాడెడువారుఁ, గూడి యా జలనిధికూలంబునందు వేడుకతో106నుబ్బి విహరించువారు, హరియవతారంబులన్నియుఁ గథల వెరవున నింపుగా విను107పించువారుఁ, గరఁగిన యా చంద్రకాంతోపలములఁ బరిణమింపుచు మెచ్చి పవళించువారు, నయి ప్రొద్దు గడపి ప్రియంబునఁబొదల రయమున నంతఁబూర్వమునఁగెంపెసగె జలనిధి రాఘవేశ్వరుఁడేయునపుడు బలుశిలీముఖములఁబడుదునో’యనుచుఁ గడువేగ తొలఁగి యా కంపంబునొంది బడబాగ్ని యుదయాద్రిఁబ్రాఁకెనో యనఁగ. ‘రాముబాణాగ్ని వారాశి దహించు చో మిన్ను ముట్ట నర్చులు పర్వు’ననుచు వెఱచి తొలం108గిన విధమునఁగ్రుంకె నెఱసిన చుక్కలన్నియుఁ దోడుతోడ. ‘నిదియేల తడసెద? వీ యబ్ధిఁగట్టి వదలక చంపు రావణు రాఘవేంద్ర!” యని మనుమనికిఁదోడై రేపకడను జనుదెంచె ననఁగ భాస్కరుఁడుదయించెఁ. గమలాప్తకులుని రాఘవుని సద్విజయ కమలయుఁదద్రాజ్యకమలయుఁగీర్తి కమలయు నెఱిమేలుకనిన చందమునఁ గమలంబులెల్ల నొక్కట మేలుకనియె. నప్పుడు దగిన సంధ్యాదికృత్యంబు లొప్పంగ సలిపి రా యుర్వీశు. లంత |